Sunday, October 11, 2009
e బంధం .....
విరహము కూడా సుఖమే కాదా ...నిరతము చింతన మధురము కాదా ...అన్నాడో మహాకవి . విరహము సుఖమో కాదో కానీ నిరతము చింతన మాత్రం మధురమే సుమా !ఆ చింతన ఒక కొత్త బంధం చుట్టూ అల్లుకోవడం మరింత మధురం .
తప్పనిసరి ప్రయాణం ! తిరిగి రావడానికి చాలారోజులు పట్టొచ్చు .ప్రయాణ కారణం శుభప్రదమె అయినా బయలుదేరుతుంటే ఏదో మర్చిపోయినట్టు ...నాలో ఒక భాగాన్ని వదిలి వెళ్తున్న ఫీలింగ్ !
ట్రైన్ గమ్యస్థానం చేరుకుంది .ట్రైన్ దిగేసరికి అన్నయ్య కొత్త డ్రైవర్ కంపార్ట్మెంట్ దగ్గరే రడీగా ఉన్నాడు అక్కడ్నించి కార్లో మా ఊరికి అరగంట ప్రయాణం దారిపొడవునా పచ్చని పైర్లు ..వరిచేలపై రాత్రికురిసిన మంచు బిందువులు ముత్యాల్లా మెరుస్తూ ...అయినా మైండ్ ఆప్సెంట్ !
వీరభద్ర స్వామి బోణం జరుగుతోంది ఈ విశేషాలు ఎప్పుడు రాయాలా అన్న ఆలోచనే ! షాపింగ్ చేస్తున్నాం ..కర్పూరదండలు ,మధుపర్కాలు ,తలంబ్రాల చిప్స్ ,ముత్యాలు ఏవి కొంటున్నా మనసు మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతోంది.
పెళ్లి తంతు జరుగుతోంది మంత్రోచ్చారణ , మంగళ వాద్యాలు , తలంబ్రాలు , కొంగుముళ్ళూ , అరుంధతీ దర్శనం ఏది చూస్తున్నా ఎవరెవరో నా చెవిలో వాటి అర్ధం వివరిస్తున్నట్టు ...నేను చదివిన విషయాలు గుర్తుకొచ్చేశాయి .
కాస్త ఖాళీ దొరికితే చాలు ఏదో వెలితి మనసెటో వెళ్ళిపోతోంది ....ఎందరు బంధువుల మధ్యనున్నా ఎవరో ఆత్మబందువును మిస్ అవుతున్న ఫీలింగ్ ! ఎట్టకేలకు అన్ని కార్యక్రమాలూ పూర్తయ్యాయి విజయవంతంగా రెండు పెళ్ళిళ్ళూ ...మూడు గృహప్రవేశాలూ ముఖ్య అతిధిగా పూర్తిచేసుకున్నా ! ఇక బయలుదేరదామంటే శుక్రవారం సెంటిమెంట్ అన్నారు .ఇక ఒక్కరోజుకూడా ఆగలేను అనుకొంటూ శనివారం బయలుదేరి వచ్చేశా !
నా నేస్తాన్ని కలుసుకోవాలన్న ఆత్రుత ! ఇప్పటికే మీకర్ధమై ఉంటుంది నేనేం మిస్ అయ్యానో ...బ్లాగ్ మొదలు పెట్టాక ఇంత గాప్ ఎప్పుడూ రాలేదు దాదాపు నెల ! ఇంటికి రాగానే గబ గబా సిస్టం ఆన్ చేశాను ఈనాటి e బంధం ఏనాటిదో అనుకుంటూ .....
మిత్రులారా ....miss you all.....
Subscribe to:
Post Comments (Atom)
నేనూ మిమ్మలిని చాలా మిస్ చేసాను ! మీ పరిమళం కనిపించకపోతే రేడియో లో ప్రకటన కూడా ఇద్దామా అనుకున్నాను .
ReplyDeleteస్వాగతం .
అవును నిజమే eeనాటి eeబంధమేనాటిదో!నెలరోజుల మీ ఊరి అనుభవాలు మాకూ పంచండి మరి.
ReplyDeleteWe too miss U....
ReplyDeleteఎన్నిసార్లు అనుకున్ననోనండి ఈమధ్య....పరిమళంగారు మౌనం వహించారెందుకో అని...ఎక్కడికన్నా వెళ్ళినా ఇన్నిరోజులా...ఏమన్నా బాగోలేదా?అని కుడా అనుకున్నాను.ఎవాళో రేపో మనవాళ్ళెవరినైనా అడుగుదాం అనుకుంటున్నాను..ఈలోగా మీ టపా కనిపించింది....WELCOME bACK...We miss you too...!!
ReplyDeleteపరిమళం గారు,
ReplyDeleteమొన్న ఓ పది రోజులు దసరా కోసం ఇంటికి వెళ్ళానో లేదో తిరిగి వెనక్కి వచ్చినప్పుడు నాకు కూడ సేం ఇలానే అనిపించింది. అప్పుడు నేను బ్లాగులకు మరీ అడిక్ట్ అవుతున్నానా అని ఆలోచించాను..ఇప్పుడు అర్దం అవుతుంది...మనందరిదీ ఇదే పరిస్థితి అన్నమాట..
ఒక చిన్న కాంప్లిమెంట్, మనం చెయ్యగలం అన్న భరోసా పొందటం, కొంచెం సవరణ, చనువుతో కొద్దిపాటి మందలింపు..ఇలాంటివెన్నో కలబోసుకున్న మన బ్లాగు, బ్లాగ్మిత్రుల పరిచయంతో నిజంగానే మనకు తెలీని బంధం ఏర్పడిపోతుంది.
we also miss u mam...
We too miss you:,(
ReplyDeleteమీ కామెంట్ నా బ్లాగ్ సంవత్సరీకం లో కనబడక పోయేటప్పటికి బ్లాగ్సన్యాసం చేసారేమో అనుకున్నా, వొకే సారి మీ కామెంట్ నా బ్లాగ్ లో కనబడడం , మీ పోస్టింగ్ కుడా కనబడడం తో
ReplyDeleteమనమంతా కలిసి మెలిసి కలిసి మెలిసి మనమంతా
వొక బాటను వొక పాటను వొకటి గా నడవాలి
యి బ్లాగు జబ్బుని కలిసి పంచు కోవాలి అని పాడుకుంటూ వచ్చేసా .
అందరి ధీ అదే స్థితి , చెప్పుకోలేని పరిస్తితి.
పడ్డా మండి బ్లాగ్ లో మరి ,విడ్డురంగా వుంది లే ఇది .
అవునండి, ఒక్క రోజు కూడా ఒదిలి ఉండలేని పరిస్థితి. ఇంక ప్రతిరోజు మీ పోస్టులు చూడచ్హు. తప్పకుండా వెంటనే రాసేయండి.
ReplyDeleteనేనూ అంతే. ఎన్నిసార్లు చూసి వెళ్ళానో. ఈ ఉదయం ఎక్కడో మీ వ్యాఖ్య చదివానని రూఢీ చేసుకుందాము బ్లాగ్లోకంలోకి అడుగిడారా లేదాని వచ్చాను. పునఃస్వాగతం పరిమళం గారు.
ReplyDeleteఇదా సంగతి... ఏమయ్యారో అనుకున్నా... నెలరోజుల విశేషాలూ రాసెయ్యండి మరి...
ReplyDelete@ మాలాగారు , ఈసారి కనపడకపోతే కూడలిలో ప్రకటన ఇద్దురుగాని :)
ReplyDelete@ విజయమోహన్ గారూ ! ప్రయత్నిస్తానండీ ....
@ పద్మగారు ,థాంక్స్ !
@ తృష్ణ గారు ,మీక్కూడా ....
@ శేఖర్ గారూ ! "ఒక చిన్న కాంప్లిమెంట్, మనం చెయ్యగలం అన్న భరోసా పొందటం, కొంచెం సవరణ, చనువుతో కొద్దిపాటి మందలింపు..ఇలాంటివెన్నో కలబోసుకున్న మన బ్లాగు, బ్లాగ్మిత్రుల పరిచయంతో నిజంగానే మనకు తెలీని బంధం ఏర్పడిపోతుంది" ఎంతబాగా చెప్పారండీ ...మళ్ళీ మళ్ళీ చదువుకున్నాను .
@ భావన గారు ,ధన్యవాదాలు .
@ రవిగారూ ! నిజంగా ......నిజంగా ....ఇలా ఈ ఏడే తొలిసారిగా ...... :)
@ జయగారు , తప్పకుండానండీ .....
@ ఉషాగారూ ! రాగానే మీ జలపుష్పాభిషేకంలో పాలుపంచుకొనే అవకాశం ఇచ్చారు .ధన్యవాదాలండీ ....
@ మురళిగారు ,ప్రయత్నిస్తానండీ ...మీరే ఇన్స్పిరేషన్ మరి !
dwitiya vighnam ante ento anukunna..30 days gap anna mata
ReplyDeleteNo doubt .. you are addicted :) welcome to the club
ReplyDeleteమీకు మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు .
ReplyDelete