Sunday, August 2, 2009

మీరెక్కడ ??


గుర్తుకొస్తూంటాయి ఆనాటి రోజులు ...
మన స్నేహ బంధం ....
చిన్ననాడే చిగురించిన మన అనుబంధం !
కలకాలం వీడిపోదనుకున్న సుమగంధం ..
బదిలీ రూపంలో విధి ఆడింది నాటకం
విడిపోయాం మన నలుగురం .
దూరమౌతున్నప్పుడు మనం
కలిసి ఏడ్చిన ఫ్లాట్ ఫాం......
ఎందర్నిలా విడదీసి మూటకట్టుకుందో పాపం!
మీ జాడ తెలియక తల్లడిల్లిన వైనం
మీకు తెలీదేమో నేస్తం !
ఈనాటికీ నామదిలో మీస్థానం పదిలం
మీకోసం వెదుకుతూనే ఉంటాను
నా జీవితపు చివరి మజిలీ వరకూ
గడువు పూర్తై నే వెళ్లి పోయాననుకో ....
అయినా ఫరవాలేదు నేస్తం
ఇంకా ఆరు జన్మలుంటుంది నాకు
మిమ్మల్ని కలిసే అవకాశం !!

**చిన్ననాడే నాన్నగారి బదిలీ కారణంగా విడిపోయిన నా స్నేహితులు లలిత , పరిమళ , కిషోర్ లకు ఎక్కడున్నా స్నేహపూర్వక శుభాకాంక్షలు .

18 comments:

  1. విడిపొయిన నా స్నేహితులంతా గుర్తు వచ్చారండి..అసలు విడిపొమనుకున్న స్నేహాలు కొన్ని కాల చక్రాల క్రింద,బాధ్యతల నడుమ,నేటి స్పీడ్ యుగం తాలుకూ పొటీలొ పడి కొట్టుకు పోయాయి....నిజమైన స్నేహం చివరిదాకా నిలిచి ఉంటుంది అని ఎంత నమ్మాలనుకున్నా...కొన్ని వాస్తవాలు నమ్మనియవు....!!

    ReplyDelete
  2. మీకు కూడా న " స్నేహితుల దినోత్సవపు శుభాకాంక్షలు. " ఎక్కడ వున్నా మీ స్నేహితులు తప్పక మీ స్నేహ ప్రకంపనలను ఫీల్ అవుతారు.

    ReplyDelete
  3. ఈ జన్మలోనే కలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. బ్లాగుల్లోనే ఉన్నారేమోనండీ..

    ReplyDelete
  4. తప్పక కలుస్తారు లెండి . అయినా మీ కవితల్లో లాలిత్యాన్ని పొందుపరచి లలితను, స్నేహమనే పూర్ణాన్ని చేర్చి పరిమళను బ్లాగునామంగా పెట్టుకుని మీ కవితల్లో వారిని గుర్తుకు తెచ్చుకుంటూనే ఉన్నారు కదా! భౌతికంగా మీ దగ్గర లేకపోయినా మానసికంగా మీ కవితల్లో కిశోరిస్తూనే ఉన్నారనుకుంటా !

    ReplyDelete
  5. uttaaraalu('sms'lu)mOyalEvu
    gundeloni bhaavamantaa
    uttamaatalenudukulE madinindaa neevE nanta
    pratikalaika gamyamu vidipOvaDamEnanTaa
    anubhavaanikocchEvaraku chedunijamadi erugananTaa
    poorti paatakosam
    07-06-2009 naaTi post choodandi
    maitree divasa shubhaabhinandanalu
    sadaa
    mee snEhaabhilaaShi raakhee

    ReplyDelete
  6. బాగుందండి . మీకు శుభాకాంక్షలు .

    ReplyDelete
  7. స్నేహితుల దినోత్సవశుభాకాంక్షలు నేస్తమా!!!

    ReplyDelete
  8. అద్భుతం పరిమళం గారు... మీరంతా అతి త్వరలో మళ్ళీ కలవాలని.. మనసారా కోరుకుంటున్నాను.

    ReplyDelete
  9. ఆ ముగ్గురిలో నేనొకరిననుకోండి కాసేపు, పరిమళించు పూల స్నేహ కదంబానికి మరువాన్ని కొసరుగా అందుకోండి... నాకు శైలజ, జ్యోతీర్మయి, విశ్వాస్ ఇలా ఎందరో జాడ తెలియని నేస్తాలు.. వాళ్ళని మీ అందరిలో వెదుక్కోవటం లేదా యేం..

    ReplyDelete
  10. మీ స్నేహ పరిమళం కలకాలం విరాజిళ్ళాలని ఆశిస్తూ, మీకు Happy Friendship Day.

    ReplyDelete
  11. prati kalayika oka vidipodaniki nandi vachakam .andukew kalisinappude mental ga prepare ayi povali vidipodaniki .

    ReplyDelete
  12. బాగుంది. మీ స్నేహితులని ఆర్కుట్ లోనో, ఫేస్ బూక్ లోనో వెతకండి!

    ReplyDelete
  13. నా స్నేహితులను తిరిగి కలుసుకోవాలని అభిలషించిన హితులందరికీ హృదయపూర్వక నమస్సులు . మీ దీవెన ఫలంగా అయినా మేం మళ్ళీ కలుస్తాం . వారిలో ఒక్కరు కలిసినా చాలు మిగతా ఇద్దరూ దొరికినట్టే ఎందుకంటే వారు ముగ్గురూ అన్నా చెల్లెళ్ళే ! కలిస్తే మాత్రం నా ఆనందాన్ని మీతో తప్పక పంచుకుంటాను .ధన్యవాదాలు .

    ReplyDelete
  14. ఎంత చక్కగా అందరికీ తమ చిన్ననాటి నేస్తాలను గుర్తు తెచ్చేసారు ..చాలా బారాసారు

    ReplyDelete
  15. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు :)

    ReplyDelete
  16. స్నేహితుల దినోత్సవ,రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు..కాస్త ఆలస్యం గా

    ReplyDelete
  17. నిజంగానే ఆ రోజులు గుర్తుకొస్తున్నాయండీ.. నైస్.. లేట్ విషెస్ ఫర్ యు మిత్రమా...!!

    ReplyDelete