Thursday, July 30, 2009

ముకుంద ప్రియాం ...


లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం
త్రైలోక్య కుటుంబినీం సరసిజాంవందే ముకుంద ప్రియాం

* బ్లాగ్ మిత్రులందరికీ వరలక్ష్మీ కటాక్ష ప్రాప్తి రస్తు !

11 comments:

  1. మీకు మీ కుటుంబానికి కూడా వరమహాలక్ష్మి ఆయురారోగ్య,అష్టైశ్వర్యాలు,సుఖసంతోషాలను అందించాలని మనస్పూర్థిగా కోరుకుంటూ....

    ReplyDelete
  2. ధన్యవాదాలు. ఈ పూజల్లోని పరమార్థాన్ని గ్రహించగల ధనికులం అయ్యే వరం దేవి అనుగ్రహిస్తే బాగుండు. మీకు కూడా మనో వాంఛాయఫలసిద్దిరస్తు!

    ReplyDelete
  3. ధన్యవాదాలు.
    ఆ వర లక్ష్మీ ప్రసాదంచే మీ కవిత్వ పారిమళం కూడా తెల్లుగు బ్లాగుల నలుదిశలా విస్తరించాలని మనస్ఫూర్తిగా ఆ దేవిని ప్రార్థిస్తున్నాను. :)

    ReplyDelete
  4. @ విజయమోహన్ గారు , ధన్యవాదాలండీ ...

    @ శివ గారూ థాంక్స్ !

    @ ఉష గారు ధన్యవాదాలు మీ "నా జీవనమే వ్రతం, నీ దీవెనలె ఫలం!" చదివాను చాలా బాగా రాశారండీ !

    @ చక్రవర్తిగారు , ఈ రోజు వరలక్ష్మీ వ్రతమండీ ...ముఖ్యంగా మహిళలకు పెద్ద పండుగే !

    ReplyDelete
  5. పరిమళం గారూ!!
    మీకూ మీ కుటుంబానికీ ఆ లక్ష్మీదేవి "వరాలు" కురిపించాలని కోరుకుంటా, నాకన్నా చిన్నవాళ్ళైతే దీవిస్తా...
    ఏమీ అనుకోవద్దు, ఓ చిన్న సవరణ
    లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం ని ఇలా మార్చండి
    లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం గా మార్చండి.

    ధన్యవాదాలు

    ReplyDelete
  6. ధన్యవాదాలండి....మీకు కూడా మనో వాంఛాయఫలసిద్దిరస్తు!

    ReplyDelete
  7. మనో వాంఛాయ ఫలసిద్దిరస్తు!

    ReplyDelete
  8. @ భాస్కరరామ రాజుగారు ధన్యవాదాలండీ ! అనుకోవడానికేముందండీ తప్పులు సరిదిద్దుకోవడానికి సాయపడేవారు గురువులు ,హితులూ .....సరిచేశాను చూడండి.

    ReplyDelete
  9. పద్మార్పిత గారూ , భావన గారూ ధన్యవాదాలండీ !

    ReplyDelete