
బాబాయి గారింటికి వెళ్తుంటే దారిపొడుగునా అందరూ వింతగా చూడటమే ...ఒకరిద్దరైతే ఎవరింటికేటండి ? అని అడిగేశారు కూడా ...ఏంటి నాన్నగారూ ! అంతా మనల్ని అలా చూస్తున్నారు అని అడిగితె పల్లెటూరు కాదమ్మా కొత్త మొహాలు కనిపిస్తే అలాగే చూస్తారు అన్నారు .
పిన్ని ,బాబాయి మమ్మల్ని చూడగానే చాలా సంతోషించారు . తమ్ముళ్లిద్దరి సంబరానికి అంటే లేదు . వాళ్ల పెదనాన్నగారింటికి ఇంకా తెలిసినవాళ్ళందరికీ మా బుజ్జక్క వచ్చిందంటూ కొత్తగా కొనుక్కున్న బొమ్మను చూపించినట్టు చూపించేశారు .
ఆ మరుసటిరోజు అమ్మవారికి ( గ్రామ దేవతకి )ఉపారాలు ...మేకపోతునేసుకోవడం ...తర్వాత భోజనాలు.ఊళ్ళో దగ్గర చుట్టాల్నే పిలిచారట !ఎక్కువమంది లేరు ...వంద లోపే కాబట్టి ఇంటిలోనే భోజనాలు . అసలే మనకేమో కొత్తాపాతా ఉండదాయే ! ఇక కొత్తగా వేసుకున్న ఓణీ చెంగును నడుం దగ్గర దోపి వడ్డన మొదలెట్టా ...అలా వడ్డిస్తూ ఓ పెద్దాయన్ని తాతగారూ ..కొంచెం అన్నం వేయమంటారా అంటూ ఆగా ! వద్దమ్మా ...అన్నాసరే .. అదేంటి తాతగారూ పెరుగులోకి కొంచెం వేసుకోండి అంటూ వేశాను .నేను ఆయన్ని దాటి వెళ్తుంటే ఒరే ..రాములూ ...ఈ అమ్మాయి ఎవర్రా ? అని మా బాబాయిగారి అన్నను అడగటం ....ఫలానా వాళ్ల మ్మాయి నాన్నా ..అంటూ ఆయన సమాధానం నాచెవినబడ్డాయి . అప్పటికే పల్లెలో అందరూ అంతే అని మనకి తెల్సిపోయిందిగా !పెద్దగా పట్టించుకోలేదు .
ఆ తర్వాత మేం అంటే పిల్లలందరం భోజనం చేశాం ...ఇంకా ఒకరిద్దరు బంధువులూ , పాలేర్లూ ...పనివాళ్ళూ ఉండిపోయారని వాళ్లకు భోజనాలు వడ్డిస్తున్నాం ....ఎందుకో తమ్ముళ్ళు లోపలికీ , బయటికీ తిరుగుతున్నారు గుసగుస లాడుకొంటున్నారు .కొందరైతే భోజనాల దగ్గరకొచ్చి తొంగిచూసిమరీ వెళ్తున్నారు . ఏదో జరుగుతోంది ....నాకు తెలియట్లేదు ....ఎవరినైనా అడుగుదామా అంటే ...ఆఖరు బంతి జరుగుతోంది వదిలి వెళ్ళటం ఎందుకులే అని చూస్తున్నా ...
( ఇంకా ఉంది )
* తిట్టుకోకండెం..మళ్ళీ చెప్తున్నా ఇది సస్పెన్స్ కాదు పోస్ట్ మరీ పెద్దగా ఉంటే చదవటానికి మీకే బోర్ కొడుతుందేమోని ఆపానంతే !
ఓహో! మీ పెళ్ళి సంబంధం అలా కుదిరిందా!
ReplyDeleteతిట్టుకోవడం దేనికి! ఆసక్తిగా ఉంది తరువాత ఏంజరిగిందో చెప్పండి?
ReplyDeleteకొంపదీసి పెళ్ళిసంబంధం తెచ్చారా ఏంటి ఆ తాతగారు?
ReplyDeleteనాకు తెలిసి పోయిందోచ్ ...మీ పెళ్ళి కబుర్లు చెపుతున్నారు.....
ReplyDeleteమాకర్థమయింది తర్వాతి సీనేంటో!
ReplyDeleteమరీ అంత కొంచెం రాస్తే ఎలాగండి..కడుపునెప్పి ఎక్కువైపోతోంది....?ఇక ఆగటం మా వల్ల కాదండి...నెక్ష్ట్ పోస్ట్ తొ పూర్తి చేసేయండి..
ReplyDeleteతర్వాతి భాగాలు త్వరగా రాసేస్తే తిట్టుకోమండీ.. ఇక మీ ఇష్టం :-)
ReplyDeleteబోర్ కొడుతుంది అన్న నెపంతో ఇలా సస్పెన్స్ లో పెట్టటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్షా
ReplyDeleteబాగుంది.... బాగుంది.......... తరువాత......
ReplyDeleteత్వరగా రాస్తారు కదూ.................. :)
ఈ అమ్మాయి ఫలానా వాడికి కాబోయే భార్య అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు... అంతేకదా!
ReplyDeleteyes....apudu meeku match fix chesaaru...sure..antekada???..:)
ReplyDeleteమీరు వర్మ ఫ్యాన్ అనుకుంట.మరీ ఇంత సస్పెన్స్ అయితే కష్టమే .తొందరగా మమ్మల్ని విముక్తుల్ని చేయండి.
ReplyDeleteమరీ అంత సస్పెన్స్ ఏంటండి.. త్వరగా చెప్పరూ...?
ReplyDeleteమిత్రులందరూ క్షమించాలి కాస్త ఆలస్యమైంది .కొన్ని పర్సనల్ పనుల ఒత్తిడిలో తరువాతి టపా వెంటనే రాయలేకపోయాను.
ReplyDelete