
గుర్తుకొస్తూంటాయి ఆనాటి రోజులు ...
మన స్నేహ బంధం ....
చిన్ననాడే చిగురించిన మన అనుబంధం !
కలకాలం వీడిపోదనుకున్న సుమగంధం ..
బదిలీ రూపంలో విధి ఆడింది నాటకం
విడిపోయాం మన నలుగురం .
దూరమౌతున్నప్పుడు మనం
కలిసి ఏడ్చిన ఫ్లాట్ ఫాం......
ఎందర్నిలా విడదీసి మూటకట్టుకుందో పాపం!
మీ జాడ తెలియక తల్లడిల్లిన వైనం
మీకు తెలీదేమో నేస్తం !
ఈనాటికీ నామదిలో మీస్థానం పదిలం
మీకోసం వెదుకుతూనే ఉంటాను
నా జీవితపు చివరి మజిలీ వరకూ
గడువు పూర్తై నే వెళ్లి పోయాననుకో ....
అయినా ఫరవాలేదు నేస్తం
ఇంకా ఆరు జన్మలుంటుంది నాకు
మిమ్మల్ని కలిసే అవకాశం !!
**చిన్ననాడే నాన్నగారి బదిలీ కారణంగా విడిపోయిన నా స్నేహితులు లలిత , పరిమళ , కిషోర్ లకు ఎక్కడున్నా స్నేహపూర్వక శుభాకాంక్షలు .
విడిపొయిన నా స్నేహితులంతా గుర్తు వచ్చారండి..అసలు విడిపొమనుకున్న స్నేహాలు కొన్ని కాల చక్రాల క్రింద,బాధ్యతల నడుమ,నేటి స్పీడ్ యుగం తాలుకూ పొటీలొ పడి కొట్టుకు పోయాయి....నిజమైన స్నేహం చివరిదాకా నిలిచి ఉంటుంది అని ఎంత నమ్మాలనుకున్నా...కొన్ని వాస్తవాలు నమ్మనియవు....!!
ReplyDeletehappy friendship day
ReplyDeleteమీకు కూడా న " స్నేహితుల దినోత్సవపు శుభాకాంక్షలు. " ఎక్కడ వున్నా మీ స్నేహితులు తప్పక మీ స్నేహ ప్రకంపనలను ఫీల్ అవుతారు.
ReplyDeleteఈ జన్మలోనే కలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. బ్లాగుల్లోనే ఉన్నారేమోనండీ..
ReplyDeleteతప్పక కలుస్తారు లెండి . అయినా మీ కవితల్లో లాలిత్యాన్ని పొందుపరచి లలితను, స్నేహమనే పూర్ణాన్ని చేర్చి పరిమళను బ్లాగునామంగా పెట్టుకుని మీ కవితల్లో వారిని గుర్తుకు తెచ్చుకుంటూనే ఉన్నారు కదా! భౌతికంగా మీ దగ్గర లేకపోయినా మానసికంగా మీ కవితల్లో కిశోరిస్తూనే ఉన్నారనుకుంటా !
ReplyDeleteuttaaraalu('sms'lu)mOyalEvu
ReplyDeletegundeloni bhaavamantaa
uttamaatalenudukulE madinindaa neevE nanta
pratikalaika gamyamu vidipOvaDamEnanTaa
anubhavaanikocchEvaraku chedunijamadi erugananTaa
poorti paatakosam
07-06-2009 naaTi post choodandi
maitree divasa shubhaabhinandanalu
sadaa
mee snEhaabhilaaShi raakhee
బాగుందండి . మీకు శుభాకాంక్షలు .
ReplyDeleteస్నేహితుల దినోత్సవశుభాకాంక్షలు నేస్తమా!!!
ReplyDeleteఅద్భుతం పరిమళం గారు... మీరంతా అతి త్వరలో మళ్ళీ కలవాలని.. మనసారా కోరుకుంటున్నాను.
ReplyDeleteఆ ముగ్గురిలో నేనొకరిననుకోండి కాసేపు, పరిమళించు పూల స్నేహ కదంబానికి మరువాన్ని కొసరుగా అందుకోండి... నాకు శైలజ, జ్యోతీర్మయి, విశ్వాస్ ఇలా ఎందరో జాడ తెలియని నేస్తాలు.. వాళ్ళని మీ అందరిలో వెదుక్కోవటం లేదా యేం..
ReplyDeleteమీ స్నేహ పరిమళం కలకాలం విరాజిళ్ళాలని ఆశిస్తూ, మీకు Happy Friendship Day.
ReplyDeleteprati kalayika oka vidipodaniki nandi vachakam .andukew kalisinappude mental ga prepare ayi povali vidipodaniki .
ReplyDeleteబాగుంది. మీ స్నేహితులని ఆర్కుట్ లోనో, ఫేస్ బూక్ లోనో వెతకండి!
ReplyDeleteనా స్నేహితులను తిరిగి కలుసుకోవాలని అభిలషించిన హితులందరికీ హృదయపూర్వక నమస్సులు . మీ దీవెన ఫలంగా అయినా మేం మళ్ళీ కలుస్తాం . వారిలో ఒక్కరు కలిసినా చాలు మిగతా ఇద్దరూ దొరికినట్టే ఎందుకంటే వారు ముగ్గురూ అన్నా చెల్లెళ్ళే ! కలిస్తే మాత్రం నా ఆనందాన్ని మీతో తప్పక పంచుకుంటాను .ధన్యవాదాలు .
ReplyDeleteఎంత చక్కగా అందరికీ తమ చిన్ననాటి నేస్తాలను గుర్తు తెచ్చేసారు ..చాలా బారాసారు
ReplyDeleteరాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు :)
ReplyDeleteస్నేహితుల దినోత్సవ,రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు..కాస్త ఆలస్యం గా
ReplyDeleteనిజంగానే ఆ రోజులు గుర్తుకొస్తున్నాయండీ.. నైస్.. లేట్ విషెస్ ఫర్ యు మిత్రమా...!!
ReplyDelete