Friday, July 24, 2009
ఈ నిశ్శబ్దాన్ని ...
ఇన్నాళ్ళూ అవసరాలు ...
మనిద్దరి మధ్యా ...
మాటల వారిధి కట్టాయి
ఇప్పుడా అవసరమూ లేదు
నువ్వే ముందుగా చేధిస్తావనుకున్నా !
ఈ నిశ్శబ్దాన్ని ...
కాని ఎప్పటిలాగే నేనే ఆపని చేశా !
మాటల యుద్ధం మొదలుపెట్టావు
ఐనా ...
మౌనం కన్నా ఇదే ఎంతోనయం !
Subscribe to:
Post Comments (Atom)
అవును నిజం. మౌనం కన్నా మాటల యుద్ధం చాలా మంచిది. మౌనం మనసుని పిండేస్తుంది. మాటలు మనస్సును తేలికపరుస్తాయి.
ReplyDeleteకొన్నిసార్లు మౌనమే బాగుంటుందని అనిపిస్తుందండీ..
ReplyDeleteఅప్పుడే అయిపొయిందా అనిపించింది..ఇంకొంచం పొడిగించాల్సింది..
ReplyDelete"కానీ నేనే ఆ పని చేశా!"
ReplyDeleteమెత్తని మనసు కదా... :)
"మౌనం కన్నా ఇదే ఎంతో నయం"
ఎంత ప్రేముంటే ఆ మాటనగలరూ...:)
కవిత చాలా బాగుంది. అభినందనలు. :)
మరి సంధి మాటేమిటొ? ;) ఇంతకీ అవి మాటల తూటాలా చూపుల బాణాలేనా? కాస్త ఎలా చేధించారో చెప్తారా, నేనూ ఆ మౌన బాధితురాలినే అందుకే "ఎందుకిలా?" అన్న ప్రశ్నల్లో వేగిపోతున్నాను
ReplyDeleteఆత్మీయుల మౌనం కంటే పెద్ద సిక్ష ఈ లోకంలోనే ఉండదనుకుంటా! మాటల యుద్ధం తరువాత అలసిన మనసులు సేదదీరేది తిరిగి ఓడిలోనే కదా?
ReplyDelete@ నరసింహ గారూ ! మీ స్పందనకు ధన్యవాదాలండీ ...
ReplyDelete@ మురళి గారూ ! అన్నివేళలా మౌనం మంచిది కాదండీ ...అపార్ధాలు తొలగాలంటే ముందుగా మాటల యుద్ధం మొదలవ్వాల్సిందే కదండీ !
@ తృష్ణ గారు , తర్వాత నాకూ అలాగే అనిపించిందండీ కానీ నా ఉక్రోషం అక్కడితో ఆగిపోయింది మరి :) :)
@ ప్రేమికుడు గారూ ! చాలా థాంక్సండీ ...నా మనసు అర్ధం చేసుకున్నారు ...
@ ఉషాగారు , ఈ లింకు చూడండి సమాధానం దొరుకుతుందేమో ...ప్రియమైన శత్రువు
@ వర్మ గారూ ! సశేషం గా ఉన్న కవిత మీ కామెంట్ తో సంపూర్ణమయిందండీ ధన్యవాదాలు .
usha gaaru link http://anu-parimalam.blogspot.com/2008/11/blog-post_8573.html
ReplyDeletevery nice!
ReplyDeletenice :)
ReplyDeleteక్లుప్తంలో అనంతం
ReplyDeletepsmlakshmi
short and sweet :)
ReplyDeletePicture is excellent.!