
ఎవరామె ??
కాంతివిహీనమైన ఆ కళ్ళూ
విధాత రాసినవేమో ఆ నుదుటి గీతలు
జారిన చెక్కిళ్ళూ ...ఎండిన పెదవులూ
రంగు వెలిసిన జలతారు కురులూ
కదిలిన దంతాలు ...వంగిన నడుమూ
వడలివత్తైన ఒళ్ళూ ...నడవలేని కాళ్ళూ
ఒకప్పటి వైభవానికి గుర్తుగా ....
మిగిలిన శుష్క మందహాసం
కాలాన్ని జయించే శక్తిలేక
నిస్సహాయంగా ....
గాజుగోళీల్లాంటి కళ్ళతో
శూన్యంలోకి చూస్తూ ...
ఇంకా దరి చేరని తుదినేస్తం కోసం
ఎదురుచూస్తూ .....
**గూగుల్ లో వేరే బొమ్మ కోసం వెతుకుతుంటే కనిపించింది ఈ బొమ్మ !
అందానికి తుది మజిలీ ఇదే కదా అనిపించింది .ప్రతి మనిషినీ భయపెట్టే వృద్ధాప్యం !
బొమ్మ సూపర్! దానికి మీరు వ్రాసింది అతికినట్టుగా ఉంది...
ReplyDeleteనిర్వాణానికి తొలిమెట్టు జననం, నడుమ చీకు, చింత, బాధ, భయం, వృద్దాప్యం, తుది మజిలి మరణం. మెట్టున మెట్టున సంతృప్తి సోపానాలు కడుతూ సాగే మహా ప్రస్థానం జీవితం.
ReplyDeleteబాహ్య సౌందర్యపు అంతిమ రూపును చక్కగా విశ్లేషించారు. అహంకారానికి అంతం ఇదేకదా?
ReplyDeletekeka.....!
ReplyDeleteతుది మజిలీ!
ReplyDeleteనిజమే!!
good write
ReplyDeleteకాలం చాల క్రూర మైనదండీ ,ఎంతటి సౌందర్య న్ని అయిన ఇట్టే నాశనం చేస్తుంది .మీ కవిత బాగుంది .
ReplyDeleteఆశువుగా ఎలా అల్లేస్తారు కవితల్ని మీరందరూ!!!
ReplyDeleteఏంటో!! ఏదో ఎక్కడో నేనే మిస్సౌతున్నా.
బాగుంది మీ కవిత. ఇంకొంచెం లోతుగా రాస్తే గుండెల్ని పిండేది.
నాకెందుకో శ్రీశ్రీ 'భిక్షు వర్షీయసి' గుర్తొచ్చిందండీ..
ReplyDeleteఎన్ని కలలను చూసాయో ఆ కళ్ళు
ReplyDeleteఎవరిలో మధురిమలను నింపాయో ఆ పెదవులు
ఎన్నెన్ని విరులను నింపాయో ఆ సిగలు
ఎన్ని అలసటలను దూరం చేసిందో ఆ ఒడి
ఎంతటి ఆవేదన దాగుందో ఆ కళ్ళల్లో...
ఎన్ని ఆటుపొట్లనెదురిదాయొ ఆ కాళ్ళు...
అనిపించిందండీ నాకా బొమ్మని చుస్తే...
హ్మ్మ్ ... జీవితం లో వద్దన్నా తప్పని పర్వం కదా ఈ వృద్ధాప్యం, బాగుంది మీ కవిత...
ReplyDeleteకవితకీ, బొమ్మకీ సరిగ్గా సరిపోయింది. కవిత బావుందండీ.!
ReplyDeleteనా చిరు కవితకు స్పందించి అభిప్రాయాలు తెలిపిన మిత్రులందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు .
ReplyDelete@ తృష్ణ గారూ ! నిజానికి మీ కవితే అందంగా అమరిందండీ ఆ బొమ్మకి !
rasEsdi adE lavitwamainaa mana iddarilO enta teda
ReplyDeletenaa bhaavaalu meevati mundu chaalaa pelavangaa ruff gaa tostunnaayi entainaa stree hrudayamE vEru kadaa
meenundi ,meelanti ento mandinundi neenu chalaa nerchukovalsiundi
mee blog choodadam nakento hayinicchindi
marosaari teerikagaa marinta vishleshNaatmakangaa
sadaa mee snEhaabhilaaShi raakhee
"జీవితం
ReplyDeleteతీరని దాహం
తీర్చు‘నది’ఒకటె
అది స్నేహం "
రాఖీ గారు స్నేహానికర్ధం రెండు వాక్యాల్లో చెప్పిన మీరు నా రాతల్ని మెచ్చుకోవడం కేవలం మీ సహృదయతే తప్ప వేరుకాదు .మీ నానోలు చదివాను చిన్న పదాలతో చక్కటి భావాలు ! ధన్యవాదాలండీ !