Friday, July 24, 2009

ఈ నిశ్శబ్దాన్ని ...


ఇన్నాళ్ళూ అవసరాలు ...
మనిద్దరి మధ్యా ...
మాటల వారిధి కట్టాయి
ఇప్పుడా అవసరమూ లేదు
నువ్వే ముందుగా చేధిస్తావనుకున్నా !
ఈ నిశ్శబ్దాన్ని ...
కాని ఎప్పటిలాగే నేనే ఆపని చేశా !
మాటల యుద్ధం మొదలుపెట్టావు
ఐనా ...
మౌనం కన్నా ఇదే ఎంతోనయం !

12 comments:

  1. అవును నిజం. మౌనం కన్నా మాటల యుద్ధం చాలా మంచిది. మౌనం మనసుని పిండేస్తుంది. మాటలు మనస్సును తేలికపరుస్తాయి.

    ReplyDelete
  2. కొన్నిసార్లు మౌనమే బాగుంటుందని అనిపిస్తుందండీ..

    ReplyDelete
  3. అప్పుడే అయిపొయిందా అనిపించింది..ఇంకొంచం పొడిగించాల్సింది..

    ReplyDelete
  4. "కానీ నేనే ఆ పని చేశా!"
    మెత్తని మనసు కదా... :)

    "మౌనం కన్నా ఇదే ఎంతో నయం"
    ఎంత ప్రేముంటే ఆ మాటనగలరూ...:)

    కవిత చాలా బాగుంది. అభినందనలు. :)

    ReplyDelete
  5. మరి సంధి మాటేమిటొ? ;) ఇంతకీ అవి మాటల తూటాలా చూపుల బాణాలేనా? కాస్త ఎలా చేధించారో చెప్తారా, నేనూ ఆ మౌన బాధితురాలినే అందుకే "ఎందుకిలా?" అన్న ప్రశ్నల్లో వేగిపోతున్నాను

    ReplyDelete
  6. ఆత్మీయుల మౌనం కంటే పెద్ద సిక్ష ఈ లోకంలోనే ఉండదనుకుంటా! మాటల యుద్ధం తరువాత అలసిన మనసులు సేదదీరేది తిరిగి ఓడిలోనే కదా?

    ReplyDelete
  7. @ నరసింహ గారూ ! మీ స్పందనకు ధన్యవాదాలండీ ...

    @ మురళి గారూ ! అన్నివేళలా మౌనం మంచిది కాదండీ ...అపార్ధాలు తొలగాలంటే ముందుగా మాటల యుద్ధం మొదలవ్వాల్సిందే కదండీ !

    @ తృష్ణ గారు , తర్వాత నాకూ అలాగే అనిపించిందండీ కానీ నా ఉక్రోషం అక్కడితో ఆగిపోయింది మరి :) :)

    @ ప్రేమికుడు గారూ ! చాలా థాంక్సండీ ...నా మనసు అర్ధం చేసుకున్నారు ...

    @ ఉషాగారు , ఈ లింకు చూడండి సమాధానం దొరుకుతుందేమో ...ప్రియమైన శత్రువు

    @ వర్మ గారూ ! సశేషం గా ఉన్న కవిత మీ కామెంట్ తో సంపూర్ణమయిందండీ ధన్యవాదాలు .

    ReplyDelete
  8. usha gaaru link http://anu-parimalam.blogspot.com/2008/11/blog-post_8573.html

    ReplyDelete
  9. క్లుప్తంలో అనంతం
    psmlakshmi

    ReplyDelete