Friday, July 10, 2009

అక్షింతలు...


కళ్ళముందు నువ్వు లేకుంటేనేం ?
రెప్పమూసినపుడల్లా నిను చూస్తూనేఉన్నా!
నిను చేరనీయక విధి శాశిస్తే ...
నీ జ్ఞాపకాలను నేశ్వాశిస్తా!
నువ్వు నా ప్రేమను కాదన్నా ...
నీ సుఖమే నేకోరుకున్నా !
అందుకే అశ్రువులే అక్షింతలుగా ...
నినునేదీవిస్తున్నా !
ఇది నా ఓటమి కానేకాదు....
మరుజన్మనేది నిజమేఐతే ,
నీ ఒడిలో పసిపాపనై ...
నీ ప్రేమను గెలుచుకుంటా !

18 comments:

  1. ఇది నా ఓటమి కానేకాదు....
    మరుజన్మనేది నిజమేఐతే ,
    నీ ఒడిలో పసిపాపనై ...
    నీ ప్రేమను గెలుచుకుంటా !

    బాగుందండీ...

    ReplyDelete
  2. ఎక్కడ వున్నా ఏమైనా నీ సుఖమే నే కోరుకున్నా,
    నిను వీడి అందుకే వెలుతున్నా...
    అన్న ఘంటసాల గారి మధుర గీతం గుర్తుకు తెచ్చారు. థాంక్యూ..

    ReplyDelete
  3. రెప్పక్రింద కాష్టమై మిగిలిన ప్రేమ..
    కనపడని విధి కాలడ్డంపెట్టిన కలయిక..
    జ్నాపకాలు శ్వాశిస్తూ ప్రస్తుతానికిచ్చే తర్పణలు..

    త్యాగాల కొమ్మకి వ్రేలాడే నిరాశ తల అది.. కనబడటంలేదా ?!
    ఓడి తెగిన కంఠం నుంచె కారే ఆశ మడుగులు..కనబడటంలేదా ?!

    నిజమే.. ఇవేవీ ఓటమి కావు... నిజమే ?!!

    గుండెలో దిగిన బాకు.. పిడి నగిషీల వర్ణన ఎంతకాలం..
    కాళ్ళక్రింద రేగిన నేలతడుపు గంధాల వర్ణన ఎంతకాలం..

    నిరాశకు.. గెలుపు పులిమి..
    ఇప్పుడు గొంతు నిళ్ళి మ్రింగితే..
    ఇదే బాధ రేపు గతం నుండి కాలనాగైపుడుతుంది..
    కంటి కొలను జీవనదై జీవితాంతం పారుతుంది.

    ఓ ఏడుపుతో పోయే తరుణాన్ని.. ఉదారత పులిమి
    బ్రతుకంతా నింపకు.. నేచూసిన ఆ బ్రతుకు నీకొద్దు..

    భూనభోంతరాళాలు బ్రద్దలయ్యేలే రోదించు.. ఉపశమించు..
    జీవించు..

    ReplyDelete
  4. marujanmanEdi nijamEaitE
    nee oDilO pasipaapanai...
    nee premanu geluchukuntaa!

    emta nirmalamaina premanu aavishkarimchaaru...

    ReplyDelete
  5. "ఇది నా ఓటమి కానేకాదు...."ఈ line తో చదువరుల మనసు గెలిచేసారు..

    ReplyDelete
  6. "ఇది నా ఓటమి కానేకాదు....
    మరుజన్మనేది నిజమేఐతే ,
    నీ ఒడిలో పసిపాపనై ...
    నీ ప్రేమను గెలుచుకుంటా ! "

    మొత్తం కవితకే మణిహారం.....చాలా చాలా చాలా బావుంది

    ReplyDelete
  7. సూపర్....అరిపించారు :)

    ReplyDelete
  8. పరిమళం,

    ఓ అద్భుతమైన ప్రేరణ నిచ్చారు. నిజమే ప్రేమను కాదని అంటారు. ఒక విధంగా చెప్పాలంటే కాదన్నాను అని అనుకుంటారు. మీది ఓటమి కాదు, గెలుపు.
    పసి పాపలా మీరు ఉంటారో, పసి పాపనే లాలిస్తారో! కదూ. మీ కవితకు నేను రెప్లై రాసేశాను నాబ్లాగ్ లో.

    చూశారా గురువుగారు కూడ బదులిచ్చేశారు.

    ReplyDelete
  9. కళ్ళముందు నువు లేకుంటేనేం,
    నీ కనులవెలుగులో నేనున్నా.
    నిను చేరనీయక విధి శాశిస్తే ...
    అనుక్షణం నీశ్వాసలో బ్రతికున్నా.
    నువ్వు నా ప్రేమను కాదన్నా ...
    నా ప్రేమతో నీకో నీకో రూపమిచ్చాను.
    నను మరిచానని నీవనుకున్నా
    నీ మదిలో నే జీవించే ఉన్నా.
    ఇది నా ఓటమి కానేకాదు....
    నీ ఎరుకలేకనే, నీలో విరిసిన వలపును నేను.
    నువ్వెంత లేదనుకున్నా,
    నీ తనువును వీడని పరిమళం నేను.
    నిజం చెప్పు, నన్ను మరచి మగలవా నువ్వు?
    ఒప్పుకోలేని అహం నీది, అది గెలిచిన ప్రణయం నాది.

    ReplyDelete
  10. @ శేఖర్ గారూ ! థాంక్స్ .

    @ మురళి గారూ మీక్కూడానండీ ...

    @ వర్మగారూ ! అనుకోకుండా ఆవాక్యం రావడం ...నాకవితకు అందాన్నిచ్చింది ధన్యవాదాలు .

    @ జయచంద్రగారు , థాంక్స్ !

    @ ఆత్రేయ గారూ ! మీ స్పందనతో నా ఈ చిన్ని కవిత ధన్యం ! కృతఙ్ఞతలు .

    @ శివగారు ధన్యవాదాలండీ ...

    @ నాగార్జున గారు , నా కవిత అంతగా నచ్చినందుకు ధన్యవాదాలు .

    @ కిషన్ రెడ్డి గారు , థాంక్స్ !

    @ శృతి గారూ ! కాస్త ఆలశ్యంగా చూశాను ..మీ స్పందనా ..గురువుగారి ప్రతిస్పందనా ...థాంక్స్ !

    @ దినేష్ (dj) గారు ,కవిత చదివి స్పందన తెలియ చేసినందుకు థాంక్సండీ ..

    ReplyDelete
  11. అందుకే అశ్రువులే అక్షింతలుగా ...
    నినునేదీవిస్తున్నా !
    chala nachhindi naku a line chala chala nachhindi andi
    please watch my postings

    ReplyDelete
  12. మీ మనసులోని భావాలను చాలా చక్కగా రాస్తున్నారు
    కవిత బాగుంది :)

    ReplyDelete
  13. నేను చాలా ఆలస్యంగా చూసాను ...అరచేతుల్లో గులాభి ...అమ్మో ....అద్భుతం నాక్కావలది ...
    చాల బాగా రాసారండీ.

    ReplyDelete