Tuesday, March 10, 2009

వసంతం వచ్చేసింది ...ఉగాదిని తెచ్చేస్తోంది .........


బయట పచ్చని చివుళ్ళతో ముస్తాబవుతున్న చెట్లను చూస్తే అనిపించింది .వసంతం వచ్చేసింది , ఉగాదిని తెచ్చేస్తోంది .....అని . ఇన్నాళ్ళూ ఆకురాల్చి నగ్నంగా నిలుచున్న చెట్లన్నీ ...కొత్త చివురులతో ఒంటిని కప్పుకుంటున్నాయి .ప్రతి ఉగాదికీ మీకేనా కొత్త బట్టలు ...మాక్కూడా .....అన్నట్టు .

రాలే ప్రతి ఆకూ ఒక క్రొత్త చివురుకు జన్మనిస్తుంది .మన మానవ జీవనానికి సంకేతంలా అనిపిస్తుంది .పునరపి జననం పునరపి మరణం అన్న మాటను ఒక చెట్టు మనకు ప్రత్యక్షంగా చూపుతుంది .అంతేకాదు కష్టం వచ్చినా ,సుఖం వచ్చినా వంగిపోక , కృంగి పోక ధీరత్వం తో ఆహ్వానించే చెట్టుని చూసి మనం ఆశావహ దృక్పధం తో మనుగడ సాగించాలి .

ఎక్కడో కోయిల కుహూ రాగం వినిపిస్తోంది మధురంగా ....ఎంత కమ్మని స్వరం ....రంగు నలుపైతేనేం ....తిన్నవి వగరు చివురు లైనా ....ఎంతో హాయిని మనకు పంచుతోంది . ఈ కోయిలమ్మకూ , మన బ్లాగరులకూ ఒక పోలిక కనిపిస్తుంది నాకు .గుబురుల మాటున తాను కనపడకనే తన గొంతులోని మాధుర్యాన్ని పంచుతుంది కోయిలమ్మ .....కనపడకనే వారి మనసుల్లోని భావతరంగాలు మనతో పంచుకొంటున్న మన బ్లాగరులూ ......పోలిక సరైనదేనా ??

18 comments:

  1. సరైనపోలిక ..super :)

    ReplyDelete
  2. చెట్టు అనగానే 'ఇస్మాయిల్' గుర్తొచ్చేస్తారు నాకు.. చివర్లో పోలిక బాగుందండి..

    ReplyDelete
  3. వసంతం గురించి మీ వర్ణన చాలా బాగుంది...
    పచ్చని చెట్లని చూస్తే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది... అవి నచ్చని మనిషి ఎవరూ ఉండరేమో...
    వాటితో పాటు... మోడువారిన చెట్లన్నా చాలా ఇష్టం నాకు...
    ఆకురాలిన చెట్లను చూస్తూనే వాటి అసలు రూపం(inner side) చూసినట్టు, వాటి గురించిన ఏదో రహస్యం తెలిసిపోయినట్టు అనిపిస్తుంది నాకు!!

    ReplyDelete
  4. Good one !
    :)
    Nice write up!! Photos are beautiful too..

    ReplyDelete
  5. ఆకు రాల్చిన చెట్ల గురించి బాగా రాసారు.
    నాకెందుకో వాటిని చూస్తే యుద్దం చేసి అలసిన వీరులనిపిస్తుంది.
    మరో యుద్దానికి సిద్దమన్నట్టు వసంత మాతకు స్వాగతం పలుకుతాయి

    ReplyDelete
  6. పరిమళం గారు అద్బుతంగా వుందండీ మీ వసంతం
    నాకు ఒక పాట అప్రయత్నంగా వచ్చేసింది ."తరలి రాదా తనే వసంతం తన దరికి రాని వనాల కోసం "

    ReplyDelete
  7. పరిమళాన్ని చూసి పువ్వు పేరు చెప్పినట్లు,టపా చదివి ఓక ఊహా చిత్రాన్ని గీసుకున్నట్లు కదా!
    మీ టపా తెచ్చేసింది మా ఇంటికి ఉగాదిని.
    పరిమళం మరి ఉగాది పచ్చడి?

    ReplyDelete
  8. పరిమళం గారు, సంతోషం.నన్ను 20సంవత్సరాలు వెనక్కు నడిపించారు.నల్లమల అడవుల అంచున వుండే నాకంటే వేరెవరు వసంతాన్ని అంత బాగా ఆస్వాదించి వుండరు.మసక చీకటి చెదరక ముందే సైకిలేసుకుని అడవి లోకి వెల్లడం,ఎండిపోయినట్లు కనిపించే మోడులనుండి బుడిపెలుగా వెలువడుతున్న పసిమి రాసులను చూడడం నా నిత్యకృత్యం. అక్కడెక్కడో దూరంగా కోయిలమ్మ కమనీయరాగాన్నేదో సాధన చేస్తున్నట్లు వినిపించేది. అదృష్టం వుంటే పురివిప్పి ఆడే నెమలి, చెంగుమని దుమికే కృష్ణ జింకలు కనపడేవి.ఎలుగుబంట్లు దాడి చేస్తయన్న భయం వున్నా అది నా సౌందర్యాధనముందు అగుపించేది కాదు.అలా ఎంతసేపుండేవాడినో నాకే అర్తం అయ్యేది కాదు.అడవిలో కోకిలలే కాదు,కవుల భావనకు నోచుకోని ఎన్నో గుర్తు తెలియని పక్షుల రవాలను కూడా విని దాచుకున్న నామనసెంత ఫలవంతమైంది అని అనిపిస్తుంటుంది.. ’ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములు.”
    -సుబ్బారెడ్డి

    ReplyDelete
  9. గుబురుల మాటున తాను కనపడకనే తన గొంతులోని మాధుర్యాన్ని పంచుతుంది కోయిలమ్మ .....కనపడకనే వారి మనసుల్లోని భావతరంగాలు మనతో పంచుకొంటున్న మన బ్లాగరులూ ......
    సరైనదే... చక్కని పోలిక. మీ మంచి మనసుకు అద్దం పడుతోంది. సరైనదే... చక్కని పోలిక. మీ మంచి మనసుకు అద్దం పడుతోంది. :)
    వసంతఆన్ని చక్కగా వర్ణించారు:)

    ReplyDelete
  10. @ నేస్తం ! థాంక్స్ !

    @ మురళి గారు ,ధన్యవాదాలు ...ఇస్మాయిల్ అంటే ......

    @ చైతన్య గారూ ! ధన్యవాదాలండీ !మరి ఆకురాలిన చెట్ల రహస్యం మాతో ఎప్పుడు పంచుకుంటారు ?

    @ వేణు గారు ,థాంక్సండీ ....

    @ మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ గారూ ! "యుద్ధం చేసి అలసిన వీరులు" పోలిక ఎంతో బావుంది .ధన్యవాదాలండీ .

    @ చిన్ని గారు ,మీరు పాట గుర్తు చేయగానే నాకేమని పించిందో తెలుసా .....మీరంతా నా బ్లాగ్ వనం లోకి తరలి వచ్చిన వసంత కోకిలలే కదండీ ! థాంక్స్ .

    @ శృతి గారూ ! అందుకోండి ముందస్తు ఉగాది శుభాకాంక్షలు .ఇక పచ్చడంటారా ....మరి మీ అందరి కామెంట్సే ఐదు రుచుల చేదులేని ఉగాది పచ్చడి .

    @ సుబ్బారెడ్డి గారూ ! మీ బ్లాగ్ లో చెంచుల జీవితాల్లో వెలుగు నింపేందుకు మీ పోరాటం కనిపిస్తే .....మీ భావుకతను పంచుకున్న నా బ్లాగ్ ధన్యం .మీ అనుభవం చదువుతుంటే ప్రకృతి కళ్ళముందు కదులుతున్న భావన .ధన్య వాదాలండీ

    @ ప్రేమికుడు గారూ ! ధన్యవాదాలండీ . ప్రపంచం ఒక అద్దం .మనల్ని మనం చూసుకోవడమే .మరి మనమెలా ఉంటే మన ప్రతిబింబం అలాగే కనపడుతుంది కదండీ . మన బ్లాగరులు కూడా అంతే నండీ .ఎదుటివారిని చూసి ఈర్ష్య పడే లోకం కాదిది .మెచ్చుకొని ,ప్రోత్సహించి , తప్పటడుగులు వేస్తుంటే సున్నితంగా హెచ్చరించి ,అవసరమైతే చేయిపట్టి నడిపించే వారున్న అందమైన పూల వనం .మీ అభిమానానికి కృతజ్ఞతలు .

    ReplyDelete
  11. వసంతం.ఆ పెరు వింటేనే మనసు పరవసిస్తుంది
    కోయిలల కుహూ రావాలు వినిపించేధి అప్పుడేగదా.
    మంచి సమయానికి గుర్తు చేశారు.ధన్యవాదాలు
    పరిమళగారూ!

    ReplyDelete
  12. పోలిక సరైనదే అయిన చిన్న సవరణ .బయట కోయిల కూయగానే అది కాకి కాదు అని అర్ధం చేసుకుంటాం ఈ బ్లాగ్లోకం లో కోయిల లా కూసినా కూడా కాకి గోలే అంటారు కొందరు.యద్భావం తద్భవతి అని సరి పెట్టుకోవాలి .

    ReplyDelete
  13. హాయ్ పరిమళం గారు ,జస్ట్ మీ కామెంట్ మొడరషన్లో ఎగిరిపాయిందండి ,మీరు ఇప్పుడే రాసినట్లున్నారు బాగా నవ్వుకున్నట్లున్నారు ..

    ReplyDelete
  14. @ జయ చంద్ర గారూ ! పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదాలండీ .

    @ రవి గారూ ! థాంక్స్ !:) :) !

    @ చిన్ని గారూ ! అవునండీ !

    ReplyDelete
  15. ఇస్మాయిల్ గారు కవి అండి.. చెట్టుని కవితా వస్తువుగా తీసుకుని చాలా కవితలు రాశారు.. ప్రకృతి ప్రేమికుడు.. ఆయనకి 'చెట్టు కవి' అని పేరు..

    ReplyDelete
  16. @ మురళి గారూ !ధన్యవాదాలు.

    ReplyDelete
  17. parimalam garu nijanga mee bhavalu parimalistoo gubalistoo eedoo anirvachaneeyamaina adbuta lookam loo viharimpa chesindi.baalyam looni anubhootula ruchulu malli aaswadinchanu.
    chaala dhanyavaadamulu.

    varsha

    ReplyDelete