Friday, March 6, 2009

మల్లెలు .....


మల్లెలు .....
పేరు వింటే చాలు మగువల
హృదయపు పరవళ్ళు .....
వాటి పరిమళాలు పుట్టించు
పురుషుల గుండెల్లో గుబుళ్ళు
నవ దంపతుల మధ్య
సయోధ్య చేకూర్చు చెలులు
షష్ట్యబ్ధి దంపతులకూ ...
అవి నెరిసిపోని మురిపాలు
ఉదయపు అలకలను
మాపటి వలపులుగా మార్చేసే
మంత్ర గత్తెలు మల్లెలు ......

15 comments:

  1. పరిమళం గారు ఈ మల్లెపూల మీద ఎంత రాసిన తక్కువేనేమో ,మా ఇంట్లో నాలుగు చోట్ల పెట్టా,బుట్టలుబుట్టలు పూయాలని ,అవి కోయటానికి నేను కష్టపడాలని ,ప్చ్ ,,నేను ఫీల్ అవ్వకుండా ఉండాలని గుప్పెడు ,గుప్పెడు మాత్రమె పూస్తాయి .అమ్మ వాళింట్లో,ఆ పొదల రాక్షకురాల్ని,{భాక్షకు}నేనే ,అక్కడ అంతంత మాత్రమె పూస్తాయి .మల్లెపూవు అనగానే ఆనాటి సినిమా {శోభన్ బాబు }గుర్తుకోచ్చిందండి .

    ReplyDelete
  2. మల్లెల కవితా పరిమళాలు వెదజల్లారు.రకరకాల మల్లెల ఫోటో పరిమళాలకు సొబగులద్దింది.

    ReplyDelete
  3. చాలా బాగా రాసారు.నాకు కూడా నలుగు మాటలు రాయలనిపించింది

    మల్లెలు
    ఈ e-కాలం లోను
    పూబంతాటల్ని తొలినాటి కబుర్లను
    గుర్తుకు తెచ్చి, మనసులను మనుషులను
    కలపగల మన్మధబాణాలివేను

    ReplyDelete
  4. పరిమళంగారు,
    అయ్యో ...కాస్త ఆలస్యంగా చూశాను మీ మల్లెసౌరభాన్ని.క్షమార్హున్ని.
    "మనసున మల్లెల మాలలూగెనే..కన్నుల వెన్నెల డోలలూగెనే...ఎంతహాయి ఈ రేయి నిండెనో..ఎన్నినాళ్ళకీ బతుకు పండెనో..గడియయైన ఇక విడిచి పోకుమా.."అబ్బా మల్లెలను తలుచుకుంటెనే కృష్ణశాస్త్రి నెనుపుకువస్తారు,వేసవి ఎంతటి కరుకుదైనా క్షమించవచ్చు.ఎందుకంటే అది మల్లెలను వాగ్దానం చేస్తుంది.నిప్పులుచెరిగే అంత ర్జాతీయ వేదికపైనైనా మల్లెలు ముల్లెలుగావుంచండి సమస్య సరసంసంగానూ ,సామరస్యంగానూ నుగియకపోతే నన్నడగండి.
    -సుబ్బారెడ్డి

    ReplyDelete
  5. బావుందండి..మీ మల్లెల పరిమళాలు........

    ReplyDelete
  6. మగువలకు మల్లెలకు విడదీయరాని అనుబంధం కదా.. గత ఏడాది వేసవిలో మల్లియలారా అని కొన్ని కబుర్లు చెప్పాను.

    ReplyDelete
  7. 'ఉదయపు అలకలను
    మాపటి వలపులుగా మార్చేసే
    మంత్ర గత్తెలు మల్లెలు ...... '
    ఏం చెప్పమంటారండి..? చాలా చాలా బాగుంది..

    ReplyDelete
  8. మీరు పెట్టిన చిత్రం చూస్తుంటే - అబ్బా, నిజమే నేనందుకే ఈ పూల కోసం అంత హోరాహోరీ పోట్లాడేదాన్నేమో అందరితో ఆ రోజుల్లో అని మళ్ళీ గుర్తుచేసుకున్నాను. మా పెరటి మల్లెలతో మొదలైన ఆ ప్రహసనం చాలా ఏళ్ళే కొనసాగింది. జుట్టుకన్నా పూలు ఎక్కువ కావాలని పేచీలుపడేదాన్ని. అప్పుడు శూర్పణకో, మోహినీ పిశాచమో ఆవహించేసేది, చివరికి నా గోల, ఏడ్పు చూడలేక అమ్మ త్యాగం చేసేసిన తన వంతు మూర కూడా పెట్టేసుకునేదాన్ని. మళ్ళీ మర్నాడూ అదే తంతు. వేసవతా అదే తీరు.

    ఆస్ట్రేలియాలో మాత్రం చాలానే పూయించాను, దాదాపుగా 300-400 మొగ్గలు కోసి మా సందులోని శ్రీలంక తమిళులకి పంపేదాన్ని అపుడు పెట్టుకోవటం కన్నా, పంచటం ఇష్టంగావుండేది. ఇపుడు కుండిల్లో ఒకటొ రెండో పూస్తే తిరిగి తిరిగి ఆ మొక్క చుట్టూ తిరగటం, మురవటం ఓ పని.

    ReplyDelete
  9. మీ పరిచయం (ప్రొఫైల్) చాలా స్వఛ్ఛం గా ఉంది!.

    ReplyDelete
  10. బాగుందండి...
    మల్లెపూలు ఇష్టపడని మగువలెవ్వరు!?

    ReplyDelete
  11. @ చిన్ని గారూ ! మల్లెలు దోసెడైనా ,గుప్పెడైనా పరిమళం మధురమే కదండీ ! ఆ సినిమాలోని "చిన్న మాటా ...ఒక చిన్న మాటా " పాట నాక్కూడా చాలా ఇష్టమండీ ....ధన్య వాదాలు .

    @ విజయ మోహన్ గారూ ! ధన్యవాదాలండీ .

    @ అరుణాంక్ గారూ ! "ఈ e-కాలంలోనూ " పదప్రయోగం భలేవుందండీ ...మీ కవిత కూడా ....థాంక్స్ .

    @ సుబ్బారెడ్డి గారూ !" వేసవి ఎంతటి కరుకుదైనా క్షమించవచ్చు.ఎందుకంటే అది మల్లెలను వాగ్దానం చేస్తుంది." ఎంత బాగా చెప్పారండీ ...మల్లెలు మగువలకే కాదు ,మగవారి మనసులనూ గెలుచు కుంటాయని చక్కగా చెప్పారు ధన్య వాదాలండీ .

    @ శేఖర్ గారూ ! థాంక్స్ .

    @ జ్యోతి గారూ ! మీ "మల్లియలారా "చదివానండీ ....బావుంది పూలబుట్ట మరీనూ .....ధన్యవాదాలండీ .

    @ మురళి గారు ! ధన్యవాదాలు .

    @ ఉష గారూ ! చిన్నప్పుడు నేనూ అంతేనండీ ....బయట కొన్న బారెడు దండ కన్నా మన ఇంట్లో పూసినవి రెండైనా మురిపెమే .....ధన్యవాదాలండీ .

    @ శాంతి గారూ ! థాంక్స్ .

    @ చైతన్య గారూ ! మగువలేనా ......? థాంక్స్ .

    ReplyDelete
  12. పరిమళం!
    భలే చక్కగా గుర్తు చేశారు. వేసవి మండిస్తానంటూ వస్తోంది కదా! మీరు ముందుగానే రెడీ అయ్యారా మల్లెలతో? చాలా బావుంది.

    ReplyDelete
  13. 'మంత్ర గత్తెలు మల్లెలు ..'
    బాగుందండి...చాలా బాగా రాసారు.. :)

    ReplyDelete
  14. @ sruti! thanks!

    @ monkey2man ! thanks!

    ReplyDelete
  15. ఉదయపు అలకలను
    మాపటి వలపులుగా మార్చేసే
    మంత్ర గత్తెలు మల్లెలు ...... ఎంత బాగా చెప్పారు అండి.
    ఎంతయినా మగువలు మెచ్చిన మల్లెలు కదా...

    ReplyDelete