Sunday, September 13, 2009

ద్వితీయ విఘ్నం !


అవి నేను తొమ్మిదో తరగతి పరీక్షలు రాసేసి బలాదూర్ గా ( అప్పట్లో ముందస్తు కోచింగ్ లూ అవీ లేవులెండి ) తిరుగుతున్న రోజులు ....ఇక సెలవులకి అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్దాం అనుకుంటూ ఉండగా పిడుగులాంటి వార్త ! మరో మూడు నెలల్లో నాన్నగారికి ట్రాన్స్ఫర్ ! అప్పటికీ ఊహ తెలిసినప్పట్నుంచీ దాదాపు అదే ఊర్లో ఉంటున్నాం ఇప్పుడు ట్రాన్స్ఫర్ అంటే నాస్నేహితుల్ని , ముఖ్యంగా ...లలిత , పరిమళ , కిషోర్ , చిన్ని లను విడిచి వెళ్ళాలంటే ...అమ్మో ....అనిపించింది . కానీ ముందే చెప్పుకున్నాం కదా విధి బలీయమైందని !దానికి జాలీ దయా ఉండవు అనుకున్నట్టే మమ్మల్ని విడదీసింది .

ఐతే ఈ ట్రాన్స్ఫర్ వల్ల మధ్యలో నాకు టెన్త్ క్లాస్ మధ్యలో జాయినింగ్ కుదరదని ....మా పిన్నిగారింటి దగ్గర ఉండి టెన్త్ చదివేలా ఏర్పాటు జరిగిపోయింది . పిన్ని అమ్మ తర్వాత అమ్మే నాకు ! నాన్నగారికంటే చిన్నాన్నగారికి మరీ గారం నేనంటే !వెంటనే ఎగిరి గంతేసి ఒప్పేసుకున్నా అక్కడ చదవటానికి !

ఓ శుభ ముహూర్తంలో ( కేలండర్ చూసి ) పిన్నిగారింటి వెనుకే ఉన్న హైస్కూల్ లో చేర్చారు . ఆరోజు శనివారం !మొదటి రోజు స్కూల్ ! బిక్కుబిక్కు మంటూ వెళ్లాను. పెద్దగా క్లాస్ లు ఏమీ జరగలేదు పరిచయాలూ ....కబుర్లూ తప్ప !ఆరోజు స్కూల్ లాస్ట్ పిరీడ్ లో హెడ్ మాస్టర్ పిలుస్తున్నారంటూ ప్యూన్ కబురు మోసుకొచ్చాడు . ఉదయం జాయిన్ ఐనప్పుడు చూశాను నిలువెత్తు మనిషి ...నల్లటి ఛాయా ...ఎర్రటి కళ్ళూ ...భయం గొలిపేలా ఉన్నాయన రోజుకొక సారి లెక్కల క్లాస్ కి వస్తారంటేనే భయపడిపోయాను ( నాకసలే లెక్కల్రావ్ మరి ) ఇక ప్రత్యేకంగా కబురుపెట్టారంటే ....దడ దడ లాడే గుండెతో ..ఆయన రూంలో అడుగుపెట్టా ....భయపడుతూనే తలెత్తి సర్ !పిలిచారట ....ఆయన విశాలంగా నవ్వుతూ (నాకు బాగా గుర్తు ఆ నవ్వు ఆయనకస్సలు సూటవలేదు ) నువ్వు ఈరోజే చేరావుకదా ...రేపు ఆదివారం ద్వితీయ విఘ్నం అవుతుంది .అలా కాకుండా ప్యూన్ కి తాళా లిచ్చి పంపిస్తా ...రేపొచ్చి క్లాస్ లో కాస్సేపు కూర్చొని వెళ్ళు అని చెప్పారు . సరేనని ...ఇంటికెళ్ళాక పిన్నికి చెప్పా ద్వితీయవిఘ్నం గురించి వివరంగా నాకు చెప్పి ఆయనంత శ్రద్ధ తీసుకున్నందుకు మురిసిపోతూ నన్ను మర్నాడు స్కూల్ కి పంపించింది .

సరే వెళ్లి ప్యూన్ గారి దయవలన ఖాళీ క్లాస్ రూం లో బిక్కుబిక్కు మంటూ కాస్సేపు కూర్చుని ద్వితీయ విఘ్నం బారినుండి తప్పించుకున్నా అని ఆనందపడుతూ ఇంటికొచ్చేశా ! ఏడెనిమిది నెలల తర్వాత గానీ తెలీలేదు ...క్లాస్ కెళ్ళి ఊరికే కూర్చుంటే కాదనీ ...నా చదువుకు విఘ్నం తప్పలేదనీ ......ఆ తర్వాత ద్వితీయ విఘ్నం ఎంత పవర్ ఫుల్లో అర్ధమైంది .అప్పటినుంచీ నాకు ఆ సెంటిమెంట్ స్థిరపడి పోయింది .

25 comments:

  1. మీరూ ద్వితీయ విఘ్నం బాధితులే అన్న మాట.. కొన్ని సెంటిమెంట్లు అంతేనండీ. తెలియకుండానే స్థిరపడి పోతాయి.. క్లాసు లో ఒక్కరూ కూర్చోడం తల్చుకుంటే మాత్రం నవ్వాగడం లేదు.. ఫోటో కూడా భలే సంపాదించారు..

    ReplyDelete
  2. naaku umdi ee nammakam maa amma,naannamma valanaa vachchimdi.

    ReplyDelete
  3. ద్వితీయ విఘ్నం సెంటిమెంట్ నాకూ ఉందండి..

    ReplyDelete
  4. మీ పరిమళాలు చాలా బాగున్నాయి.
    బ్లాగ్ వివరణలో (description)ఎందఱో ను ఎందరో గా సరిచేయగలరు.

    ReplyDelete
  5. ద్వితియవిఘ్నం అద్వితీయంగా వుంది,

    ReplyDelete
  6. ద్వితీయ విఘ్నం - ఈ భయాన్ని మనసులోకి జొప్పించిన పెద్దవారందరూ నాకిప్పుడు శత్రువులే. :) తెలియకుండానే ఆ ఆలోచన ప్రతి పనిని ప్రభావితం చేస్తుంది.

    ReplyDelete
  7. మా అమ్మ గారు కూడా ఎప్పుడు ద్వితీయ విఘ్నం వుండ కూడదని చెప్పేవారు.ఇంతకీ మీ విషయం లో ఎనిమిది నెలల తర్వాత ఏం జరిగిందో రాసి వుంటే ఆ రోజు మీరు పుస్తకం తెరిచారో లేదో నేనే చెప్పేవాడిని .

    ReplyDelete
  8. పోన్లెండి, రెండోరోజు వెళ్ళారు కాబట్టి మీ ఇంటిలో వాళ్ళు పదో తరగతి దాకా నైన ఆగారు. లేకపోతే ఎలా వుండేదో :) jk

    ReplyDelete
  9. నాకూ చాలా నమ్మకం సుమండీ........ :)

    అయినా ఎందుకంత బాధ పడతారు? మీకు చదువు రాదని ఎవరన్నారు? అసలు చదువంటే ఏమిటీ? స్కూలులో చెప్పేది మాత్రమే చదువు కాదు. అది మనకు తిండి పెట్టడానికి పనికొస్తోందేమో కానీ అసలైన విద్య ఇంకా ఉంది. నేటి( కళా శాలల్లో ) చదువుకున్న/చదువుకుంటున్న ఎంతోమంది కంటే మీ వ్యక్తిత్వం చాలా ఎత్తులో ఉందని నా అభిప్రాయం. కనుక స్మైల్ ప్లీజ్ ............ :):)

    ReplyDelete
  10. ఈ సెంటిమెంటు నాకూ ఉందండీ..... పెద్దలు బుర్రలో పెట్టిందే..

    ReplyDelete
  11. అబ్బ ఈ ద్వితీయ విఘ్నం గోల ఇంత అంత కాదు కదా... కిందటి సవత్సరం మా అబ్బాయి స్కూల్ రెండో రోజే లేదు వెంటనే ఏదో సెలవిచ్చారు, కొంచం మనసు పీకింది కాని ఏమి చెయ్యలేము కదా. ఫొటో బాగుంది.. పాపం బుజ్జమ్మ ఎన్ని కష్టాలో .....

    ReplyDelete
  12. ఇది చదివాక అన్ని నమ్మాల్సి వచ్చేట్టు వుంది

    ReplyDelete
  13. మీ బాల్య స్మృతులు బాగున్నాయి. మీ ఫోటో కలెక్షం అదుర్స్. మీ కథనం అలా చివరంటా తీసుకుపోతుంది. నమ్మకాలుగురించి వేరే.

    ReplyDelete
  14. ఫొటో భలే వుందండి .
    ద్వితీయ విఘ్నం తో చదువు గంట వాయిచారేమిటండీ

    ReplyDelete
  15. ఓహ్ ! మాకివేం కొత్త కాదు లెండి. ఇలాటి అనుభవాలు వందల్లో చూసుంటాను. ఎందుకంటే నేనో టీచర్నిగా ! అయితే మీ headmaster లా నేనెవర్నీ ఉంచలేదు. చాలా సందర్భాల్లో పేరెంట్సే అడుగుతారు. అలాగని సండే రోజు బిక్కు బిక్కు మంటూ ఉండాల్సిన అవసరం లేదు. మాదో కార్పొరేట్ స్కూల్ కాబట్టి మీ పరిస్థితి ఎవరికీ రాదు.Sometime or other everybody becomes a victim to this 2nd obstacle somehow or the other మీ బ్లాగు బాగుంది.photo is nice.

    ReplyDelete
  16. పరిమళం గారు, చాలా రోజుల విరామానంతరం ఇటు వచ్చాను. మీ అనుకోకుండా ఒక రోజు పెళ్ళి చూపుల నుండి అన్ని టపాలు ఇపుడే చదివాను. చాలా బాగున్నాయ్.
    అన్నట్లు నాకూ ఈ ద్వితీయ విఘ్నం నమ్మకం ఉంది :-)

    ReplyDelete
  17. అవునండి, ద్వితీయ విఘ్నం అందరు నమ్ము తారు. పోయిన సంవత్సరం మా కాలేజ్ శుక్రవారం 13 వ తారీఖున రిఓపెన్ చేసారు. ఇదికూడా భయమే. అంతేకాదు, మర్నాడు సెకండ్ సాటర్డే హాలిడే ఉంది. ఏవిటో రెండు విఘ్నాలతోటి ఈసారి మొదలైంది అని అందరం అనుకున్నాం. అందుకు తగ్గట్లుగానే 17వ తారీఖున ఎంతో మంచివాడు, మాకు ప్రతిరోజు రకరకాల పూలు ఇచ్హే మా వాచ్మాన్ 'మజార్ ' చనిపోయాడు. అందరం ఎంతో బాధపడ్డాం.

    ReplyDelete
  18. చక్కని దృశ్యమాలికలూ !అలంకరణతొ అలరించిన మీ పూపొదరిల్లు,చిన్ని పదాల్లో విశేష విశేషణాలు ,తీసుకునే సందర్భాలూ ,సున్నితమైన ,సునిశితమైన భావాబినివేశాలు మీ సొంతాలు !! అదివరకెపుడో మీరంటె నా కొకింత ఈర్శే!??:)అయితే
    తిడ్తె ప్రేమే
    గేలి జాలే
    ఈర్ష్య కీర్తెరుగుటే
    థింక్ పాజిటివ్ అంటే ఇదే!!
    అని నేను ఒక నానీ లో చెప్పినట్టు ఈ ప్రశంసను ప్రసన్నంగా తీసుకొంది పరిమళగారూ ! మీ పేరులోనే ఆ గుభాళింపులునాయి!!

    నేనో బండోడిని మనసుకు వచ్చింది ముక్కు సూటిగా కక్కేయడమేగాని మీ అంత పొందికగా ఒద్దికగా చెప్పడం నాకెప్పుడొస్తుందో!!

    అదివరకెవరో అడిగారు నన్ను tp లో/af లో మీదీ ఒక కవిత్వమేనా అని !! నాకూ మిమ్మల్ని చూసినప్పుడు అదే సందేహం కలుగుతుంది.ఎదో మీ కవిత గురించి రాయాల్సినచోట నా సోది రాసే సాహసం చేస్తున్నందుకు మన్నించండి.
    సదా మీ స్నేహాభిలాషి
    రాఖీ
    http://www.raki9-4.blogspot.com

    ReplyDelete
  19. హ్మ్!!
    నిజమే!! మొన్న మావాణ్ణి బళ్ళో వేసినప్పుడుకూడా ద్వితీయవిఘ్నం కలక్కుండా చూస్కున్నాం!!

    ReplyDelete
  20. పరిమళం గారు నేను మీ బ్లొగ్ కి కొత్త అండి చాలా బాగా రాశారు
    నాకు ఇలంటి సెంటిమెంట్లెమి లెవుగాని అండి మీరు రాసిన తీరు నాకు చాలా బాగా నచ్చింది మరి ముఖ్యంగా ఈ లైను బాగా నచ్చింది అండి
    ."ఆయన విశాలంగా నవ్వుతూ, (నాకు బాగా గుర్తు ఆ నవ్వు ఆయనకస్సలు సూటవలేదు)"

    నాకూ నవ్వొచ్చెసింది............

    మీ లాంటి వారి స్పూర్తితోనే నేనూ ఒక బ్లాగు రాయడం మొదలెట్టెసానండి..........
    www.tholiadugu.blogspot.com

    ReplyDelete
  21. అమ్మో ద్వితీయ విఘ్నం...... అని ఒక సినిమా తీయాలని వుంది నాకు. న జీవితం లో చాల జరిగాయి. నేను కొత్త జాబు లో జాయిన్ అయ్యను శనివారం. ఆదివారం మా ఫ్రెండ్స్ అంత నాగార్జున సాగర్ ప్లాన్ చేసారు. కానీ మా MD ఆదివారం కూడా ఆఫీసు కి రావాలి నువ్వు, నేను కూడా వస్తాను అని చెప్పారు. ఎందుకు అనే అడిగే అంత సీను లేదు. ఏమి చేస్తాం ఏడుస్తూ ఆదివారం కూడా ఆఫీసు కి వచాను. ఏదో చిన్న వర్క్ చెయ్యమని చెప్పి ఒక 1hr తరువాత లంచ్ కి వేలడం పద అని సైహెప్పి తీసుకువెళ్ళారు. అప్పుడు చెప్పారు ఇ ద్వితీయ విఘ్నం గురించి నాకు. అయన చెప్పిన ద్వితీయ విఘ్నం మహత్యం విని, ఫ్రెండ్స్ అంత నన్ను వదిలేసి సాగర్ లో ఎంజాయ్ చేస్తన్నారు అని ఏడవ లేక నవ్వుతు లంచ్ చేసి రూం కి వచ్చాను. కానీ అక్కడ నుండి నా లైఫ్ మారిపొయింది, తరువాత మంచి జాబు వచ్చింది. అప్పటినుండి నాకు ద్వితీయ విఘ్నం లేకుండా గడిపెయడానికి ఎన్నో త్యాగాలు చెయ్యవలిసి వచ్చింది. ఇంక ఎన్ని త్యాగాలు చెయ్యాలో .......................

    ReplyDelete
  22. నా తోటి ద్వితీయ విఘ్నం బాధితులకూ :) స్పందించిన మిత్రులకూ ధన్యవాదాలు.

    ReplyDelete