Monday, June 1, 2009

చిట్టితల్లీ......( కవిత )


చిట్టితల్లీ ! వెళ్ళిపోయావా ?
అమ్మ ఒడిలోకి రాకముందే ...
ఈ లోకపు కుళ్ళును చూడలేక
ఆడపిల్లవని అలుసు చేస్తామని ..
చదివినంత చదువు చెప్పించమేమోని
చెప్పించినా ...అల్లరిమూకల
ఆకలి చూపుల కెరకాలేక
ప్రేమోన్మాదుల యాసిడ్ దాడుల భయంతో
అనుమానపు చూపుల అవహేళన
తట్టుకొని నిలువలేక ...
అత్తవారింట వరకట్నపు కోరలకు
ఆహుతి కాలేక ...కన్నవారి
కడుపులో చిచ్చు పెట్టలేక
ముందుగానే వెళ్ళిపోయావా
చిట్టితల్లీ .....
చుక్కల లోకంలో మబ్బుల
తూగుటుయ్యాలలో .....
ఊయలలూగేందుకు హాయిగా ......

13 comments:

  1. పరిమళగారు ...ఫొటో Superb!!
    అమ్మ ఒడిలోకి రాకముందే ...
    అనేవి ఇప్పుడు తగ్గాయనుకుంటానండి!!!

    ReplyDelete
  2. hmmm...chitty talli ani cheppi acid dadulu annaru appudu chitty talli ani ela antaru..
    baaga raasaru parimalam garu

    ReplyDelete
  3. చుక్కల లోకంలో మబ్బుల తూగుటుయ్యాలలో... ఊయలలూగేందుకు హాయిగా వెళ్ళిపోయింది నా చిట్టితల్లి....

    ReplyDelete
  4. ప్చ్.....చెత్తకుప్పలో పసిపాప శవం చూసిన ప్రతిసారీ ఇలాగే అనిపిస్తుందండీ... అభివృద్ధి అని మాట్లాడుకుంటాం కానీ ఇలాంటి విషయాల్లో ఇంకా చాలా వెనుకబడి ఉన్నాం...

    ReplyDelete
  5. నాదొక విన్నపం.
    లేవండి, లేచి పోరాడండి. ఆడదికూడా మనిషే అని నిరూపించండి.
    ఆడపిల్ల పిట్టింది, లేచి నిలబడింది, యాసిడ్ పోసినోడి గొండెలపై తన్నింది అని రాయండి. ఆడదానికి కూడా బలం ఉంది అని రాయండి. సమాజాన్ని, కుళ్ళుని, చెడుని నిర్భయంగా ఎదురించిందీ అని రాయండి. వాళ్ళ కనీస హక్కులకోసం గుండెల్లో విద్యుత్తునింపుకుని, ధైర్యంగా నిల్చుంది అని రాయండి.

    ReplyDelete
  6. ఇదే చిట్టి తల్లి ఆశయాల అంబరాన, కీర్తి కాంతుల వెదజల్లుతూ చిరునగవు చెదరక అరమూత కనుల మరేవో కలలు కంటుందని - వూహించండి. ఆ భావన ఎంత బావుంటుందో.
    రామరాజు గారిదే, నా మనవీను. అయినా అబల అన్న సమాజాన్ని, ఆమె మాత్రమే మార్చాలి. చదివి కూడా ఇదేం పని చెప్పండి, మీకు తప్పనిసరిగా ఆముదం పెట్టి తలంటాలి. వద్దండి, ఇకపై వీటిని తలవను కూడా వద్దు, అవి గతాలు. ఆ శిధిలాలు మనం ఇక తవ్వ వద్దు. మీకు బాధ కలిగించటం నా భావ్యం కాదు, కానీ మీ కవితలోని భావనని స్వీకరించటం, అంగీకరించటం నా వల్ల కాలేదు.

    ReplyDelete
  7. మనసు కలుక్కుమంది చదవగానే... 80 ల చివరిలో 90 ల లో అనుకుంటా ఈ భౄణ హత్య లు తెగ జరిగేవి ఆడ పిల్ల అని తెలిస్తే...

    ReplyDelete
  8. @ పద్మార్పిత గారు , thanks ! ఇప్పుడు తగ్గాయి ...కానీ పూర్తిగా కాదు కదండీ !

    @ హరే కృష్ణ గారూ ! కన్నవాళ్ళకి ఎప్పుడూ చిట్టితల్లెనండీ ..

    @ విజయ మోహన్ గారు , ఆ బాధే ఇలా అక్షరాలుగా మీముందు ...

    @ శ్రీ గారు , ధన్యవాదాలు .

    @ మురళి గారు , వార్తల్లో , పేపెర్ లో చూసినప్పుడల్లా కలిగిన బాధేనండీ ఇది ! రీసెంట్ గా జరిగిన ఓ ఇన్సిడెంట్ నాచేత ఇలా రాయించింది .

    @ భాస్కర్ రామరాజుగారు , ముందుగా మీకు స్త్రీల పట్ల ఉన్న గౌరవానికి ధన్యవాదాలు. పుట్టనిస్తే ..ఆమె అబలో ..లేక సబలో అవుతుంది ...కాని ఇంకా ఆడపిల్లని భూమ్మీదకు రానివ్వనివారు ఉన్నారండీ ....

    @ ఉష గారు ! మీ చేత తలంటించుకోవడం నా భాగ్యం :) :)
    నాకు తెలిసినవారు గర్భవతి అని తెలియగానే ...మగపిల్లవాడు పుడతాడని నమ్మి నాటు మందు తినిపించారట ...అది వికటించి ...అబార్షన్ అయ్యింది ....పైగా వారు చదువుకున్నవారే !ఆ ఆవేదనతో రాసినదే ...కాని మన అభివృద్దికి వ్యతిరేకిని కాదండీ ...

    @ భావన గారు , 2009 లో కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయండీ ...అభివృద్ది కనిపిస్తున్నా అప్పుడప్పుడూ మన దృష్టి లోకి వచ్చేకొన్ని సంఘటనలు మనసును కలచివేస్తాయి ...మొన్న పేపర్ లో , న్యూస్ లో ఒక అన్న , మానసిక వికలాంగురాలైన చెల్లెలిపై అత్యాచారం చేస్తున్నాడని చూసినప్పుడు ....ఈ మానవ మృగాలకు ఎప్పుడు పరివర్తన కలుగుతుందో అర్ధం కాదు . ఏ స్త్రీ అపర కాళిలా మారి అంతమొందిస్తుంది ...ఆమెకు ఏ రకమైన న్యాయం జరుగుతుంది .
    ఎక్కువగా ఆవేశ పడినట్టున్నా ! కానీ ఏం చేయలేని నిస్సహాయతలోనుండి వచ్చిన ఆవేదన !

    ReplyDelete
  9. నా హృదయం కరిగింది.. నే మూగను.. ఈ విషయం లో..

    ఆలోచింపజేసి ఏడిపిస్తున్నారు ...
    నిస్సహాయతను గుర్తు చేస్తున్నారు...

    పరిష్కారం తెలిస్తే ఎవరైనా సరే..... ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్......

    చెప్పండి.. ఏ కొంచెం మంచి జరుగుతుందన్నా .. నా వంతు.. నేనూ .. ప్రయత్నం చేస్తాను..

    కొంచెం ఎమోషనల్ అయినట్టున్నాను..

    Thanks to పరిమళం గారు and every one...

    ReplyDelete
  10. @ శివగారు , ప్చ్ ..ఏం చేయగలం ?చెప్పండి ..ప్రభుత్వం కొంతవరకు చేస్తోంది ....హోమ్స్ లో వదిలిపెట్టండి మేం చూసుకుంటాం లేదా పిల్లలు లేనివారికి దత్తత ఇస్తాం అని !
    అసలు ఆడపిల్ల విలువ తెలియనివాళ్ళు చేసే పనులివి .కొందరు ఆడపిల్ల కోసం ఎంత తాపత్రయ పడతారో ...త్వరలో మరో టపాగా రాయాలనుకుంటున్నా .....
    మీ స్పందనకు ధన్యవాదాలు .

    ReplyDelete
  11. పరిమళం గారు,
    చాలా బాగుంది... బాధగా కూడా ఉంది...
    హృదయాంతరాల్లో... ఎక్కడో... అగ్నిపర్వతం బద్దలైనట్టనిపించిది... చదవగానే.
    ఆ లావా మనసంతా పాకి బాధ కలిగించింది.

    నిజంగానే... శివ గారు చెప్పినట్టు అలోచిమ్పజేసి ఏడిపించారు, నిస్సహాయతను గుర్తుచేశారు...

    ReplyDelete
  12. ప్రణవ్ గారూ ! మీ హృదయ స్పందన మీ వాఖ్యలో కనిపించిందండీ ....ధన్యవాదాలు .

    ReplyDelete