Wednesday, June 3, 2009

మీకు తెలుసా ?


చాలా యుగాల క్రిందటి మాట ! క్షీర సాగర మధనం జరిగింది . శ్రీ మహా విష్ణువు మోహినీ రూపంతో అమృతాన్ని దేవతలకు పంచేశాడు . రాక్షసులు అది మనసులో పెట్టుకొని తమ వర గర్వంతో , కామరూప విద్యలతోనూ ..దేవతలమీద దండ యాత్రలు చేశారు .ఐతే విష్ణు మాయ వల్ల ఎప్పుడూ చివరికి దేవతలే గెలిచేవారనుకోండి ...ఇక మన విషయం లోకి వస్తే ...

పై కధంతా తెలిసిన మానవుడొకడు ...తీవ్ర తపస్సు చేశాడు . అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఎందుకు మానవా ఇంత తీవ్ర తపస్సు చేస్తున్నావ్ ? అని అడిగాడు .
మానవుడు ..స్వామీ దేవతలకు ...అమృతాన్ని ఇచ్చారు ...రాక్షసులకు కామరూప విద్యలన్నీ తెలుసు ...కాని మా మానవులకు అన్యాయం జరిగింది .కనుక మాక్కూడా అమృతాన్ని రుచి చూసే భాగ్యం కలగచేయండి . అని ప్రార్ధించాడు .

అప్పుడు బ్రహ్మ దేవుడు ...నాయనా అమృతాన్ని మీకిస్తే దేవతలకూ , మానవులకూ తేడా లేకుండా పోతుంది ..మానవులకు జరా మరణాలు తప్పనిసరి కదా ! కనుక అమృతం తో సరిసమానమైన రుచి కలిగిన దానిని మీకు వరం గా ఇస్తున్నాను తీసుకో అంటూ అతని చేతిలో ఒక పండు జార విడిచాడు .

మానవుడు మహా ప్రసాదంగా కళ్ళకద్దుకొని ఆ ఫలాన్ని ఆరగించి దాని రుచికి మైమరచి పోయి ...ఆహా ..ఈ ఫలాన్ని మన ముందు తరాలవారందరూ ఆరగించాలని ....ఆలోచించి ..ఆ విత్తనాన్ని భూమిలో పాతాడు .దానినుండి వచ్చిన మొక్క ...మానై ...కాయలు కాసింది .ఆ కాయలు ఇప్పటికీ ప్రతి వేసవిలోనూ నోరూరిస్తూ మనముందుకొస్తున్నాయి.

ఆ రోజు బ్రహ్మ ఇచ్చిన పండే ఈ రోజు మనం అందరం ఇష్టపడి తినే మామిడి పండు అన్నమాట !

** కధ చదివిన వారంతా క్షమించాలి ! ఇప్పటికే మీకు అర్ధమై ఉంటుంది ఇది కల్పితమని !
మామిడిపళ్ళు అంటే నాకు ప్రాణం !మా వాళ్లు అందరూ వెక్కిరిస్తారు నీ అంత మావిడి పళ్ళ పిచ్చి ఎవరికీ ఉండదని !
అలా వెక్కిరించిన వారికి నేను చెప్పే కల్పిత గాధ ఇది ...కనుక మీరూ సరదాగా తీసుకుంటారు కదూ .... :)

26 comments:

 1. ఆ వెక్కించేవారికి చెప్పండి, మీకొక నేస్తం వుందని, నవ్వుతారేమో కానీ నేను నివసించిన ఈ మూడు దేశాల్లోనూ ఏనాడూ ఎంత వెల అని చూడక, కొని తినేది నేనొక్కదాన్నే సుమీ! ;) మా మామిడి తోట తాతగారు చాలా బాగా వేయించారు[ట], ఎన్ని రకాలు వుండేవో, చిన్న, పెద్ద, చెరుకు రసాలు, నీలాలు, తెల్ల గులాబీ, బంగినపల్లి, అల్ఫాన్సా, హిమాం పసంద్, ఇలా మొదలైన ప్రహసం మరూబ్రా, మరథాన్, థాయ్ రకాల మీద సాగుతుంది. పోయిన సంవత్సరం నుంచి మళ్ళీ దిగుమతి allow చేసారు కనుక మన రకాలు మళ్ళీ తింటున్నాము. ఇక మామిడి తాండ్ర వతనుగా తినే స్నాక్. కనుక సహేతుకంగా మా [మామిడి పళ్ళ] ఇష్టాన్ని మీకు తెలపటమైంది. కథ కూడా చెరుకురసం కాయలా బాగుంది.

  ReplyDelete
 2. హమ్మయ్య.. నాకు తోడు దొరికారు. వేసవి అనగానే మల్లెలు,మామిడిపళ్లు తప్ప వేరేవి గుర్తురావు. ఎన్నిరకాలో...

  ReplyDelete
 3. నమస్కారం. మీ బ్లాగ్ 'బ్లాగుంది' ...(బాగుంది). ఈ అంతర్జాల ప్రపంచం లో తెలుగులో దేనికోసమో వెతుకుతుంటే మీ బ్లాగ్ కనపడింది. గోదావరి ప్రస్తావన కనపడగానే నా కళ్లు అతుక్కు పోయాయి. నా చిన్న తనమంతా గోదావరీ తీరాన్నే. తూర్పు గోదావరిలో ఒక అందమైన వూరు అది. పూతరేకులూ, మామిడి తాం డ్రా అనగానే మా ఊరి పేరే చెపుతారు.
  నేను రాసే (...రాసిన) కథల్లో అందుకే గోదావరి వీలున్నప్పుడల్లా చోటు చేసుకుంటుంది. మీ బ్లాగ్ లో చాలా చదవాలి.. రోజూ కొంచెం కొంచెం..
  మీరు చదివిన భావుకతను మాతో కూడా అస్వాదింప చేస్తున్నందుకు అభినందనలు.
  శుభాకాంక్షలతో
  మూర్తి

  ReplyDelete
 4. మీలాగా మామిడి పళ్ళు ఇష్టపడే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పండి మీ వాళ్లకి.. జైహో మామిడి పండు..

  ReplyDelete
 5. పరిమళం ..గారూ
  మీ మామిదిపండ్ల ,భాగవతం
  చదివితె...బాల్యస్మ్రుతులు ..మామిడి
  టెంక ను పదెయలంటె ఎంతొ బాద పడి
  ప్రతిది పాతిపెట్టి ,ఉదయమె లెచి
  మొక్కమొలిచిందా ..అని అత్రుత ..{కాయలు
  కాస్తె}బావుందు అనె కొరిక ..అలా రొజూ చుస్తూ ,,అద్రుస్టం బావుండి మొలిచిందా
  ఇక సంతొషం ..అలా ఎన్నొ మొలిపించా ...ఒక్కతి కాయలా ..మామిదిపంద్ల ..పరిమళాలు
  బావున్నవి ...

  ReplyDelete
 6. నూజివీడు చిన్నరసం మామిడిపండు జిందాబాద్!

  ReplyDelete
 7. ఇప్పుడే తినేయలన్నంత ఇదిగా వుందా పోస్ట్ ......నాది ఇక్కడ మీ జాతే ,మా జిల్లా మామిడి పళ్ళు తింటే ఎక్కడివి నచ్చవు....నుజివీడువి మరీను .

  ReplyDelete
 8. నాకూ(మాకు ) మామిడి పళ్ళంటే చాలా ఇస్టం .వాస్తవానికి అన్ని ఫ్రూట్స్ అంట్ట్ ఇస్టం .నెల వారి బడ్జట్ లో ఫ్రూట్స్ కు కొటా ఎక్కువ గా ఉంటుంది.

  ReplyDelete
 9. పరిమళగారు..మీతో పాటు ఇంత మంది మామిడిపండ్ల ప్రియుల మధ్య నాకేమి మిగులుతుంది చెప్పండి!!! టెంక తప్ప.....

  ReplyDelete
 10. ఎంత ఎండలున్నా మాకు మాత్రం వేసవి వస్తూందంటే ఆమితానందం ఎందుకో తెలుసుకదా మామిడిపళ్ళే. మాతాడిపత్రి పెన్నా నదీతీరతోటల్లో పండే బంగినపల్లి మామిడి ముందు స్వర్గం బలాదూర్.

  ReplyDelete
 11. మామిడికాయ కు ఇంత కథ దానికి ఇంతా ఫేన్ ఫాలోయింగ్ వుందని తెలియలేదే చెప్మా...

  ReplyDelete
 12. బాగుంది మీ కల్పనా చాతుర్యం ..ఆం అని తినేస్తారు వెంటనే ఆమ్ ని చూడగానే

  ReplyDelete
 13. టెంక కూడా వదలం..:)

  ReplyDelete
 14. విచిత్రంగా మీ టపా చదవటం మొదలుపెట్టగానే మా అమ్మ గారు కొన్ని మామిడి పండ్లు కోసి తీసుకువచ్చారు వెంటనే అమ్మ కు మీ టపాను చూపిస్తూ ఇద్దరం కలిసి తిన్నాము మీ పరిమళంతో దీని రుచి ఇంకా అమోగంగా ఉంది .

  ReplyDelete
 15. మామిడి అభిమానులారా.... పురజనులారా.. మీ అందరి కోరిక పై జ్యోతి గారి బ్లాగ్లోకం లో మామిడికాయ పానకం తయారు చేసే విధం/ విధానం ప్రకటించబడినది, నేడే చూడండి మీ ఇంట్లో చేసుకోండి.. మామిడికాయల కాలం పూర్తవక ముందే చేసుకోండి... ఆనందించండి.. (జ్యోతి గారికి 4 గ్లాసు లు పంపిస్తే గురు దక్షిణ కూడా ఇచ్చినట్లు వుంటుంది )

  ReplyDelete
 16. లింక్ ఇదిగో
  http://shadruchulu.com/telugu/?cat=3

  ReplyDelete
 17. పరిమళం, నాన్న కోరి మరీ పంపారు చిన్నరసాలు. మాఊరు రసాలకుమ్ ప్రసిద్దిలెండి.

  ReplyDelete
 18. హ హ హా... కధ బాగుందండి.
  మామిడి పళ్ల యుద్ధాలు జరుగుతుండేవి మా ఇంట్లో చిన్నప్పుడు. :)

  ReplyDelete
 19. maamidi pamdu amte ishtapadani vaarumtaara? mee kadhato daani ruchiki marimta sobagunadaaru. cool drinks company vaallaku Ad storygaa baagununtundanukuntaa.

  ReplyDelete
 20. అందుకేనేమో పళ్ళలో రారాజు గా "మామిడి "విరాజిల్లుతుంది.

  ReplyDelete
 21. స్పందించి ప్రోత్సహించిన మిత్రులందరికీ పేరు పేరునా హృదయ పూర్వక ధన్యవాదములు .అలాగే నా బ్లాగుకు కొత్తగా విచ్చేసి తమ కామెంట్స్ తో కొత్త పరిమళాలద్దిన వారికి స్వాగతం !

  ReplyDelete
 22. గోదావరిలో పుట్టిన మీలాగా కాకున్నా రాయలసీమలో పుట్టిన మేం కూడా మీకులాగే మామిడిపళ్లు, వాటికి తోడు చెరుకు గడలు, బెల్లం పానకాలు ఇలా.. తీపి ఏది దొరికితే అది తిని, తాగి చివరకు డయాబెటిక్ పరంపరలోకి వచ్చేశాం. ఇప్పుడు మా డాక్టర్ కొన్ని నిషేధాలు పెట్టేశాడు. ప్రపంచంలో ఇవి లేవు అనుకో అని. అవి ఏమంటే మొదట మామిడి పండు, తర్వాత పనసపండు, అరటిపండు, సీతాఫలం, తర్వాత చక్కెర కలిపిన టీ, పాలు, కాపీ, ఇంకా స్వీట్లు, ఐస్ క్రీమూ.. వగైరా వగైరా..

  నా మాటిని మీకు కూడా షుగర్ లాంటిదేమన్నా ఇప్పటికే దూరేసిందేమో కాస్త టెస్టు చేయించుకోండి. మొన్న టీనగర్‌లో ఏదో పని మీద పోతూ 75 ఏళ్లు నిండిన ఓ ముసలావిడ నట్టెండలో రోడ్డుమీద నిల్చుని ఐస్ క్రీమ్ చప్పరిస్తుంటే లాలాజలం ఒక ఊరిపోయింది చూశారూ.. నాకు సంబంధించి ఇలాంటివి ప్రపంచంలో లేవనుకోవాలట. '50 ఏళ్లలోపే ఇష్టమైనవి కూడా తినలేకపోతున్నామే' అని మా మిత్రుడు గంగాధర్ గారితో అంటే.. అదీ ఒక బతుకేనా.. అని రాగం ఎత్తుకున్నాడు.

  'ఇక మహా అంటే ఓ అయిదేళ్లో, లేదా పదేళ్లో పనిచేస్తాం, తర్వాత చావు ఎలాగూ తప్పదు. ఈ మాత్రం దానికి మామిడి పళ్లూ, అరటి పళ్లూ, పనసపళ్లూ కూడా తినలేని బతుకు ఓ బతుకేనా' అని ధిక్కరించాడు. ఇలాంటి ధిక్కారాలు చాలానే చూశాం మేం కూడా అనుకున్నా లోపల. పైకి మాత్రం మీకూ షుగర్ రాకపోతుందా.. అప్పుడు చూస్తా మీ కథ అన్నాను.

  ఇంతకూ మీమాటా, మీ వంటి మామిడి పళ్ల లవర్ల మాటేమిటి? మీకు ఇంకా షుగర్ రాలేదా.. జాగ్రత్త.. వస్తుంది.. తప్పక వస్తుంది.

  ReplyDelete
 23. మామిడిపండు తినడం నాకు నిషేధం కావచ్చు. ఏం ఫర్వాలేదు. కాకపోతే.. మీరు పోస్ట్ చేసిన మామిడి పళ్లు చెట్లకు పండిన పళ్లు మాత్రం కావు. ఎక్కడ పట్టారు వాటిని?

  ReplyDelete
 24. చందమామ గారూ ! నాకు ఇంకా షుగర్ రాలేదండీ ...కానీ మీరన్నట్టు తప్పక వస్తుంది .మావిడి పళ్ళూ ...ఐస్ క్రీములూ ...డైటింగ్ సంగతి కూడా పట్టించుకోకుండా లాగించేస్తుంటే ...రాదూ మరి :) :)
  ఆ మావిడిపళ్ళు గూగులమ్మ నుండి తీసుకున్నవే నండీ .

  ReplyDelete