Monday, June 22, 2009
సూర్య చంద్రులమా ? మనం !
నేస్తం !
నీకూ నాకూ మధ్య ఏమంత దూరం ?
మనిద్దరి నివాసమూ ఒకటే .......
ఐనా ..మనమెప్పుడూ కలుసుకోలేం
నువ్వున్నప్పుడు నేను రాలేను
నేనున్నప్పుడు నువ్వు రావు ...
ఐతే ..నువ్వేమో స్వయం ప్రకాశివి
నేను మాత్రం నీ జ్ఞాపకాల కాంతిని
నాలో ఇముడ్చుకొని వెలుగుతున్నా !
ఏ యుగాంతానికైనా నీ ఆలింగనం
దొరక్కపోతుందా అని యుగాలుగా
ఎదురు చూస్తూనే ఉన్నా !
ఇంతకూ ......మనం ...
సూర్య చంద్రులమా ?
Subscribe to:
Post Comments (Atom)
మంచి కవిత, కవితకు తగ్గ చిత్రం beautiful...
ReplyDeleteనేను మాత్రం నీ జ్ఞాపకాల కాంతిని.....చాల బాగుంది.
ReplyDeleteపరిమళం,
ReplyDeleteసూర్యచంద్రులైతే పర్వాలేదు, కనీసం సంవత్సరానికి రెండు సార్లైనా కలుసుకోవచ్చు. కాని ఉత్తర దక్షిణాలైతెనే యుగాంతానికి కలిసేది(మీరన్నట్లు). నేస్తం పరిమళాన్ని ఆశ్వాదించకుండా ఉండగలరా?
పరిమళం గారూ,
ReplyDeleteచాలా సరళమైన పదాల్లో ఎంతో గొప్ప భావాన్ని నింపి చెప్పారు.
చాలా చాలా బాగుంది మనసుని సూటిగా తాకేలా :)
బావుంది..బాగా రాసారు
ReplyDeletechala bagundi.
ReplyDeletemukyam gaa nee ghanpakala kantini really super.
photo kudaa bagaa kudirindi.
photo superb!! down load kadaa?
ReplyDelete"ఐతే ..నువ్వేమో స్వయం ప్రకాశివి
ReplyDeleteనేను మాత్రం నీ జ్ఞాపకాల కాంతిని" - This is excellent piece.
read these two also
http://pradeepblog.miriyala.in/2009/06/blog-post_19.html
http://pradeepblog.miriyala.in/2009/05/blog-post_08.html
చెప్పాల్సిన మాటలు పైన అందరూ కలిపి వ్రాసేసారే, ఏం చేయనూ? భావం,భాష అన్ని బాగున్నాయి. బహు చక్కని దృశ్యమాలిక కళ్ళకి ద్యోతకమైంది.
ReplyDeleteబాగుందండీ మీ బ్లాగు..ప్రొఫైల్ లో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకున్న విధం కూడా బాగుంది..
ReplyDeleteనేను మాత్రం నీ జ్ఞాపకాల కాంతిని
ReplyDeleteఎంత బాగా రాసారో
చాలా బాగుంది పరిమళం గారు..
ReplyDeleteనిన్ను కలవలేక... రగిలే ఆక్రోశాన్ని
అవగాహనతో.. చల్లని వెన్నలా చేస్తావు..
చీకటి కౌగిట్లో చేర్చి చల్ల బరుస్తావు..
సంధ్య రంగోలీల్లో.. .ఆటలాడిస్తావు..
మాటల గారడీలు చేస్తావు..
నిలవని మరుపు కూరుస్తావు...
నిజమే.. మన ఆలింగనాలే.. యుగాంతాలు.
వంతులేసుకుని ఎదురు చూస్తున్నాము..
ఇంతకూ మనం సూర్య చంద్రులమేనా ..?
కాక పోతే బావుణ్ణు.. ఎప్పటికైనా.. కలవొచ్చు.
చాలా బాగుంది. కానీ, సూర్య చంద్రులు కాకూడదనే అనిపిస్తోంది నాకు. ఎందుచేతనంటే వాళ్ళు కలవాలనుకున్నప్పుడు గ్రహణం ఏర్పడుతుంది. నదీ కడలిల సంగమం కావాలని కోరుకుంటున్నా. ఇలా చనువు తీసుకున్నందుకు ముందుగానే క్షమాపణలు.
ReplyDelete@ విజయమోహన్ గారూ ! ధన్యవాదాలు .
ReplyDelete@ డేవిడ్ గారు , నచ్చినందుకు థాంక్సండీ !
@ శ్రుతీ ! విరహంలో క్షణమొక యుగమే కదండీ ...థాంక్స్ !
@ మధురవాణి గారు , మీ మధుర స్పందనతో ఉత్సాహం నింపినందుకు ధన్యవాదాలు .
@ హరేకృష్ణ గారు , థాంక్స్ !
@ సుభద్ర గారు , మీ స్పందనకు ధన్యవాదాలండీ .
@ మందాకినీ గారు , ఫోటో గూగుల్ లోనుండి సేకరించినదే నండీ .
@ ప్రదీప్ గారూ ! మీ పోస్టులు చదివానండీ ...మీ అంత అందంగా రాయలేకపోయినా నన్ను మెచ్చుకోవడం మీ అభిమానం .అదే నాకు స్ఫూర్తిదాయకం !
@ ఉషాగారు , అందరూ చెప్పేసినా కదంబంలో మరువం ప్రత్యేకత మరువానిదే కదా !
@ మోహన్ రాజ్ గారూ ! సుస్వాగతం ....నా బ్లాగ్ నచ్చినందుకు ధన్యవాదాలు .
@ చిన్ని గారు , ఆ చిన్ని పదమే అందరికీ నచ్చిందండీ....
@ ఆత్రేయ గారూ ! బహుకాల దర్శనం ! అయినా మీ పలకరింపు ...పదాల చిలకరింపు ....మీ కవితతో నా బ్లాగ్ ధన్యమైనదండీ ...ధన్యవాదాలు గురువుగారూ !
@ వర్మ గారూ , క్షమాపణలెందుకండీ ...మంచి మనసుతో మీరు కోరుకున్నదే ..నా ఆకాంక్ష కూడా ! ధన్యవాదాలు .
చక్కని పోలిక...
ReplyDeleteదుర్గాష్టమి శుభాకాంక్షలు!!
ReplyDeleteవిజయ దశమి శుభాకాంక్షలు!!
దసరాలు నీవే - సరదాలు నీవే
నాకు నీవే నేస్తం- నిత్య వసంతం !
దీపావళినీవే –తారావళి నీవే
నా తిమిర హృదయాన-సత్యజ్యోతి నీవే
సంక్రాంతి నీవే- ఉగాదీ నీవే
నీవుంటె ప్రతి దినమూ- పర్వ దినమేలే
అక్షరం నీవేలే-లక్ష్యమూ నీవేలే
అందుకో ప్రియ నేస్తం-నా శుభాకాంక్షలివియేలే!!