Saturday, June 27, 2009
పిట్ట కధలు -2 (యయాతి చెప్పిన నీతి )
యయాతి పుణ్య ఫలంగా అతనికి సిద్ధలోక ప్రాప్తి కలుగుతుంది .ఐతే కొన్నాళ్ళకు తన తపస్సును ప్రశంసించుకొని , ఇతరుల తపస్సును చులకనగా చూడటం వల్ల అతని పుణ్యం క్షీణించి యయాతి సిద్ధలోకం నుండి క్రిందకు పడిపోసాగాడు. ఇది చూసిన తోటి రాజులలో ఒకడైన అష్టకుడనే రాజు యయాతితో ...రాజా ! మీరు పడిపోకుండా ఇక్కడే ఉండేలాగ నా పుణ్యాన్ని మీకు ధారపోస్తాను అన్నాడు . అప్పటికే తన తప్పు తెలుసుకున్న యయాతి ఓ రాజా ! దానం అనేది కేవలం వేదవిదులైన బ్రాహ్మణులు , అశక్తులైన దీనులు మాత్రమే స్వీకరించాలి నేను ఆరెండూ కాదు కాబట్టి నీ దానాన్ని స్వీకరించే అర్హత లేదు కాబట్టి తనని క్రింద పడనీయమన్నాడు .
అక్కడే ఉన్న మరికొంతమంది రాజులను కూడా యయాతి తిరస్కరించాడు .అది చూసిన వశుమానుడనే మహారాజు ముందుకు వచ్చి యయాతి మహారాజా ! మీవంటి పుణ్యాత్ములు ఈలోకంలోనే ఉండాలి మీరు దానం స్వీకరించనన్నారు కనుక మీరు నాకు గుప్పెడు గడ్డిని ఇవ్వండి బదులుగా నా పుణ్యఫలం మొత్తం మీకిచ్చేస్తాను .మూల్యం చెల్లించారు కాబట్టి ఇది దానం కాదు అన్నాడు .
అప్పుడు యయాతి చిరునవ్వుతో తగిన వెల చెల్లించకుండా ఏ వస్తువును స్వీకరించినా అది కూడా దానం క్రిందకే వస్తుంది కాబట్టి వృధా ప్రయాస పడకండి . నా కర్మఫలాన్ని నన్నే అనుభవించనీయండి .....విధాత నిర్ణయించిన దానికి తలవంచుటయే నా ధర్మం అంటూ అందరికీ వినమ్రతతో చేతులు జోడించాడు .
** సాధారణంగా పల్లెల్లో కొబ్బరికాయలు , అరటిపళ్ళు , ఇంకా ప్రత్తి ...మొదలైనవి ఇళ్ళల్లో చెట్లు ఉంటాయి .దాంతో ఇరుగుపొరుగు వారికీ , బంధువులకూ ...దేవుడికైతే ఒక రూపాయిచ్చి తీసుకెళ్ళమని అనటం అలవాటుగా ఉంటుంది . అది తప్పని చెప్పటం హరిదాసుగారి ఆంతర్యం .
Subscribe to:
Post Comments (Atom)
ఏదీ ఉచితంగా ఆశించకూడదు..
ReplyDeleteధర్మాన్ని.. మీరకూడదు.. యాచించకూడదు...
చక్కని కదా.. ధన్యవాదాలు..
మిత్రమా మీ పరిమళం బాగా గుబాలిస్తోంది. మంచి ప్రయత్నం. నా బ్లాగ్ పోస్ట్ పై కామెంట్ రాసినందుకు ధన్యవాదాలు .
ReplyDeleteచక్కని కధలు చెపుతున్నారు :)
ReplyDeleteఅవును నిజమే. తగిన మూల్యం ఇవ్వకుండా తీసుకెళ్ళినా అదీ దానం కిందే వస్తుందని బాగా చెప్పారు.
ReplyDeleteబాగుందండి..
ReplyDeleteపరిమళం గారూ,
ReplyDeleteఎంత చక్కగా చెప్పారు. నిజమే కదా? దేవుడైతే మాత్రం, ఆయకేమన్నా డబ్బులకు కొదువా, తక్కువ ధరకివ్వడానికి. పాపం దేవుడి పేరు చెప్పి తక్కువకు బేరమాడే వాళ్ళను తరచూ చూస్తుంటాను. ఎదో ఒక రూపాయి వస్తుందనే కదా వాళ్ళు కుడా అమ్ముకునేది. నా ఓటు కూడా మీకే.
నా కధకు స్పందన తెలిపిన మిత్రులందరకూ ధన్యవాదములు!
ReplyDeleteచాలా బావుంది కథ. మంచి సేఖరణ. ఇంత చిన్న దానిలో భలే నీతి చెప్పారు.
ReplyDelete** సాధారణంగా పల్లెల్లో కొబ్బరికాయలు , అరటిపళ్ళు , ఇంకా ప్రత్తి ...మొదలైనవి ఇళ్ళల్లో చెట్లు ఉంటాయి .దాంతో ఇరుగుపొరుగు వారికీ , బంధువులకూ ...దేవుడికైతే ఒక రూపాయిచ్చి తీసుకెళ్ళమని అనటం అలవాటుగా ఉంటుంది . అది తప్పని చెప్పటం హరిదాసుగారి ఆంతర్యం
అసలా అలా తీసుకోవడమే తప్పా లేక తగిన మూల్యం చెల్లించక పోవడం తప్పా ??
@ వాసు గారు ! తగినమూల్యం చెల్లించాలని ..లేకపోతే ఫలితం మనకి దక్కదని హరిదాసుగారి భావన ! ధన్యవాదాలు .
ReplyDelete