Saturday, June 13, 2009

పిట్ట కధలు -1


పల్లెల్లో ఉత్సవాలప్పుడు వసంత నవరాత్రులు , గణపతి నవరాత్రులు , దేవీ నవరాత్రులు ...ఇలా ఉత్సవాలు జరిగినప్పుడు ఆలయాల్లో రాత్రివేళ ఏవైనా కార్యక్రమాలు పెట్టటం జరుగుతుంది ..వాటిలో ఓ రోజు తప్పకుండా హరికధ పెట్టిస్తారు .ఆ హరికధ చెప్పే భాగవతార్ లేదా భాగవతారిణి చెప్పే అసలు కధ కంటే కొసరుగా చెప్పే కధలే ఈ పిట్టకధలన్నమాట !

సుష్టుగా భోజనం చేసి చేరతామేమో గుడికి ...కధ మొదలైన కాస్సేపటికే కునికి పాట్లు వచ్చేస్తాయి ..అప్పుడు హరికధాగానం మధ్యలో ఘాట్టిగా హరినామస్మరణ చేయిస్తారు మన భాగవతార్ గారు. ఆ తర్వాత ప్రేక్షకులకు ఆసక్తి కలిగేలా పిట్ట కధ హాస్యాన్ని జోడించి మొదలెట్టగానే కాస్తో కూస్తో ఉన్న మత్తు వదిలిపోతుందన్న మాట !

అటువంటి పిట్టకధలను నేను విన్న కొన్నిటిని మీతో పంచుకోవాలని ఈ టపా ! ఇవి మీక్కూడా తెలిసినవే అయి ఉంటాయి ఐనా మరోసారి గుర్తుచేసుకుంటారు కదూ !

ఇప్పుడొక బుల్లి పిట్టకధ !
అనగనగా ఓ మూర్ఖుడు ...వాడు ఎన్నడూ దైవనామ స్మరణే చేసేవాడు కాదు .ఒకరోజు వాడికి చెట్టు చిటారు కొమ్మ ఎక్కి ఊరు చూడాలనే బుద్ధి పుట్టింది .వెంటనే ఊరిచివర ఉన్న ఓ పెద్ద చెట్టు చివరికంటా ఎక్కేశాడు ...కానీ కొమ్మ బలహీనంగా ఉండటం వల్ల విరిగి పడిపోతూ కాస్త పట్టు ఉండి వేళ్ళాడుతూ ...ఓయ్ ..ఎవరైనా ఉన్నారా ...పడిపోతున్నా ...అంటూ అరవ సాగాడు.కానీ ఊరు శివారు ప్రాంతం వల్ల ఎవ్వరూ పలకలేదు .

పార్వతీ పరమేశ్వరులు భూలోకాన్ని వీక్షిస్తూ ఉండగా ఈ దృశ్యం వారి కళ్ళబడింది .పార్వతీ దేవికి జాలి కలిగి ఎంతైనా తల్లి మనసు కదా ...పరమేశ్వరుడ్ని స్వామీ అతడ్ని కాపాడండి అని అడిగింది .అప్పుడు స్వామి ..దేవీ ..ఇతడు మూర్ఖుడు ..పుట్టి బుద్ధెరిగాక దేవుడ్ని ఒక్కసారి కూడా తలచలేదు ...ఎవ్వరికీ సాయపడిందీ లేదు ఐనా నువ్వు అడిగావు కాబట్టి ఒక పని చేద్దాం ...పడేటప్పుడు అమ్మా అని పిలిచాడనుకో ...నువ్వు కాపాడు ...అయ్యా అంటూ పడితే నేను కాపాడతాను అన్నాడు చిరునవ్వుతో ....ఎవరైనా రెండిట్లో ఏదోకటి అంటారు కదాని సరే అంది అమ్మవారు .

ఈలోగా కొమ్మ విరిగి పడిపోసాగాడా మూర్ఖుడు .పడిపోతూ బాబోయ్ .....అంటూ అరిచాడు . శివ పార్వతులు మూర్ఖుడ్ని మనం కూడా బాగు చేయలేం అనుకుంటూ నిష్క్రమించారు .

20 comments:

  1. భలే..భలే! మరి 2 కధ కోసం....waiting!!!

    ReplyDelete
  2. ha ha ha..super
    mee style lo bagaa rasaaru baboi :)

    ReplyDelete
  3. ఈ కధ మా తాతయ్య చెప్పారు చిన్నపుడు..మంచు కధను గుర్తు చెసినందుకు థేంక్స్ అండి

    ReplyDelete
  4. బాల్యానికి సంబంధించి మన ఇద్దరి అభిరుచులూ కొంచం దగ్గరగా ఉన్నాయండి.. హరికథ ఆంటే నేనూ మిస్సయ్యేవాడిని కాదు.. భాగవతార్ల భోజనం మా ఇంట్లోనే ఉండేది.. దానితో వాళ్ళు వచ్చింది మొదలు, వెళ్ళే వరకు వీ.ఐ.పీ. వెనుక ఎస్కార్ట్ లా తిరిగేవాడిని.. బాగుందండి కథ.. మిగిలిన టపాల కోసం ఎదురు చూస్తున్నా.. మొత్తానికి కావ్యాస్ డైరీ షాక్ నుంచి త్వరలోనే కోలుకున్నారు :-)

    ReplyDelete
  5. baagundandi mee katha.
    meerilaage chakkati kathalu cheppandi.

    ReplyDelete
  6. పిట్ట కథ నాకు బాగా నచ్చింది.. పోస్ట్ కూడా బాగుంది..

    ReplyDelete
  7. మొత్తానికి ప్రతి పోస్ట్‌కూ వైవిధ్యత జోడించి మరీ రాస్తున్నారు. పిట్టకథ పోస్ట్ చాలా బాగుంది. రెండో కథ కోసం ఎదురుచూస్తూ...

    ReplyDelete
  8. కథ,పోస్ట్ కూడా బాగుంది... :-)
    కనీసం నాలుగు options కాకుండా మరీను రెండేనా?

    ReplyDelete
  9. హ.. హ.. హా..
    పిట్ట కధలైనా మహా గట్టి కధలు సుమండీ... :)

    ReplyDelete
  10. బాగుందండి పిట్ట కథ.. నాకు కూడా హరి కథ లంటే బలే ఇష్టం... మా ఇంటి దగ్గర రాములవారి గుళ్ళో శ్రీరామ నవమి కి, పక్కనే హనుమంతుల వారి గుళ్ళో హనుమత్జయంతి కి తప్పకుండా హరి కథ లు చెప్పేవారు... ఎంత లయబ్ధం గా వుంటుందో.. నాకు రుక్మిణీ కల్యాణం పర్సనల్ ఫేవరేట్.. చిన్నప్పుడు ఏడిపించేవారు కూడా మాఇంట్లో అబ్బ ఏదైనా అడిగితే హరి కథ లు చెప్పటం లో ముందు వుంటుంది... దీనిని ఆ హరి కథ లకు పంపటం మానెయ్యాలి అని.. :-) భక్తులందరు నిద్రావస్త లో వున్నట్లు వున్నారు మరొక్క సారి పరిమళానికి జై... రెండో పిట్టకథ.... రావాలి ...

    ReplyDelete
  11. హరికధలు ఒకటో రెండో ప్రత్యక్ష్యంగా చూసాను. "చేరి మూర్ఖుల మనసు రంజింప" అన్న తీరుగా వుందీ కథ. కానీండి మాకు మచి హరికధా కాలక్షేపం.

    ReplyDelete
  12. బాగుందండి పిట్ట కథ

    ReplyDelete
  13. బాగుంది మీ కధ, చాలా బాగా విశ్లేషించారు.

    ReplyDelete
  14. నన్ను అభిమానించి ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ ధన్యవాదాలు .త్వరలోనే మరో పిట్టకధ చెప్పుకుందాం ...

    ReplyDelete
  15. దైవనామస్మరణ చేయనివారంతా ఆ హరిదాసు దృష్టిలో, మీ వంటి వారి దృష్టిలో మూర్కులే నన్నమాట. ఈ రోజుల్లో కూడా ఇదేం లాజిక్కు.... మరి నూటికి 99 శాతం మంది దొంగ భక్తులే కదా ప్రపంచంలో. అవసరం తన్నుకొస్తే దైవభక్తి తన్నుకొచ్చే ఇలాంటి బాపతు మనుషులను ఏమనాలి మనం?

    ReplyDelete
  16. చందమామ గారూ ! దైవనామ స్మరణ చేయని వారందరూ మూర్ఖులని అనటం లేదండీ ...సాధారణంగా హరిదాసులు ఆస్తికత్వాన్ని ప్రబోధిస్తూ ఉంటారుకదా ....ఆ క్రమంలో వాళ్లు చెప్పే కధలు చిన్నప్పుడు నేను విన్నవి బ్లాగ్ మిత్రులతో పంచుకోవాలనే సరదా ప్రయత్నం అంతే !బహుశా కష్టం వచ్చినప్పుడు కనీసం అమ్మను కూడా తలవని వాడు మూర్ఖుడని ఆయన ఉద్దేశ్యం అయి ఉండొచ్చు .
    నేను దైవాన్ని నమ్ముతాను ...అలాగే ప్రజలను మూఢ నమ్మకాలనుండి బైట పడేలా చేస్తున్న హేతువాద సంఘాలనూ ఇష్టపడతాను .
    ఇక దొంగ భక్తులంటారా ...అర్జీ పెట్టుకున్న వారంతా అర్హులు కాదు కదండీ ...వరాలిచ్చేవాడుంటే ఎవరి అర్హతనుబట్టి వారికిస్తాడు .

    ReplyDelete
  17. బాగుందండి, ఇలాంటి మూర్ఖులు ఇంకా చాలామందే ఉన్నారు !

    ReplyDelete
  18. ఇప్పుడే చదివానండి చందమామ గారి కి మీ రిప్లై చక్కగా అమరింది !
    ఏదో FAQ లాగా, మాకు similar doubts వస్తే కరెక్ట్ ఆన్సర్ !

    ReplyDelete
  19. శ్రీకర్ గారూ ! మీ స్పందనకు ధన్యవాదాలండీ !

    ReplyDelete