Monday, March 15, 2010

వసంత గానం....


తొందరపడి ఓ కోయిల ముందేకూసింది
అన్నాడని అపుడెపుడో ఓ కవి .........
ఇప్పుడింకా గళం విప్పని కోయిలమ్మల అలక !
మీరలిగితే మేమేం తక్కువా అని
ఆకులు రాల్చేసిన చెట్లూ .....
ఏడాదికోసారి వచ్చే అతిథులకు
చేసే మర్యాదిదేనా అంటూ ...
లేలేతగా పుట్టుకొచ్చి ఆతిథ్యమిచ్చిన చివుర్లు!
రంగుల పండుగతో అరుదెంచిన
వసంతుడు నువ్వు వసంతగీతం
ఆలపించక చైత్రరథమెక్కనన్నాడు
ఇప్పుడైనా అలకమాని .....
వగరు చివురులారగించి ..
కుహూమని....గొంతు సవరించి
ఉగాదిలక్షికి స్వాగత గీతం
పాడవమ్మా...కోయిలమ్మా ....

**ఉగాది వచ్చేసినా మా చుట్టుపక్కల కోయిలమ్మలు ఇంకా గొంతు సవరించలేదు :( కారణమేంటో మరి !
బ్లాగ్ మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు ...ఈ కొత్త సంవత్సరం మీ ఇంట అష్టలక్ష్ములు కొలువు తీరాలని కోరుకుంటూ....మీ పరిమళం

28 comments:

  1. అవునండీ...నేను కూడా ఇంత వరకూ కోయిల గొంతు వినలేదు....అయినా కోయిలమ్మ గొంతు సవరించాలంటే వేదిక(చెట్లు) కావాలికదండి...మరి మన చుట్టూ ఏవి ఆ గుబురు చెట్లు..కోయిలమ్మ కచేరికి అనువైన స్థలాలు.....

    కొత్త సంవత్సర శుభాకాంక్షలు..

    ReplyDelete
  2. నిజమేనండీ శేఖర్ గారూ! పెద్ద చెట్లూ, కోకిలలూ ఏ అందాల తీరాలకో వెళ్ళిపోయుంటాయి.
    మన మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  3. రాగాల పల్లకిలో కోయిలమ్మా
    రాలేదు ఈవేళ కోయిలమ్మా
    రాగాలే మూగబోయేనమ్మా .....గడుసు కోయిలా :-) ఉగాదులు ఉషస్సులు వద్దేమో
    @శేఖర్
    అది సరికాదు ,చుట్టూ మావిచిగుర్ల చెట్లున్నా ఈ కోయిలల జాడలు లేవు :(

    ReplyDelete
  4. కోయిల గానంతో పాటు, వేపపువ్వు కూడా సరిగ్గా విరబూయలేదు గమనించారా! మీకు ఉగాది శుభాకాంక్షలు

    ReplyDelete
  5. మీకు,మీ కుటుంబానికి వికృతినామ సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  6. పరిమళం గారూ !
    నూతన సంవత్సరంలో మీ నుంచి వసంతంలో గానం చేస్తున్నంత మంచి మంచి రచనలు రావాలని కోరుకుంటూ....
    ఉగాది శుభాకాంక్షలతో....
    - శిరాకదంబం

    ReplyDelete
  7. మీక్కూడా ఉగాది శుభాకాంక్షలు.

    ReplyDelete
  8. పరిమళ గారికి బ్లాగ్వీక్షకులకు అభిమానులకు మిత్రులకు నా వి ”కృతి” సహిత ఉగాది శుభాకాంక్షలు!!
    షడ్రుచుల ఉగాది-కో-యిల గానాల వినోది
    కోయిలా కూయవేల?
    రాయిలా మౌనమేల?
    ఉగాది రాలేదనా? రాదేలనా!
    మామిడమ్మ చివురేయలేదనా, మల్లి చెల్లి పూయలేదనా
    చింత కాయకుంటే ఎందుకంత చింత?
    మన్మధుడు చెఱకును విల్లుకై ఎత్తుకెళ్లాడనా !
    మమకారాలు కరువయ్యాయనా!
    నీ పాట జనం మరి’చేద’య్యిందనా!
    పర్యావరణముప్పు వల్ల కన్నీటి ఉప్పూ కరువయ్యిందనా!!
    ఎందుకు నేస్తం?ఈ బేలతనం
    నేనున్నాను నీకోసం
    నా షడ్రుచుల జీవితమూ ఉంది

    తలపు(/తలుపు) “తీయని” మనసుంది
    కాసింత మా’నవత’పై మమ’కార’ముంది
    నచ్చక చిటపట లాడినా తప్పని సరియగు స్నేహిత(౦)ము(ఉ)ప్పుంది
    కారణమేదైనా గాని మెచ్చేనేస్తాలను మరి”చేదు”౦ది
    నొప్పించినా స’వరించి’ ఉల్లాస తీరాలకు పరుగులు తీసి(తీయించి) వగర్చేదుంది(వగరు+చేదు)
    జీవిత మలుపు మలుపులో గెలిపించే వేలు’పులు పు’ష్కలంగా అందించే దీవెన ఉంది.
    పాడవే కోయిలా..
    పాడుకో యిలా....
    ప్రకృతికే నేస్తంలా..పాటే సమస్తంలా...

    ReplyDelete
  9. అరె..సరిగ్గా నేనూ ఇదే ఆలోచిస్తున్నాను. ఇంత వరకూ కోయిల పాట ఎందుకు వినపడలేదు.
    శేఖర్ మా ఇంటి చుట్టూ వేప చెట్లూ మామిడి చెట్లూ వున్నాయి కానీ , ఈ రోజువరకూ కోయిల గొంతు వినపడనేలేదు.

    ReplyDelete
  10. పరిమళం గారూ ఉగాది శుభాకాంక్షలు

    ReplyDelete
  11. వికృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

    ReplyDelete
  12. :-):-)
    మీకూ, మీ కుటుంబ సభ్యులకూ 'వికృతి' నామ సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  13. కొత్త సంవత్సర శుభాకాంక్షలు..

    ReplyDelete
  14. ఇవాళ పొద్దున్నే కోయిల గొంతు నాకు స్వాగతం పాడిందండీ...శుభోదయం అనుకున్నాను...బహుశా మా ఇంతి దగ్గరలో మావిడి చెట్లు ఎక్కువ ఉన్నాయెమో....మీ ఇంటి దగ్గరలో తక్కువగా ఉండి ఉంటాయి.అందుకే మీకూ కోయిల గానం వినబడి ఉండదు..:)

    "మావి చిగురు తినగానే...కోయిల పలికేనా.." అని పాట ఉండి కదా అందుకే ఇలా...:)

    ReplyDelete
  15. పరిమళం గారు హైదరాబాద్ లో
    కోయిల గొంతు విందామన్న మీ ఆశ వాహ దృక్పదం
    అభినందనీయం .కోయిలలు నగరాల్లో తొందర పడి కుడా
    కూయడం మానేసి చాలా కాలం అయ్యింది,ప్రస్తుతానికి
    మా మేడెక్కి నేను కూ కూ అని కూస్తే మీరు మీ ఇంటి దగ్గరనుంచి
    కోయిల కూసిన్దనుకుని భావించుకుని మీరు కూ కూ అని ఆనందించడమే
    ఏంటో యి వికృత నామ సంవత్సరపు తోలి ఆలోచనలు

    ReplyDelete
  16. పరిమళం గారు ,
    బాగా రాసారు .
    ఉగాది శుభాకాంక్షలు .
    మీకు ఒక రోజు ఆలశ్యంగా చెబుతున్నాను ఏమను కోకండి .

    ReplyDelete
  17. కొంచం లేట్ గా నూతన సవత్సర శుభాకాంక్షలు. బాగుంది కోకిలమ్మ కు కొత్త రాగానికి స్వాగతం.

    ReplyDelete
  18. మీకు,మీ కుటుంబానికి వికృతినామ సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  19. పరిమళగారు, మాఊరికోయిలలు ఎప్పటినుండో కూస్తున్నాయండి. ఒక్క సారి నాబ్లాగ్ చూడండి , మాఊరి కొయిలమ్మ పాటవినండి.విని ఆనందించండి.

    ReplyDelete
  20. బావుంది. మీకు కూడా శుభాకాంక్షలు కొంచెం లేటుగా

    ReplyDelete
  21. అవునండీ.. నేను కూడా కోయిల గొంతు వినలేదు.. పేద్ద మావిడి చెట్టుకింద (ఇంట్లో) ఉంటూ కూడా..
    మీకు, మీ కుటుంబ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు.

    ReplyDelete
  22. పరిమళగారు,మీకు లేటుగా ఐనా లేటెస్టుగా ఉగాది శుభాకాంక్షలు.నేను రాసిన ఓ చిన్నతవిక చూడండి.కోకిలమ్మ పాటకూడా

    ReplyDelete
  23. పరిమళ గారు ..కొంచెం లేటుగా ఉగాది శుభాకాంక్షలు .
    హైదరాబాద్ లో కూడా కోయిలపాట నిన్ననే విన్నామండి .
    కాంక్రీట్ జంగిల్లో..మనుషుల స్వభావాలు మారినా..కోయిల పాట మారలేదు ..మాన లేదు!!

    ReplyDelete
  24. నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  25. Parimalam garu aa madya meeru na blog loni kavita ku comment rasaru chala happy ga feel ayyanu...meeku na danyavadalu...meeru appudappu na blog ni chudalani chinna vinnapam

    ReplyDelete
  26. mee blaagu chuusi chala santhosham iyindandi....mee vuuhalaki yento muchatesindi..asirwadaalato.....
    oka baamma

    ReplyDelete
  27. ఏమిటండీ వసంతగానంతో ఆపేశారు. ఏదీ కొత్త పోష్టు? నెలకో 2 పోష్టులైనా రాయాలి మీరు. త్వరగా వస్తారని ఆశిస్తున్నాను.

    ReplyDelete