Monday, March 8, 2010

మరో జన్మ ఉంటే ...


ఆడపిల్లగా పుట్టటం కంటే అడవిలో మానై పుట్టటం మేలని సామెత ! బహుశా పుట్టిన దగ్గర్నుంచీ ఆడపిల్ల ఎదుర్కొనే వివక్ష , వేధింపులు , బాధ్యతలు , స్వేచ్చా స్వాతంత్ర్యాలకు నోచుకోకపోవడం ,శారీరకంగా , మానసికంగా మగవారికంటే సున్నితంగా ఉండటం ఆర్ధికంగా , సామాజికంగా ఎప్పుడూ ఎవరో ఒకరిమీద ఆధారపడాల్సి రావడం .అంటే బాల్యంలో తండ్రి , ఆతర్వాత భర్త , వృద్ధాప్యం లో కొడుకుఇలాగన్నమాట ! వీటన్నిటినీ మూలంగా చేసుకొని ఈ సామెత పుట్టి ఉండొచ్చు...కాని ఇప్పుడు చాలా వరకు సామాజిక పరిస్థితులు మారాయి లింగ వివక్ష చూడకుండా పిల్లల్ని చదివిస్తున్నారు తద్వారా ఆర్ధిక స్వాతంత్ర్యం ఉంటుంది అలాగే పెళ్ళిళ్ళ విషయంలో కానీ కెరీర్ విషయంలో కానీ భావవ్యక్తీకరణ స్వాతంత్ర్యం కూడా నేటి మహిళలకు ఉంది ముందు తరంలోలా అనవసరఆంక్షలు స్త్రీలపై చాలావరకూ తగ్గాయనే చెప్పుకోవాలి . అలా అన్ని చోట్లా ఇలాగే ఉందని చెప్పటం లేదు ...అసమానతలూ , అత్యాచారాలు ,ఆంక్షలూ,అవహేళనలూ అన్నీ ఇప్పుడూ ఉన్నాయి కాని మునుపటికంటే స్త్రీ జీవితం బావుంది ఆమె ఔన్నత్యానికి తగిన గుర్తింపు వస్తుంది .

స్త్రీ ....ఆమెకు భగవంతుడు కూడా పురుషపక్షపాతి కాబట్టి కష్టాలన్నీ ఆమెకే పెట్టాడు...అంటారు కాని ఇక్కడ ఒక అద్భుతమైన వరం స్త్రీకి మాత్రమే ఇచ్చాడు అది మరో ప్రాణికి జన్మనివ్వడం. అది వరమేలా అవుతుంది ప్రతి ప్రసవానికీ ప్రాణగండమే కదా ...అంటే మా అమ్మమ్మగారు చెప్పేవారు స్త్రీకి మాత్రమే కష్టాలు కాదు స్త్రీకి పురుడు పురుడుకి గండమైతే ....మగవాడికి దినదిన గండం అని ....అంటే కుటుంబ పోషణార్ధం బయటకు వెళ్ళిన పురుషుడికి పొలానికి వెళ్తే పాము పుట్రలతో ...ఇప్పటి రోజులైతే రోడ్డుమీదకు వెళ్తే ...ఇలా ప్రతి దినమూ గండమే కదా !

ఐతే అంతా సాధించేశామని పొంగిపోనక్కర్లేదు ...ఇంకా ఎన్నో ప్రాంతాలలోనూ ..కుటుంబాలలోనూ ఆడపిల్ల అంటే మైనస్ అనే భావనతోనే ఉంటున్నారు పనిచేసేచోట ...అది రోజు కూలీదగ్గర్నుంచి ..టెక్నికల్ కూలీ వరకు ( ఈ పదాన్ని మన బ్లాగు మిత్రులెవరో ఉపయోగించారు) వివక్షకు గురవుతూనే ఉన్నారు అయినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్న సోదరీ మణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు .

ఇటువంటి రోజు మనకు ఏడాదికొకసారి కావాలా అంటే ...కావాలి మనల్ని గుర్తించడానికి ,మనకోసం కూడా ఒకరోజు కావాలి ...ప్రతిరోజూ పూజిస్తున్నా కొన్నిరోజులు దుర్గాదేవికి , లక్ష్మీ దేవికి ...ఇలా దేవుళ్ళకి ప్రత్యేక పూజలు ఎలాగో ప్రకృతికి ప్రతిరూపమైన స్త్రీకి ఓ ప్రత్యేకమైన పండుగరోజు ఉండొద్దా....ఎంతటి మగధీరుడైనా....చివరికి భగవంతుడైనా అమ్మకడుపున పుట్టాల్సిందే వారు మహిళగా మనం నిర్వర్తించే బాధ్యతకు కృతజ్ఞతగా హేపీ ఉమన్స్ డే అంటూ శుభాకాంక్షలు చెబుతుంటే స్త్రీగా పుట్టినందుకు ...ఈ సమస్త సృష్టిలోనూ భాగస్వామిగా ఉన్నందుకు..గర్విస్తూ ఆ శుభాకాంక్షలందుకుందాం.

మరుజన్మ అనేది ఉంటే నేను ఆడపిల్లగానే పుట్టాలని కోరుకుంటా ...ఐతే నా బాల్యం నుండీ నా జీవితాన్ని తరచి చూసుకుంటే నాకు ఒక జన్మచాలదనిపిస్తుంది ..చాలా జన్మలు కావాలని పిస్తుంది అవేంటో తర్వాతి టపాలో రాస్తాను :)

మహిళా !
హద్దులేని ఔన్నత్యానివి నువ్వు
భూమిని పోలిన సహనానివి నువ్వు
దుర్మార్గాన్ని దునిమే ఖడ్గం నువ్వు
సమస్త సృష్టిలోనూ సగభాగం నువ్వు !!

15 comments:

  1. స్త్రీ సృష్టిలో సగభాగమే కానీ...... మిగతా సగం పురుషుడేగదా! స్త్రీకి గుర్తింపు కావాలనే రోజులు పోయి, మగవాడిని కూడా కాస్త గుర్తించండి, అని అభ్హ్యర్ధించే రోజులొచ్చేశాయి. స్త్రీలకు ఈ రోజునుంచీ చట్టసభలలోకూడా కోటా వచ్చేసింది . స్త్రీలకొకరోజు సరే! పాపం పురుషులకు ఆ ఒకరోజు కూడా లేదే!

    గొడ్డులా చాకిరీ చేసి, పెళ్ళాం
    బిడ్డలను పెంచుతున్నపురుషులనుయీ
    గుడ్డిలోకం గుర్తించేదెన్నడు?

    Any how మీకు మహిళాదిన శుభాకాంక్షలు!

    ReplyDelete
  2. @ జయచంద్రగారు , చాలా కాలం వివక్షనేదుర్కొని పోరాడి సాధించుకున్నాం ...మరి ఇక నుండి మీరూ మొదలు పెట్టండి మరి :)
    మీరు నా టపా పూర్తిగా చదివారో లేదో ...పురుషులు ప్రతిదినమూ కష్టపడుతున్నారనే రాశాను . మేము భాగస్వామ్యం అడుగుతున్నాం కాని మొత్తం కాదండీ ...ఎంత కష్టపడినా చిన్న మెచ్చుకోలుతో అన్నీ మర్చిపోతాం ...మామీద కినుకేంటండీ :) మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు.

    ReplyDelete
  3. బాగు౦ది సరిగ్గా సమాన౦గా తూచారు......
    ముగి౦పు బాగు౦ది...కొనసాగి౦పుకోస౦ ఎదురుచుస్తూ....

    ReplyDelete
  4. ముందు బొమ్మ, ఆఖరి పద్యం అదుర్స్
    psmlakshmi

    ReplyDelete
  5. ఈ జన్మ లాంటివి ఇంకా చాలా కావాలనుకుంటున్నారు , అదృష్టవంతులు .
    నెక్స్ట్ జన్మlo నన్ను ఏడిపించాలి కదా , వాకే , డన్ .

    ReplyDelete
  6. పురుషుడు చేసే గొడ్డు చాకిరి నాదీ, నేను అన్న అహాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం లోనిదే.భగవంతుడి పేర స్రుష్టించబడిన భావజాలమే వేల సంవత్సరాలుగా మహిళా స్వాతంత్ర్యాన్ని హరిస్తున్నాయి.ప్రస్తుత అసమ సమాజంలో రిజర్వేషన్లవంటి రాయితీలు,మహిళల తిరుగుబాటును వాయిదా వేశే ప్రయత్నమే.వాదాలు మూడు వాక్యాల రాతలతో తెగే విషయాలు కావు.
    _సుబ్బారెడ్డి

    ReplyDelete
  7. పరిమళ గారు మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎవ్వరు ఎన్ని అన్నా స్త్రీ ఔన్నత్యం ఎప్పటికీ వెలకట్టలేనిదే. Yes God is great Creator and woman is a mini creator.

    ReplyDelete
  8. పరిమళగారూ,
    చాలా బాగా విశ్లేషించారు. మీరు ముందు వ్రాయబోయే టపాల కోసం ఆతృతగా ఎదురుచూస్తుంటాం..

    ReplyDelete
  9. బొమ్మ ఎంత చక్కగా ఎంచుకున్నారండీ! It speaks a lot!
    ముక్తాయింపు మీ శైలిలో ముచ్చటగా ఉంది. ఇందాకే చిన్నపాటి కోరికల జాబితా ఒకటి పెట్టాను నేను నా బ్లాగులో. మీ లిస్టు కూడా చూడాలనుంది. తొందరగా పోస్టెయ్యండి మరి!

    ReplyDelete
  10. మీ టపా బాగుంది. మళ్ళీ స్త్రీ లాగే పుట్టాలనుకొంటున్నారు. నిజంగా మీది గొప్ప ఓపిక. నేను ముందు నాకు అమ్మాయే పుట్టాలనుకున్నాను. అలానే జరిగింది. జన్మనిచ్చిన తల్లి ఆడది, తోడబుట్టిన సోదరి ఆడది, కట్టుకున్న భార్య ఆడది అయినప్పుడు కూతురుగా ఆడది ఎందుకు పుట్టకూడదు అనిపించింది. ఈ రోజులలో అమ్మాయైనా, అబ్బాయైనా ఒక్కటే.

    ReplyDelete
  11. కొంచం ఆలస్యంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలండీ.. మరింక ఆలస్యం లేకుండా రాసేయండి..

    ReplyDelete
  12. @ సుభద్రగారు ,ధన్యవాదాలు.
    @ లక్ష్మిగారు , థాంక్స్ !
    @ మాలాగారు ,మీరు తక్కువా చెప్పండి :)
    @ సుబ్బారెడ్డిగారు :) :)
    @ జయగారు , మీతో ఎకీభవిస్తానండీ :)
    @ శ్రీ లలితగారు పెద్ద కోరికలేం కాదండీ అందరికీ ఆలోచనలే :)
    @ కొత్తపాళీ సర్ ! థాంక్స్ !
    @ మధురవాణి గారు మీరు ఆల్రెడీ రాసేశారు :(
    @ శ్రీవాసుకి గారు , మీస్పందనకు ధన్యవాదాలు :)
    @ మురళిగారు థాంక్యు థాంక్యూ :)

    ReplyDelete
  13. బాగుందండి. ఐతే మళ్ళీ జన్మ జన్మ లకు అమ్మాయినై పుట్టాలి అని కోరుకున్నారా. పిక్చర్ బాగుంది.

    ReplyDelete
  14. e topic gurinchi entha baga vishleshinchinanduku thxs

    ReplyDelete