Friday, March 12, 2010

మరో జన్మ ఉంటే .....(మరో చిన్న టపా)


నా ముందు టపాలో మరోజన్మ ఉంటే ఆడపిల్లగానే పుట్టాలని ఉందని రాశాను. కానీ నాబాల్యం నుండి ఇప్పటివరకు నా జీవితాన్ని తరచి చూసుకుంటే నాకు ఒక్క జన్మ చాలదు చాలా చాలా జన్మలు కావాలనిపిస్తుంది మరి !వాటిలో కొన్ని చెప్తాను .

నాకు మరోజన్మంటూ ఉంటే ..పుట్టినదగ్గర్నుంచీ నన్నెంతో అపురూపంగా పెంచిన నాన్నగారికి నాన్నగా పుట్టి తన లేత పాదాలు కందకుండా నా అరచేతుల్లో పెంచుకోవాలనుంది అచ్చంగా తనలాగే ....

ఇంకో జన్మంటూ ఉంటే ...తన భర్త ప్రేమనికూడా మొత్తంగా నాకే ఇచ్చేసి నాకు అన్నీ సమకూర్చి పెట్టాలని తను ఎన్నో ఆనందాలకు దూరమైనా అమ్మకు...అమ్మగా పుట్టి తను చేసినవన్నీ నాకు పాపగా పుట్టిన తనకోసం చేయాలనుంది .

దేవుడింకో అవకాశమిస్తే ...తనకంటే ఎంత చిన్నదాన్నైనా , గిల్లి గిచ్చి యాగీ చేసినా ....తనకంటే నాన్న నన్నే ఎక్కువ గారం చేసినా అన్నిటికీ చిన్న చిరునవ్వుతో ....ఎప్పుడూ నన్ను పల్లెత్తు మాట అనకుండా ,చెయ్యెత్తి ఒక్క దెబ్బకూడా కొట్టకుండా ...ఇప్పటికీ అన్ని విషయాల్లోనూ నన్నే సపోర్ట్ చేస్తూ ...నాకన్ని వేళలా అండదండగా ఉండే అన్నయ్యకి ....తనకంటే ముందే పుట్టేసి నేను అన్ననై అలకలు తీర్చాలని ఉంది.

నేను దేవుడ్ని అడిగి మరీ కోరుకొనే ఇంకో జన్మ ...మా శ్రీవారికి భర్తగా ....కన్నవారి గారాబం సరే !పెళ్ళైన దగ్గర్నుంచీ కన్నవారికంటే మిన్నగా , కష్టమంటే తెలీకుండా , నాకు మరోనాన్నగా , అమ్మగా , అన్నగా ..అన్ని పాత్రలూ తానెఐ నాలోని మైనస్ లతో సహా నన్ను ప్రేమించే బంగారు శ్రీవారికి ఏమివ్వగలను ? నా మరోజన్మంతా భర్తనై భరించడం తప్ప !అప్పుడప్పుడూ మావారి మేనల్లుడుసరదాగా అడుగుతాడు....అత్తా!కష్టపెట్టలేదని సంబరపడతావ్ కాని కష్టాల్లో పాలుపంచుకోలేక పోతున్నానని బాధపడవేమని !అటువంటప్పుడు మనసు చివుక్కుమనిపించినా...ఎటువంటి ఒడిదుడుకులొచ్చినా మీనాన్నగారు , నేనూ చూసుకుంటాం కదా వాడేదో నిన్నేడిపించాలని అంటాడు అంటూ బుజ్జగించేస్తారు .

ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్ని జన్మలైనా చాలవు . నేనే అమ్మనైనా ...నా అలకలు తీర్చి బుజ్జి చేతులతో గోరుముద్దలు తినిపించే పిల్లలూ ....అత్తమ్మనైనా బుజ్జమ్మా ..అంటూ బుజ్జగింపుగా పిలిచే అన్నయ్య పిల్లలూ .....అమ్మ ,నాన్నల కంటే ఎక్కువగా గారం చేసే పిన్ని ,బాబాయ్ లు అత్తమ్మలు , మావయ్యలు ...కజిన్స్ ఐనా సొంత తోబుట్టువులా ముద్దు చేసే అన్నయ్యలూ , అక్కలూ ...మనవారంటే సరే అంతే ప్రేమగా చూసే వదినలు , బావలూ ....అన్నిటికంటే నా ప్రేమనే కాకుండా ...నా కోపాల్నీ , ఉక్రోషాల్నీ కూడా భరిస్తూ నన్ను విడవని నా స్నేహితులూ ...ఇలా అందరి కోసం అన్ని జన్మలు కావాలనిపిస్తుంది.మరి దేవుడెన్ని జన్మలిస్తాడో :) :)

*** నిషిగంధ గారు తన బ్లాగ్ కామెంటర్స్ అందరికీ థాంక్స్ గివింగ్ టపా రాశారు ...నా టపాకు అదే ప్రేరణ ! నాకు చిన్నప్పట్నుంచి ఆత్మీయతానురాగాలను పంచిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలనే ఆరాటమే ఈ టపా !చిన్న టపా అనుకున్నాను కాని పెద్దటపానే అయ్యింది బోర్ కొడితే మన్నించాలి

10 comments:

 1. జన్మ జన్మల బంధం....ఎన్ని జన్మలకు తీరునో ఈ అనుబంధం???

  ReplyDelete
 2. రెండో సిరీస్ మొదలు పెట్టేశారా! thanks giving season లా ఉందిది కదూ! అందర్నీ పేరు పేరునా తలచుకున్నారు.

  ReplyDelete
 3. అదృష్టవంతులు అనుకున్నాను కాని "ఇంత...." అని ఇప్పుడే తెలిసింది. ఈ టపాని మీవాళ్ళందరికీ చూపించండి చాలు.. అర్థం చేసుకుంటారు.

  ReplyDelete
 4. గుండె పొరల్ని స్పృశించిందండి మీ టపా! చాలావరకూ 'మన ' వాళ్ళ ప్రేమానురాగాలనూ, ఆత్మీయతనూ మనం granted గా తీసుకుంటుంటాం.. అందరం ఇలా ఒక్క క్షణం ఆగి మన కృతజ్ఞతలను వాళ్ళకి తెలుపుకోవడం చాలా అవసరమనిపిస్తుంది.. thanks for an inspirational post!

  ReplyDelete
 5. మీ రచనా శైలి మా పెరటి లో పూచే మల్లెల 'పరిమళం' లా ఉంది .
  నేను చిన్న బ్లాగ్ ని మొదలు పెట్టాను .నాకు దారి చూపిస్తారా?
  wwwtuvvayi.blogspot.com

  ReplyDelete
 6. ఆ జన్మలో కూడా ఇంత మంచి టపాలు రాయలండి.
  ఈ టపా నన్ను మళ్లీ ఇండియా తీసుకెళ్ళింది..

  ReplyDelete
 7. చాలా బాగుంది అండి. ఎంత బాగా చెప్పేరండి. నిజం గా మనసు ను కదిలించేసేరు. ఇంక ఏమి రాయ గలను చెప్పండి except wishing you good luck one more time.

  ReplyDelete
 8. పరిమళం గారు, గుండెలో ఏదో మూలా కలుక్కుమన్నది అండి.మీ పోస్ట్ చదివిన తరువాత, ఒక గంట వరకు నాకు అన్ని గుర్తు వచాయి, నన్ను ఎత్తుకు తిప్పిన తాతయ్యలు, అమ్మమలు, నయినామ్మలు, నాకు అపురూపం గ చూసుకునే అమ్మ, నాన్న, నాకు మాటలు నేర్పిన అత్తయ్యలు, మామయ్యలు, చినాన్నలు, పెద్దనాన్నలు, పిన్నిలు, పెద్దమ్మలు, నాతో ఆడుకునే పిల్లలు, నన్ను యువరాజుల చూసే పనివాళ్ళు, నాకు పాటాలు చెప్పిన టీచర్స్, ఎంత మందిని వదిలేసి, వలస పక్షులు లా సొంత ఊరికి, కన్నా వాళ్ళకి, తోబుట్టువులకు, అయిన వాళ్ళకి దూరంగా వుండి, ఏమి సాదిస్తున్నాం. 5 అంకెల జీతం తప్ప, అవసరానికి వాళ్ళ పక్కన లేనప్పుడు, పరిమళం గారు, మీరు చెప్పింది నిజం. మనం వాళ్ళకి ఎలా చేసిపెట్టడం తప్పితే, ఇంకా ఏమి లేదు. పరిమళం గారు న గురించి కూడా దేవుడు కి చెప్పండి.
  మోహన్

  ReplyDelete
 9. చలా బాగుంది నిజమె జన్మంటు ఉంటే స్త్రీగానె పుట్టాలన్నదే నా కోరిక మీ వసంత గానం కోకిల చిత్రం పరిమళ గారు మీ పేరులానె పరిమళ భరితం .మదిని అలరించిన మోహన గీతం హేట్సాఫ్

  ReplyDelete
 10. లేట్ గా వ్రాస్తున్నందుకు ఏమీ అనుకోవద్దు.తీరిక దొరికినప్పుడు చదువుతుంటుంటాను.ఇలాంటి post నేను వ్రాసుకుందామనుకున్నాను.
  కొన్ని సినిమాల్లోనే అన్ని characters దేవతల్లాగ
  కనిపిస్తారు.నిజజీవితంలో సాద్యమా అనిపించేది.మీ post చదివాక నిజజీవితంలో కూడా అలా జరుగుతుందని తెలిసింది.

  ReplyDelete