Wednesday, February 3, 2010

మనసు మూగబోతున్నా ....


నేస్తమా !
నువ్వు తలపుకొచ్చిన ప్రతిసారీ ....
కంట పొంగే ఏరునాపలేకున్నా!
నువ్వే కొలువైన మది గుడిలో
పరులనడుగు పెట్టనీయలేకున్నా !
ఇలలో పరిచయాలు నిషేధించి
కలలో నీతో ఊసులాడుకున్నా !
నువ్వేమో ....
అభిమానాల అల్లికలు పెనవేసుకుంటే
అనురాగాల వేళ్ళు పాతుకుపోతాయన్నావ్
కాలం ప్రతికూలిస్తే.....
మనపరిచయం అగాధాల అంచుకుచేరి
మరో వ్యధాభరితకధనం కాకూడదన్నావ్ !
నా మనసు నిఘంటువులో .....
నీ మాటలకర్ధం వెతుకుతున్నా !
ఆకాశంవంటి నీ వ్యక్తిత్వం ముందు
ప్రతిసారీ నేనోడిపోతూనే ఉన్నా !
మనసు మూగబోతున్నా ....
నీఆదర్శం ముందు మోకరిల్లుతున్నా!!

23 comments:

 1. కానీ, ఒక వ్యధా భరిత కథ మదిలో శాశ్వతంగా ఉండిపోతుందిగా, వ్యక్తం కాకుండా!

  ReplyDelete
 2. ఆదర్శం ముందు మోకరిల్లి మనసుని దోచుకున్నారుగా:)...బాగుందండి!

  ReplyDelete
 3. చాలా బాగుందండి.

  ReplyDelete
 4. గుండె గదిలో బందీని చేసి
  గురుతుకొచ్చిన ప్రతిసారీ
  తలుపు తడుతున్నావు ...

  కంటి రెప్పల్లో ఖైదు చేసి
  అలసి సోలిన ప్రతిసారీ
  అలజడి చేస్తున్నావు...

  మోడుచెట్టుకు ప్రాకిన మల్లె పొదలా..
  మనసంతా నిండి మత్తు రేపుతున్నావు..

  తలనెత్తి నీకు దూరమవలేక
  ఒదిగి చెంతన చేరినపుడల్లా..
  నింగి ఎత్తుకు నెట్టి దూరమవుతావు..

  పొంగు ప్రేమను పంచ
  చేజాచినపుడల్లా..
  ఓడిపోయానంటు మోకరిల్లుతావు..

  అగాధాల అంచు కాక
  మరి ఇదేమి నేస్తం?

  ReplyDelete
 5. చాలా బాగుంది...ఏమనాలో కూడా అర్ధం కావటం లేదు.. చాలా బాగా ఆవిష్కరించారు మూగోపోయిన నేస్తం మనసును.

  ReplyDelete
 6. చాలా బాగుంది

  ReplyDelete
 7. క్షణమైనా మనం...!
  నాకూ తెలుసు ప్రియతమా...
  నన్ను గెలిపించడానికే నువ్వోడిపోతావని...
  నన్ను దేవుడిగ మార్చేందుకే నీ గుండియ గుడి చేసావని..!!
  కనుమఱుగైన గతం గుర్తొస్తే దుఖః భాష్పాలు...
  కనులముందు నిలుస్తే ఆనంద భాష్పాలు....
  ఎలాగైనా తప్పవు నయనాల గంగా-యమునల ప్రవాహాలు
  దృక్కోణాల కందని దృక్పథం మన మధ్య దిక్చక్రం...!
  కలిసినట్లనిపించే ఊహా చిత్రం...!!
  పరిచయం అనేది అత్యంత అల్పమైన పదం మనబంధం ముందు..
  ఈ అనుబంధం జన్మ జన్మాల పొందు ..పసందు...
  అయినా మనసు పంచుకొన్న భావాలు మాటలకెలా అందుతాయి..?
  ఏ నిఘంటువులలో దొరుకుతాయి?
  వ్యక్తీకరించలేని అనుభూతులు పరవశానికే చెందుతాయి..!
  అంతరాంతరాల్లో ఒకటైన మనం...
  వేరే అనే భావనయే మనం..!

  ReplyDelete
 8. స్నేహానికి లేదు దూరం. అది ఎప్పుడూ అమరం. స్నేహమనే బంధం లో ఎన్ని జన్మలైనా కలిసే ఉండగలరు. నేడు కన్నీరెందుకు మిత్రమా! ఎనలేని మీ స్నేహానికి ప్రణతి.

  ReplyDelete
 9. కవత చాలా బాగుంది. Excellent..

  ReplyDelete
 10. బావుందండీ!
  ఆత్రేయ గారి కవిత బావుంది

  ReplyDelete
 11. parimalagaru adaragoduthunnaru..naa article ikkada atnmahatyalu apabadunu chadivara

  ReplyDelete
 12. Hi.. mee 'vivaham - oka veduka' post chadivanu. chala bagundi. Naku pelli mantralu nerchukovalani undi. ekkada nundi nerchukogalano cheppagalara.

  ReplyDelete
 13. చాలా చాలా బావుంది

  ReplyDelete
 14. మూగపోయిన మనసు పాడలేదనుకున్నావా పాటలు
  చెవులుండే మనసుకే వినిపిస్తాయి ఆ సొదలనే
  గొప్ప కవుల భావనా తరంగాలలో ఎప్పటికి తేలుతామోకదా..

  ReplyDelete
 15. కవిత చాలా బాగుంది

  ReplyDelete
 16. చాలా బాగుందండీ. ఇంతకంటే ఎలా చెప్పాలో తెలియలేదు.

  ReplyDelete
 17. ఇలలో పరిచయాలు నిషేధించి
  కలలో నీతో ఊసులాడుకున్నా !
  ...ఈ వాక్యం బాగా నచ్చిందండీ...

  ReplyDelete
 18. మీ కవిత, ఆత్రేయ గారి ప్రతి కవిత రెండూ ముచ్చటగా ఉనాయి :)

  ReplyDelete
 19. నా ఈ చిన్న అనుభూతిని పంచుకున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు .
  ప్రతిస్పందనగా అమూల్యమైన కవితలందించిన ఆత్రేయ గారికీ ,రాఖీ గారికీ ప్రత్యేక కృతజ్ఞతలు .

  ReplyDelete
 20. చాల బాగుంది మీ కవిత...ఈ కవిత ఎంతో అర్ధంగా వుంది.

  ReplyDelete