Saturday, December 26, 2009

నీ కానుక !


అమ్మ జన్మనిచ్చింది
నాన్న సంస్కారమిచ్చారు
సెలయేరు మాటలు నేర్పింది
కోయిలమ్మ పాట నేర్పింది
చిలకమ్మ చెలిమి చేసింది
జాబిల్లి వెన్నెలనిచ్చింది
సంపెంగ సొగసు పంచింది
మల్లె పరిమళమద్దింది
నింగి ఆత్మవిశ్వాసం పెంచింది
నేల సహనాన్ని నింపింది
వెలుగు మార్గాన్ని చూపింది
చీకటి కష్టాన్ని తెలిపింది
దైవం ఎల్లవేళలా తోడు నిలిచింది
అన్నీ నావద్దే ఉన్నాయి ....
నువ్వేమివ్వగలవని గర్వపడ్డా!!
కాని ...
నువ్విచ్చావు ...కానుకగా ....
నీ మనసు మాత్రమే కాదు
నా పెదవులపై చెరగని ...
చిరునవ్వు కూడా !

19 comments:

  1. Beautiful..
    ఎప్పటిలాగే బాగుందండీ..

    ReplyDelete
  2. నచ్చింది మీ కవిత!

    ReplyDelete
  3. పరిమళ గారు! చాలా........... బాగుంది.

    చివర నాలుగు లైన్లు వచ్చేవరకూ పెద్దగా నచ్చలేదు. ఈవిడేంటి ఇంత సింపుల్ గా రాసేసారు అనుకుంటున్నాను.. అప్పుడు అర్థమైంది మీ ప్రతిభ.. ప్రేమ..

    ఎక్సలెంట్ ప్లస్.. ప్లస్.. అనుకోండి.

    ReplyDelete
  4. పరిమళ గారూ శుభోదయం!!
    మనసుని చిరునవ్వునీ ఇచ్చిన వాళ్ళు మరొకటి కూడా మనలో ..మనసులో..ప్రేరేపించారు..కవితని ఉద్భవింప జేసారు..కలతని శమింప జేసారు..అందుకే..ఆ స్పూర్తికి..ఆ సత్యానికి..సృజనకి..భావనకి..కల్పనకి...వి’జయ’మోహనులకి,కార్తీక శేఖరులకి,నాగోల మురళి సవ్వడులకి,పద్మార్పిత విశ్వప్రేమికులకి,మరువని ఉషా”భాస్క’ర వి”mala తృష్ణల కి ...ఇలా ఎందరో స్నేహితులు ..అందరికీ..జోహార్ జోహార్ జోహార్!!

    ఓ నా గీతమా! నా జీవితమే నీకంకితము
    ఓ భావ సంచయమా! నా సర్వస్వము నీ కర్పితము
    1. ఏనాడు ఉదయించావో నా ఎదలోతుల్లో
    ఏమూల దాగున్నావో నా అంతరాలలో
    నిను వెలికి తీయడానికి ఎంతెంత శోధించానో
    నిను బయట పెట్టడానికి ప్రయాసెంత చెందానో
    నీకేమెరుకా ఓ నా కవిత-ఊహించనైనా లేవు నా గుండెకోత
    2. పదములు పొసగక పాట్లెన్ని పడ్డానో
    చరణాలు సాగక సమయమెంత ఒడ్డానో
    నిద్రలేమి రాత్రులు ఎన్నెన్ని గడిపానో
    నిద్రమధ్య ఎన్నిసార్లు ఉలికిపడి లేచానో
    నీకేమెరుకా ఓ నా కవిత-ఊహించనైనా లేవు నా గుండెకోత
    3. పురిటినొప్పి సంగతి పురుషుణ్ణయీ అనుభవించా
    మరణ యాతనన్నదీ జీవిస్తూనె రుచిచూసా
    ఆకలీదప్పికలన్నీ నీ ధ్యాసలొ నేమరిచా
    లోకమంత మెచ్చిన నాడే రాఖీ శ్రమ సార్థకత
    నన్ను వీడిపోకుమా ఓనా కవితా
    నీవు తోడు లేనినాడు నా బ్రతుకేవృధా

    ReplyDelete
  5. చిరునవ్వు కూడా ఒకరు ఇచ్చే కానుకే. బాగా చెప్పారు.
    కల్పనరెంటాల

    ReplyDelete
  6. జీవితం లో ఎవరి ప్రాముక్యత వారిది. మీ కవిత climax సూపర్ .. మఘధీర లో "పంచదార బొమ్మా బొమ్మా" పాట గుర్తుకొచ్చింది ..

    ReplyDelete
  7. చాల బాగుంది , బొమ్మ మరీను .

    ReplyDelete
  8. చాలా బాగుందండీ... మొదట లైన్స్ చదువుతూంటే నువ్వునాకు నచ్చావ్ లో ప్రకాష్ రాజ్ కవిత గుర్తొచ్చింది :-) చివరి లైన్లు మొత్తం కవితకి మరింత అర్ధాన్నిచ్చాయి.

    ReplyDelete
  9. చాలా బాగుందండి. రాఖీ గారు మీ కవిత కూడా చాలా బాగుందండి. మీ బ్లాగ్ లో పెట్టవలసింది. బాగుంది.

    ReplyDelete
  10. చాలా బాగుందండీ...

    ReplyDelete
  11. బాగుందండి . అయినా నేనెప్పుడో చెప్పాగా మీ నవ్వు బాగుంటుందని .

    ReplyDelete
  12. bhaavana garoo and all other frnds plz visit my blogs 4 songs(my lyrics)..naaneelu..and vachana kavithalu..
    www.raki9-4u.blogspot.com
    www.rakigita9-4u.blogspot.com
    www.raki-4u.blogspot.com
    సదా మీ స్నేహాభిలాషి
    రాఖీ

    ReplyDelete
  13. ఒక్కటి మరిచారు - తృప్తి. సరైన తోడు తీసుకువచ్చే పరిణామం - తృప్తి, ప్రశాంతత.

    ReplyDelete
  14. addiripoyindandi!!! nijam ga chaala bagundi.

    ReplyDelete
  15. స్పందించి అభిప్రాయాలు తెలియచేసిన మిత్రులకు ధన్యవాదములు .

    ReplyDelete