Thursday, December 17, 2009
శాపమేమో ...ఇది!
నా బాల్యం ఎంత అందమైనదీ !
నా జ్ఞాపకాలన్నీ మధురమైనవే
అంతలోనే ....
ఎవరెక్కువ రాణీలని పట్టుకున్నామో
అని పందెంకట్టి బుట్ట కింద పెట్టిన
నీలి తూనీగలు శపించాయో ..
నేనే మహరాణినంటూ
నేస్తాలు పరిచిన పూలదారిలో
నే తొక్కిన పూరెక్కలు శపించాయో ..
విశాలంగా విచ్చుకొని
ప్రపంచాన్ని చూస్తున్న తమని
ముట్టుకొని ముకుళింప చేశానని
టచ్ మీ నాట్ శపించిందో .....
నేనూ , నా స్నేహితులూ దూరమయ్యాం !
మళ్ళీ ఇన్నాళ్ళకు అదే ఫ్లాట్ ఫాం మీద
రైలు ఆగినపుడు నా గుండె వేగం పెరిగింది
అది ఏసి అద్దాల చెమ్మో....లేక
నా జ్ఞాపకాల చెమరింత...
గుండె దాటి కంటిచివర చేరిందో
తెలీదు .....కాని ...
స్టేషన్ మాత్రం మసక మసగ్గా
దాటిపోయింది !!
Subscribe to:
Post Comments (Atom)
స్టేషన్ లో దిగకుండానే వెళ్ళిపోయారా? :(
ReplyDeleteపరిమళం అక్క బావుంది.. చాల బాగా రాసారు...
ReplyDeleteమది వణికించే చిరు ఆవేదన + బావుకత్వం కలగలిపి హృదయపు అంచులు తాకింది ఈ కవిత... చివర మాత్రం మీరు ఇన్నాళ్లకు మీ నేస్తాలను కలిసుంటారు అనుకున్న, కాని కదిలి పోయిన రైలు మీ నేస్తాలకు మళ్లీ మిమ్మల్ని దూరం చేసిందన్న మాట.. త్వరలోనే మీరు మీ స్నేహితులను తిరిగి కలుసుకోవాలని కోరుకుంటూ మీ తమ్ముడు....
www.tholiadugu.blogspot.com
ఎ తొడూ రాక పొయినా నీ తోడుండేవి అవే కదా.....
ReplyDeleteచిన్న నాటి జ్ఞాపకాలు....
శాపం కాదండీ...కాలం తన పని తాను చేసుకుపోవటం కాబోలు...
ReplyDeleteచాలా బాగా వ్రాసారండి. హృద్యమైన మీ కవితకి...అందమైన ఆ చిత్రం సరిగ్గా సరిపోయిందండి.
ReplyDeleteరాజన్
అది ఏసి అద్దాల చెమ్మో....లేక
ReplyDeleteనా జ్ఞాపకాల చెమరింత...
గుండె దాటి కంటిచివర చేరిందో
తెలీదు .....కాని ...
స్టేషన్ మాత్రం మసక మసగ్గా
దాటిపోయింది !! ..very nice!!
"అది ఏసి అద్దాల చెమ్మో....లేక
ReplyDeleteనా జ్ఞాపకాల చెమరింత...
గుండె దాటి కంటిచివర చేరిందో
తెలీదు .....కాని ...
స్టేషన్ మాత్రం మసక మసగ్గా
దాటిపోయింది !! "
చక్కగా వ్యక్తీకరించారు. నచ్చింది. ఆడపిల్లల స్నేహాలెప్పుడు ఇంతెనెమో కదా...ఏ దూరా తీరాలకో వెళ్ళిపోతాం...అందర్నీ వదిలిపెట్టి....
మీ జ్ఞాపకాల దొంతర మా మనసుని దోచింది....బాగుందండి!
ReplyDeleteగతమెప్పుడూ మధురమేనేమో... చాలా బాగుంది మీ కవిత. దానికి అతికినట్టున్న ఫోటో సంపాదించారే.. :)
ReplyDeleteకన్ను మూసి తెరిచే లోగా కరిగిపోయేదే బాల్యం
ReplyDeleteఎప్పటికీ కోరుకునేది కూడా బాల్యం
కల్లాకపట మెరుగని, అసూయ ధ్వెషాలకు అతీతం ఈ బాల్యం
ఎంత మాధురమో కదా! సీతాకోక చిలుకల ముచ్చట్లైతే ఎప్పటికీ మరపు రానివి. ఆ తీపి గురుతుల మీ బాల్య స్నేహితులు కలవాలని ఆశిస్తున్నాను.
kavitaki podigimpu gaa telugu lo raasi cut paste chestunte assalu avadam ledu idemi saapamo araganta try chesi inka veelu padaka tenglisgh lone
ReplyDeletestation maatram daati poindi ,
naa gata smruti chain laagi akkade aagi poindi .
దాటి పోయిన మజిలీలను తిరిగి చేరాలని ప్రయత్నిస్తే ఒక్కో సారి మసక బారిన కన్నుల జ్నాపకాల చెమరింతలే తప్ప వెతికిన గమ్యం దొరకదు కదా. వుస్సురని రైలు కూతతో గుండె నిట్టూర్పు జత నిచ్చి సాగి పోవటం తప్ప.
ReplyDeleteఅది ఏసి అద్దాల చెమ్మో....లేక
ReplyDeleteనా జ్ఞాపకాల చెమరింత...
ఎంత హృద్యంగా చెప్పారు....
తెలిసీ తలియని అజ్ఞానంలో..అల్పమైన వాటికీ విలువ ఉంటుందని ఎరుగని పసివయసులో..అవి మనల్ని శపించవు..వాటికీ ఇలాగైనా సార్థకత చేకూరిందనీ..ఎదోరకంగా తమ జన్మ చరితార్థమైందనీ ..మనకు ..ఉత్తమ సందేశాన్ని అందిస్తాయి..కానీ మానవులైన మనం ఏంకోరుకోవాలి..జన్మనెలా సార్థకం చేసుకోవాలీ...!
ReplyDeleteమానవ జీవితం-నవపారిజాతం
చేయాలి ఇకనైనా పరమాత్మకు అంకితం
వికసిత హృదయం-ఒక మందారం
అర్పించుకోవాలి-అహరహం
1. గరికపోచ సైతం - చేరుతుంది గణపతిని
గడ్డిపూవైనా- కోరుతుంది ఈశ్వరుణ్ణి
పంకజాల ఆకాంక్ష- విష్ణుపత్ని పాదాలు
జిల్లేళ్లూ మారుతికి-అవుతాయి మెడలొ నగలు
2. సాలెపురుగు తనుకట్టె- శివమందిరం
ఉడతైనా తలపెట్టె- శ్రీరామ కార్యం
చిట్టి ఎలుకేగా-గజముఖుని వాహనం
అల్పమౌ పక్షేకద-శ్రీహరికి విమానం
సదా మీ స్నేహాభిలాషి
రాఖీ
తెలిసి చేసినా తెలీక చేసినా తప్పు తప్పే!.....
ReplyDeletejust kidding!
అదేకదా జీవితం, నిన్నల్లోకి తొంగి చూసుకుంటూ, ఇవాళ్టి బాధకి ఆ నవనీత లేపనాలు అద్దుకుంటూ, రేపటిలోకి... కాలం చెప్పే తీర్పుకి మనం అతీతులుమా...
ReplyDeleteSo.....nice
ReplyDeleteబాల్య స్మృతులను లెప్పుడూ మధురమైనవే ! బహుషా , బాల్య మిత్రులను కలుసుకుంటే ఆ మధురిమ చెరిగి పోతుందేమో !
ReplyDeleteకవిత బాగుంది .
కవిత చాలా బాగుంది. ఇంత భావగేయుక్తంగా ఎలా రాయగలుగుతున్నారు. మీరు ఇలాగే రాస్తూ ఉంటే పెద్ద కవియిత్రి ఐపోతారని అనిపిస్తుంది. నా కోరిక అదే!
ReplyDeleteమీ స్పందనకి నా స్పందన రాసాను. నా బ్లాగు చూడండి.
స్నేహం విలువ మనిషి విలువ దగ్గరగా వున్నప్పుడు కనిపించదు. అదే స్నేహం సుదూర తీరాల్లో నుంచి ఒక్కసారి మనముందు ప్రత్యక్షమైనప్పుడూ కనిపించదు. కళ్ళవెంట నీరు పరుగెత్తుతుంది , నోటివెంట మాట కరువవుతుంది. మీరు మీ స్నేహితులు ఎప్పటికైనా కలవాలని ఆశిస్తూ..
ReplyDeleteమీ కవిత చదివిన తరువాత చాలా సేపు వరకు నాబాల్యస్నేహితులందరూ అలా కళ్ళముందు కదిలాడారు. అనుభూతి నుంచి పుట్టిన కవిత. బాగుందండీ
పరిమళ గారు! మీ మాటను తీవ్రంగా ఖండిచాను. అసలు ఒక కవిత రాయాలంటే ఏవిధంగా సన్నద్ధమవ్వాలో చెప్పండి.
ReplyDeleteజ్ఞాపకాల గదిలో పడేసారుగా మళ్ళీ...
ReplyDeleteచాలా బాగా రాసారు.
This comment has been removed by the author.
ReplyDelete@ మురళి గారు , ధన్యవాదాలండీ !
ReplyDelete@ కల్పనగారు , మొదటిసారనుకుంటా నా బ్లాగ్ కి రావటం ...నా చిరు కవిత మీకు నచ్చినందుకు ధన్యవాదాలు
@ పద్మార్పితగారు ధన్యవాదాలు !
@ విశ్వ ప్ర్రేమికుడు గారు , ఫోటో గూగులమ్మ చలవేనండీ :) ధన్యవాదాలు
@ జయగారు , "కన్ను మూసి తెరిచే లోగా కరిగిపోయేదే బాల్యం"నిజమండీ ..జ్ఞాపకాలు మాత్రం చిరకాలం ఉండిపోతాయి ధన్యవాదాలండీ !
@ రవిగారు , మీ "tenglisgh" ని తెలుగీకరిస్తున్నాను
ReplyDeleteస్టేషన్ మాత్రం దాటిపోయింది నా గత స్మృతి
చైన్ లాగి అక్కడే ఉండిపోయింది :) సూపరండీ !
@ భావనగారూ , స్పందనకు ధన్యవాదాలండీ !
@ వర్మ గారు , ధన్యవాదాలండీ !
@ రాఖీ సర్ ! నిజంగా నా బ్లాగ్ సార్ధకమైంది మీ పాటతో ...ధన్యవాదాలు !
@ ఉష గారు , మీ నవనీత లేపనాలు అద్దినట్టే ఉందండీ మీ ఓదార్పు !ధన్యవాదాలు .
@ విజయ మోహన్ గారు , ఇప్పుడు వాళ్ళు కూడా అక్కడ ఉండటం లేదండీ :(ధన్యవాదాలు
ReplyDelete@ కార్తీక్ !చిన్ననాడే విడిపోయాం మళ్ళీ కలవలేదు ...నేను తలచుకోవడమే కాని వాళ్లకి నేను గుర్తున్నానో లేదో కూడా తెలీదు తమ్ముడూ !
@ సత్య గారూ , నిజమేనండీ ....ధన్యవాదాలు
@ శేఖర్ గారు , కాలగమనంలో అన్నీ కొట్టుకుపోయినా కొన్ని బాల్య స్మృతులు మాత్రం అలాగే గుర్తుండిపోతాయి కదండీ !ధన్యవాదాలు
@ రాజన్ గారు నచ్చినందుకు ధన్యవాదాలండీ !
@ సృజన గారు , థాంక్స్ !
ReplyDelete@ మాలా గారు , ధన్యవాదాలండీ
@ సవ్వడి : మీకు ఇంతగా నచ్చినందుకు నాకూ సంతోషంగానే ఉందండీ ...ప్రత్యేకించి సన్నద్ధమవటం చేయలేదుఎపుడూ మార్గ మధ్యంలో ఆ స్టేషన్ లో ట్రైన్ ఆగినపుడు నాకు కలిగిన ఉద్వేగాన్ని నెట్ లో తీసిన టిక్కెట్ వెనుక రాసినదంటే నమ్మాలి మీరు ! ధన్యవాదాలు
@ భాస్కర్ రామిరెడ్డి గారు , బాల్య స్నేహితుల ముచ్చట్లు గుర్తుకొస్తే ఎంతటి బాధలో నైనా చిర్నవ్వు పెదాలపై కొచ్చేస్తుంది ...నచ్చినందుకు ధన్యవాదాలండీ !
@ తృష్ణ గారు , సెలవులకి సెలవిచ్చేశారా ? ధన్యవాదాలు !
......నా స్నేహమా..!
ReplyDeleteవెదకబోయిన తీగవే నీవని
–అనుకోకుండా ఉండలేను
మారువేషం వేసుకొన్న స్నేహమే నీవని
- అనుకోకుండా ఉండలేను
చేజారిన హృదయమే నీవని
–అనుకోకుండా ఉండలేను
మరపురాని అనుభూతే నీవని
-అనుకోకుండాఉండలేను
నువులేకుండా నేనే లేనని
-అనుకోకుండాఉండలేను
నేస్తం! ప్రతిక్షణం పరస్పరం తలుచుకుంటామని
-అనుకోకుండాఉండలేను
కరిగిపోయే కాలం ముందు మనం సజీవ శిలాప్రతిమలమని
-అనుకోకుండాఉండలేను
ఎప్పుడూ మీబ్లొగ్ చూస్తున్నందుకైనా అప్పుడప్పుడు మా వైపూ చూడాలి సుమా! దరహాసచంద్రికలు!!
మనసుని కదిలించే జ్ఞాపకాలు మది పెట్టెలో బోలెడు.. ఒక్కోసారి ఎదురుగా కనపడినప్పుడు... కచ్చితంగా ఆ కళ్ళు చెమర్చక మానవు కదా..!
ReplyDelete@ రాఖీగారు , శివగారు ధన్యవాదాలండీ !
ReplyDeleteచాలా బావుందండీ... చక్కగా రాశారు.
ReplyDelete