
ఏ వత్సరం గడిచినా ఏమున్నది గర్వకారణం ?
సామాన్యుని జీవనం సమస్తం అస్తవ్యస్తం !
కాలుష్యపు కోరలు , విద్యుత్ కోతలు ....
ప్రజల ఇబ్బందులు !
ప్రకృతి విపత్తులు ,ఘోర ప్రమాదాలు
నేతన్నల ,రైతన్నల కష్టాలు ,కన్నీళ్లు !
ఆర్ధిక మాంద్యం , ఐటీ సంక్షోభం ....
ఉద్యోగుల కలవరం !
నింగినంటిన నిత్యావసరవస్తుధరలు....
మధ్యతరగతి వెతలు !
ఉగ్రవాదపు పడగనీడలో బిక్కు బిక్కుమంటూ
భద్రత లేని బ్రతుకులు !
విద్వేషాల ,విభజనల హోరులో
దగ్ధమైన "మన " రైళ్ళూ , బస్సులూ ..
ఉద్వేగాల , ఉద్యమాల పోరులో
బలౌతున్న "మన " పిల్లల భవిష్యత్తు...
తిరోగమిస్తున్న "మన " పురోభివృద్ధి !
ఇన్ని చేదు అనుభవాలు మిగిల్చిన
ఈ సంవత్సరానికి చెబుతున్నా
వీడ్కోలు .....ఆవేదనతో ....

చీకటి వెంటే వెలుగు
వైఫల్యం వెనుకే విజయం
ఆ ఆశతోనే ఆహ్వానిస్తున్నా
నూతన సంవత్సరాన్ని !
సర్వేజనాః సుఖినోభవంతు అని ప్రార్ధిస్తూ ....
** బ్లాగ్ మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు !
భవిష్యత్తు మీద తియ్యని ఆశలతోనే కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం. ఎంతైనా ఆశా జీవులం కదా! మీకు నా హ్రుదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ReplyDeleteమీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ReplyDeleteఆ ఆశే మనిషిని నడిపించే సాథనం కదండీ అలా సాగిపోవడమే.. బాగుంది మీ వీడ్కోలు ఆహ్వానం. 2009 బొమ్మ భలే ఉంది :-)
ReplyDeleteఏ నాడు రైతన్నల ఎదలో జల్లులు కురుస్తాయో..గోదావరి కృష్ణా ప్రవాహాలు పంటపొలాల్లో పరుగులు తీస్తాయో...ఏ రోజు సగటు ఉద్యోగి ఒకటో తారీఖును మరచిపోయి..నిత్యానందుడౌతాడో...ఏ ఉదయం నేతన్న బలవన్మరణాలాగిపోతాయో..ఏ దివసం నిరుద్యోగమనే పదం నిఘంటువునుండి తొలగిపోతుందో..ఏ తేదీన అవినీతి..అక్రమం..అన్యాయం..దోపిడి అన్న పదాలు జనం మరచిపోతారో..ఏ తారీఖున పక్షపాతాన్ని ప్రభుత వీడుతుందో..ఎన్నడు ఉద్యమాలు సమసిపోతాయో..ఎప్పుడు నిజమైన సౌభ్రాతృత్వం..మానవత్వం తలయెత్తుక తిరుగుతుందో అనాడే..నవశకం..నవ వర్షం...నవనవోన్మేషం జన హర్షం!!
ReplyDeleteఆనాటి కోసం వేచి చూద్దాం..అప్పుడే ఆనందంగా నవ వత్సరాన్ని ఆహ్వానిద్దాం!!!
ఆ చివరి చిరు ఆశ, ఆకాంక్ష నాకు చచ్చేంత నచ్చిపోయాయి. ;) నూతన సంవత్సర శుభాకాంక్షలు
ReplyDeleteబాగుంది :)
ReplyDeleteనూతన సంవత్సర శుభాకంక్షలు..
"బ్లాగులోకంలో మంచి టపాలు - 2009"
కోసం ఈ కింది లంకే చూడండి.
http://challanitalli.blogspot.com/2009/12/2009.html
సర్వేజనాః సుఖినోభవంతు అని ప్రార్ధిస్తూ ....
ReplyDeleteమీకు కూడా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు :)
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు... క్రొత్త సంవత్సరం కోటి ఆశలని మోసుకురావాలని కోరుకుంటూ...
ReplyDeleteమీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు!
ReplyDeleteచీకటి వెంటే వెలుగు
ReplyDeleteవైఫల్యం వెనుకే విజయం
నిత్య సత్యం చెప్పారు. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
పరిమళం గారూ !
ReplyDeleteMay your New Year ( 2010 ) be full of Happiness and Sunshine
SRRao
sirakadambam
మీ చివరి ఆశ చాలా బాగుందండీ.. మీకు మరియు మన బ్లాగు మిత్రులందరికీ హ్రుదయపూర్వక శుభాకంక్షలు..
ReplyDeleteమీకు కూడా నూతన సంవత్సర శుభకాంక్షలు .
ReplyDeleteఅదే ఆశ అందరిలోనూ. మన ఆశలన్నీ ఆశీర్వచనాలై ప్రపంచ శాంతికి బాటలు వేయాలని ఆకాంక్షిస్తూ మీకు, మీ కుటుంబ సభ్యులకు Happy new year 2010.
ReplyDeleteమీ వీడ్కోలు వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టాయి...బాగుంది.
ReplyDeleteనిజమేనండీ..ఆశే మనల్ని ముందుకు పోయేటట్టు చేస్తుంది...
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఆవేదనైనా.. ఆనందమైనా..
ReplyDeleteప్రేమైనా.. సంతోషమైనా..
మీదైనా "పరిమళం" గుభాళిస్తుందిగా!
ఇటువంటివి కూడా రాస్తూ ఉండండి.
మీకు, మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు..
ReplyDeleteబ్లాగు మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకంక్షలు, ఈ కొత్త వత్సరం అందరు సుఖ సంతోషాలతో ఉండాలని ,
ReplyDeleteమనందరి పై ఆ శ్రీ నృసింహుని కృప ఉండాలని ఆసిస్తూ మీ కోసం
భద్రాచల నరసింహ క్యాలండర్ - 2010 ఈ కింది లింకులో
http://bhadrasimha.blogspot.com/2010/01/2010.html
ధన్యవాదములు
- భద్రసింహ
Happy NewYear
ReplyDeletewish you a happy new year.
ReplyDelete23 DECEMBER 2008 నుండి 1 JANUARY 2010 దాకా ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ బ్లాగు చూడండి..
ReplyDeletehttp://creativekurrodu.blogspot.com/
Happy New Year :)
మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు!
ReplyDeleteపరిమళగారూ,
ReplyDelete"నిరాశ " అన్న పదం లోనే "ఆశ" అన్న పదం దాగుంది. మీరు చెప్పినట్లే రాజహంస పాలూ, నీరూ విడదీసి పాలనే గ్రోలినట్లు మనం కూడా నిరాశ లోని అల్పత్వాన్ని అధిగమించి, ఆశ అనే అందల మెక్కడానికి ప్రయత్నిద్దాం...
నూతన సంవత్సర శుభాకాంక్షలతో...
శ్రీలలిత...
నూతన సంవత్సర శుభా కాంక్షలు
ReplyDeleteశుభ కామనలు!!!!
ReplyDelete(ఉప్+)పొంగ(+అ)ల్(+ఇ){=ఉప్పొంగాలి}
[తెలంగాణ “కో] సం”క్రాంతి
[ఎదఎదలో ]’కనుము’ శుభ [మనో]కామనలు!!
ఈనాటి ఆనందమయ మకర సంక్రాంతి
ReplyDeleteఅందించాలి అందరి జీవితాలకు నవ్య క్రాంతి
*** మీకు, మీ కుటుంబానికి, మీ మిత్రులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ***
SRRao
శిరాకదంబం
http://sirakadambam.blogspot.com/2010/01/blog-post_13.html
స్పందించిన బ్లాగ్ మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలతో .........మీ పరిమళం .
ReplyDelete