Saturday, October 27, 2012

శాన్వీ.....

అమ్మా....
ఏ దేవదేవుడో పొరపాటున జారవిడుచుకున్న
దేవపారిజాత పుష్పానివి నువ్వు!
ఏ పురాణేతిహాసాల్లోనూ లేడమ్మా...
ఇంత కౄర రాక్షసాధముడు!
మానవత్వం మంటకలిసిన తరుణంలో
మాపాపపు లోకంలో క్షణమైననిలువక
 దివికేగి...నీదైవత్వాన్ని తిరిగి పొందిన
చిన్నారి దేవతవి నువ్వు!
నిన్ను స్వాగతించినవి నాల్గు చేతులేనేమో
కాని....
వీడ్కోలు పలుకుతున్నవి వేలచేతులు!
ఇక ఎన్ని కొవ్వొత్తులు వెలిగించినా
కానరాదు నీరూపు.....
వ్యధాభరిత హృదయంతో....
చెబుతున్నాం టాటాలూ....బైబైలూ....

* తనసొత్తనేమో తిరిగి తీసుకెళ్ళి ఆతల్లితండ్రులకి కడుపుకోత మిగిల్చిన ఆదేవుడ్నే వారికి ఈబాధను తట్టుకునే మానసిక స్థైర్యాన్ని ఇవ్వమని ప్రార్ధిస్తున్నా.....

8 comments:

  1. రాక్షసులు ఇంకా ఈ ప్రపంచంలో తిరుగుతూనే ఉన్నారు. మీతో బాధ పంచుకుంటున్నాం.భగవంతుడు ఆ తల్లి తండ్రులకు తట్టుకునే శక్తి ప్రసాదించాలని కోరుకుంటున్నాం.

    ReplyDelete
  2. amaanushamaina charya...
    aa tallidandrulaku kolukone saktinivvaalani aa bhagavantuni praarthistunnaa...@sri

    ReplyDelete
  3. Udhayam ee post choosinapudu naaku asalu vishayam theliyadandi. Meeru raasinadi chadivi baadha paddaananthe. Ippude "Sakshi" lo news choosanu. Ilaati dhurmaargulu koodaa unnaara ee prapanchamlo anipisthondi. Kroora mrugaale nayam kadandi manusha roopaallo thirige ee raakshasula kannaa?? Aa thallidandrulu yentha kshobha paduthuntaaro.. ... bhagavanthuni vodaarpu, thvaragaa kolukogalige shakthi vaariki prasaadimchamani praardisthunnaanu.

    ReplyDelete
  4. ఎవరయ్యా చెప్పింది కాళ్లు చేతులు నరికే కటిన శిక్షలు వద్దని,మనుషులలో రాఖ్షసులు ఉన్నంత కాలం ఈ శిక్షలు ఉండి తీరాలి.బ్రతికున్న రాఖ్షసులకు భయం కలిగేంతగా అవి ఉండాలి.

    ReplyDelete
  5. అటువంటి రాక్షసులు సంచరిస్తున్న ఈ లోకంలోజరిగిన ఉపద్రవానికి ఆ తల్లితండ్రులకు ఈ శోకాన్ని తట్టుకునే మానసిక స్థైర్యాన్నివ్వమని ఆ భగవంతుని ప్రార్ధించడం తప్ప యేమీ చేయలేం...

    ReplyDelete