Wednesday, October 10, 2012

పిట్టకధలు - 4 ( విధి )

మిత్రులారా! మన పాత పిట్టకధలు గుర్తున్నాయా! ఒకవేళ మర్చిపోతే లింకులివిగో...
పిట్ట కధలు -1
పిట్ట కధలు -2 (యయాతి చెప్పిన నీతి 
పిట్ట కధలు - 3

కైలాసమున పార్వతీపరమేశ్వరులు ముచ్చటించుకొను ఒకానొక సందర్భములో విధిబలీయమైనది దేవీ అని ఈశ్వరుడు చెప్పుచుండగా...పార్వతి, స్వామీ! అది సామాన్యులకు గాని మనవల్ల కానిదేమున్నది మనము తలచినచో విధికూడా తలవంచునుకదా అన్నదట!అప్పుడు శివుడు లేదుదేవీ విధిని తప్పించుట వ్రాసిన బ్రహ్మకైనా సాధ్యముకాదుసుమా అనగా పార్వతీదేవి ఉక్రోషముతో సకల చరాచర సృష్టికి శక్తినిచ్చు నావల్లకూడా కాదా అని అడుగగా మహాదేవుడు చిరునవ్వుతో కాదన్నాడట!

అప్పుడు ఆమె చేతినిచాచి భూలోకంవైపు చూపుతూ అక్కడ ఆడుతూ పాడుతూ తిరుగుతున్న ఒక పదహారేళ్ళ కుర్రవాడిని చూపించి అతని విధి ఏమిటి అని ప్రశ్నించింది. శివుడాపిల్లవాడిని చూసి పాపం అతడు కొద్దినిముషములలో పాము కాటువల్ల చనిపోవునని చెప్పాడు.పార్వతీదేవి వానిని నేనుకాపాడెదనని చెప్పి ఆపిల్లవాడినే చూస్తూవుండగా వాడు తనగుడిశలోకి వెళ్లి వుట్టిమీదున్న చద్ది అన్నం తెచ్చుకొని కంచంలో వడ్డించుకొని తినసాగాడు.అక్కడే ఓమూల చుట్టచుట్టుకొని వున్ననాగుపామొకటి అలికిడికి బెదరి అతనివెనుకగా పడగ విప్పి కాటువేయుటకు సిద్ధపడెను ఆక్షణమునే పార్వతి మనుష్యరూపంలో వచ్చి ఆపిల్లవాడిని గట్టిగా పిలిచింది.వెంటనే పిల్లవాడు అన్నం ముందునుండి చటుక్కున లేచి బయటకు వచ్చి చూడగా ఎవ్వరూ కనిపించలేదు.విజయగర్వముతో పార్వతీదేవి శివుడ్ని చూసి చూశారాస్వామీ మీరుకాదన్నది నావల్ల ఐనది అన్నది.స్వామి చిరునవ్వుతో అటుచూడుదేవీ ఏమిజరుగునో... పాము సరిగ్గా కాటువేసే సమయానికి వాడు చటుక్కున లేచివెల్లటంతో ఆకాటు అన్నం లోపడి విషపూరితమైనది తిరిగిలోపలికి వచ్చిఅన్నం తిన్న పిల్లవాడు చనిపోయాడు.పార్వతీదేవి నిర్ఘాంతపోయి మహాదేవునితో పంతమాడినందుకు తలదించుకొని మీరన్నది నిజమేస్వామీ అని ఒప్పుకొన్నదట!
* అందుకే మన పెద్దవాళ్ళు అన్నందగ్గరనుండి లేవకూడదని ఒకవేళ లేవాల్సివస్తే వేరేకంచంలో మళ్ళీ వడ్డించుకొని తినాలని అనేవారట!అంటే అప్పట్లో కరంట్ ఉండేదికాదుకదా దీపాలవెలుగులో ఏవైనా కీటకములు ,పురుగుపుట్రా పడినా కనిపించవని అలా చెప్పేవారేమో!


6 comments:

 1. చక్కటి విషయాన్ని తెలియజేసారు.

  ReplyDelete
 2. పిట్ట కథ బాగుందండి . నీతి కూడా బాగుంది .

  ReplyDelete
 3. pitta katha chaala routine ga mariya boringu ga nunadi .atulinacho krishan ippudu emi cheyudhu.arjuna ekkuvaga alochinchakunda jumppppppppppppppppp

  ReplyDelete
 4. @ కష్టేఫలేగారు, ధన్యవాదాలు.

  @ లాస్యా రామకృష్ణగారు, ధన్యవాదాలు.

  @ మాలాకుమార్ గారు, ధన్యవాదాలు.

  ReplyDelete
 5. @ తనూజ్ గారు, పిట్టకధలు అనేవి కల్పితాలు కదండీ. అయినా హరికధల్లోవి కాబట్టి మన సంస్కృతిలో భాగమేకదండీ.ఇప్పుడు హరికధలంటే కూడా తెలియనివారున్నారు వారికోసం ఇలా నాచిన్నప్పుడు విన్నవి గుర్తుచేసుకొంటున్నాను.విధిని నమ్మడం అంటే కర్మ చేయకుండటం కాదేమోనని నాఅభిప్రాయం.మీరన్నది కృష్ణుడు గీతను బోధించడు,అర్జనునుడు వినకుండా జంప్ అనా? ( కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను ) మీరు పిట్టకధలు1 లో చూస్తే ప్రారంభంలో చెప్పాను.ఇవి భక్తుల నిద్రను దూరంచేయటానికి,కొన్ని కొన్ని ప్రజలకు మంచి అలవాట్లు అవలమ్భించేలా చేయటానికి చెప్పేవారనుకున్టానండీ.
  ఇలా కూడా అనుకోవచ్చు అక్కడ ఆసమయంలో గీతను వినడం అర్జనుడి విధి అని :) ఏది ఏమైనా బోరింగ్ అనిపించినా కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారాతెలియచేసినందుకు ధన్యవాదాలండీ.

  ReplyDelete