Wednesday, October 24, 2012

దసరా(స్పెషల్ )శుభాకాంక్షలు!

మిత్రులందరికీ విజయదశమి శుభాకాంక్షలు.ఇక స్పెషల్ ఏమిటంటారా చూశారుగా పై లడ్డూలు....అవి నేనుచేసినవే.మొన్న ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రం చూశాక నాలోనేను చాలా మధనపడి ఇంగ్లీష్ రాకపోతే పోనీ కనీసం లడ్డూ చేయటం కూడా రాదాయే :( ఇది నాక్కూడా ఇజ్జత్ కా సవాల్ అని డిసైడ్ ఐపోయా.పైగా మావారిక్కూడా లడ్డూ అంటే ప్రాణం.నాగురించి మాత్రమే ఆలోచించుకోవడం స్వార్థం.ఆయన ఇష్టాన్నిపంచుకోవడం ప్రేమ.....నేర్చుకొని నేనే చేసిపెట్టడం త్యాగం...ఈవిధంగా జ్ఞానోదయమైన క్షణం, తక్షణం యూట్యుబ్ లో వెదికి లడ్డూ చేయువిధానం చూసేసి ...ఏదైనా ఒక మంచిపని చేయటానికి సంకల్పించినపుడు విజయదశమి కంటే మంచిరోజు మరేముంటుంది? ఆచరణలో పెట్టేశా...

ఇక నేను లడ్డూ చేసిన విధంబెట్టిదనిన...తలంటిపోసుకున్న జుట్టు ఎగరగా క్లిప్పు పెట్టినాను ...భళాభళి
చీరచెంగును నడుముచుట్టూ తిప్పిదోపినాను.....భళాభళీ...
ఘల్లుఘల్లుమను గాజులన్నిటిని వెనక్కి తోసినాను....భళాభళి!
ఆప్రకారంగా సిద్ధమైన నేను ఒకపొయ్యిమీద పంచదార పాకం పెట్టి,మరోపొయ్యిపై ఆయిల్ పెట్టాను.పొయ్యి కూడా వెలిగించానండోయ్.ఇప్పుడు సెనగపిండి జారుగా కలుపుకొని సిధ్ధం చేసుకున్నా.పాకం నెట్ లో చూపించినట్లు తీగపాకం వచ్చేసింది యాలకపొడి కలిపిఉంచా.కాగిన నూనెలో చట్రం పెట్టి పిండి పోశా కాస్త ఇంచుమించుగా బూందీ లాగే వచ్చింది :)దాన్ని పాకంలో వేసి జీడిపప్పు,కిస్మిస్ కలిపి లాడ్డూలా చుట్టేసుకోవడమే.

హమ్మయ్య సక్సస్ ఫుల్ గా తయారుచేసి అమ్మవారికి ముందుగా నివేదనచేసి ఆనందంగా శ్రీవారికి పెట్టాను.పైగా పొద్దున్నే వీళ్ళు లేవకముందే చేసేసా సర్ప్రైజ్ చేద్దామని :) ఇన్నాళ్ళకు మీమనసు అర్ధంచేసుకున్నా...రాబోయే దీపావళికే కాదు మీకెప్పుడు లడ్డూ తినాలనిపించినా నేనే చేసిపెడతాను అంటూ లడ్డూ ప్లేటు అందించానండి అంతే ఒక్కలద్డూ నోట్లోవేసుకోగానే ఆయననోట మాటే రాలేదండీ...బహుశా ఆశ్చర్యానందాలతో అనుకుంటా.లడ్డూ నువ్వు చేశావా అని పారిపోబోతున్న మావాడికి ప్రసాదంరా వద్దనకూడదు అంటూపెట్టా...అది తిన్నవెంటనే నేనెప్పుడూ నీకు ఇంగ్లీష్ రాదని అననమ్మా అంటూ కంటతడి పెట్టుకున్నాడు.నాకళ్లలోకూడా ఆనందభాష్పాలు.అంతలోకి ఆయన తేరుకున్నారనుకుంటా....ఏమికామెంటుతారో అని ఆత్రంగా చూస్తుంటే కళ్ళనిండా నీళ్ళతో (ఆనందభాష్పాలేనండీ) నన్ను దగ్గరికి తీసుకొని దీపావళికి చిన్ని రమ్మంది కదరా మనం వెళదాం సరేనా అన్నారు.నిన్నటివరకు చూద్దాంలే అన్నవారు ఒప్పేసుకున్నారు...ఆనందంగా అదేంటి ఎప్పుడూ రెండు తింటారుగా ఇంకోటి తీసుకోండిఅన్నా...అబ్బే చాలురా ఈరోజు మనింటికి ఎవరోకరువస్తారుగా అందరికీ నువ్వుచేసిన లడ్డూ టేస్ట్ చూపించు అన్నారు నాకళ్ళల్లో మళ్ళీ ఆనందభాష్పాలు....ఈవిధంగా ఆనందంగా దసరా పండుగ స్పెషల్ గా జరుపుకున్నామండీ....మీకందరికీ కూడా నోరు తీపిచేద్దామని.......అరె అదేంటి....అలావెళ్లిపోకండీ...తిని చూసి ఏదోకటి చెప్పండి pleezzzzzzz :) :)

21 comments:

  1. లడ్డూ లంటే యిష్టం
    వడ్డించేసెయ్యరేమి ? వచ్చితి నిదిగో !
    లడ్డా యిది ? అడ్డడ్డా!!
    పడ్డది అడ్డము గళమున పరిమళ గారూ !
    -----సుజన-సృజన

    ReplyDelete
  2. ivvala me blog tho roju navvulatho start aindi inka antha happyne annamatanice post

    ReplyDelete
  3. :)) భలే బాగున్నాయిగా మీ లడ్డులు.
    దసరా శుభాకాంక్షలు మీకు.

    ReplyDelete
  4. మీకు కూడా విజయదశమి శుభాకాంక్షలు

    ReplyDelete
  5. మీరు లడ్డూ చేసిన విధానము రమ్యముగా నున్నది.
    పెట్టిన చిత్రరాజము కూడా కనులకింపుగా నున్నది.
    విజయదశమి రోజున కలిగిన మీ విజయోత్సాహమునకు అభినందనలు.
    మనఃపూర్వక దసరా శుభాకాంక్షలు...

    ReplyDelete
  6. లడ్డూలు చాలా బాగున్నట్టే కనిపిస్తున్నాయి. కానీ,"నేనెప్పుడూ నీకు ఇంగ్లీష్ రాదని అననమ్మా", "అబ్బే చాలురా ఈరోజు మనింటికి ఎవరోకరువస్తారుగా అందరికీ నువ్వుచేసిన లడ్డూ టేస్ట్ చూపించు" ఈ కొటేషన్లే కొంచెం అనుమానాస్పదంగా అనిపిస్తున్నాయి. మీరు మరిన్ని మంచి స్వీట్లు చెయ్యాలని కోరుకొంటూ, దసరా శుభాకాంక్షలు.

    ReplyDelete

  7. మొత్తమ్మీద పరిమళం గారు
    లడ్డూ మీద ఇష్టం పెంచేసుకొని మీ వారి కోసం చేసేసారు...
    మీకు విజయదశమి శుభాకాంక్షలు...:-)...@శ్రీ

    ReplyDelete
  8. లడ్డూలు చూసేందుకు బాగానే వున్నాయే మరి :) చేసిన విధానం కుడా భళిరా బలి అన్నట్లుగా వుందే :) ఏమో మరి కాస్త అనుమానస్పదంగా కూడా వుంది :) ఏదైనా మొత్తానికి లడ్డూలు చేయటం నేర్చుకొని ఇంట్లో వాళ్ళను బలి చేసినందుకు అభినందనలు :)
    మీకు కూడా దసరా శుభాకాంక్షలు .

    ReplyDelete
  9. చాలా బాగుందండి:) మీ అందరికీ దసరా శుభాకాంక్షలండి.

    ReplyDelete
  10. @ రాజారావుగారు, అయ్యయ్యో అనుకున్నంతా అయ్యిందా :) :) ధన్యవాదాలు సర్!

    @ స్వాతి గారు థాంక్స్!

    @ జలతారువెన్నెలగారు, నిజంగానాండీ థాంక్ యూ...థాంక్ యూ...

    @ పద్మార్పితగారు,ధన్యవాదాలు.

    @ శ్రీలలితగారూ,మీరంతా ఇలా ప్రోత్సహిస్తుంటే చూడండి ఇక చెలరేగిపోనూ:) ధన్యవాదాలు.

    ReplyDelete
  11. @ కిషోర్ వర్మగారు,మీరలాంటి అనుమానాలేమీ పడకండి.లడ్డూలే కాస్త అటూఇటూగా అయ్యాయిగాని రవ్వకేసరి మాత్రం బ్రహ్మాండంగా చేస్తానండోయ్ :) ధన్యవాదాలు:)

    @ శ్రీగారు,తప్పలేదండీ :) ధన్యవాదాలు.

    @ మాలాగారు, భళిరా 'బలి ' హ హ్హ హ్హా....థాంక్ యూ.....

    @ జయగారూ,ధన్యవాదాలు :)

    ReplyDelete
  12. దసరా శుభాకాంక్షలు పరిమళం గారు :)
    మీ ప్రయోగం సక్సెస్ అయినందున నేను కూడా లడ్డూలు చేయడానికి నిశ్చయిన్చుకున్నానండి..

    ReplyDelete
  13. @ ప్రియ గారు, All the best! చిన్న రిక్వెస్టండి...దయచేసి నాగురించి మీ ఇంట్లోవాళ్ళకి చెప్పకండెం...ఇప్పుడే మాఇంట్లో యూట్యూబ్ రాకుండా బ్లాక్ చేయాలనే ప్రతిపాదనలు కుట్రలూ జరుగుతున్నాయ్ :)

    ReplyDelete
  14. గృహహింస 498A కేసన్నమాట. ప్చ్.. పాపం.

    ReplyDelete
  15. @ శంకర్ గారూ, పాపమేంటండీ.....మీరు అలా మాట్లాడకూడదు.అంత కష్టపడి చేస్తే మా మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించడం ఏ సెక్షన్ క్రిందికి వస్తుందో ఆలోచించండి :) :)

    ReplyDelete
    Replies
    1. నేను మీ వైపు మాట్లాడాననుకున్నా, మీ మనోభావాలెందుకు దెబ్బతిన్నాయి?! ఇందులో ఏదో తిరకాసు వుంది. :) మీ మనోభావాలు వాళ్ళెందుకు దెబ్బతీశారో ఓ కూర్చున్న (sitting)జడ్జితో, లేదా పడుకున్న(విశ్రాంత) జడ్జితో దర్యాప్తు జరిపించాలి. :))

      Delete
  16. లడ్డులేమో గానీ, చెప్పడం బాగుందండి,....

    ReplyDelete
  17. @ శంకర్ గారు,sorry....sorry ...నేనేదో ఇంట్లోవాళ్ళని - - -పెడుతున్నా అనుకున్నారనుకున్నా....అలా కాక ఇలా ఐతే ok :) ఇంతకూ మీరు లాయరా:)

    ReplyDelete
    Replies
    1. మీరు చెఫ్ అయినపుడు, నేను లాయర్ కాకూడదా ఏంటి? :))) ...
      తగిన క్లయింట్లు దొరికితే, అవుదామా అని ఆలోచిస్తున్నా...

      Delete
  18. @ శంకర్ గారు,All the best:)

    ReplyDelete