Wednesday, September 26, 2012

చీమ...చీమ....చీమ!

ఈగ....రాజమౌళిగారి సినిమా...తెలియనివారుండరు.ఆ సినిమాలో హీరో నాని మరుజన్మలో ఈగగా పుట్టి తన ప్రియురాల్ని ప్రొటెక్ట్ చేసుకోవడమే కాకుండా తనను చంపినా విలన్ మీద పగతీర్చుకుంటాడు.ఈ సినిమా సూపర్ హిట్ అయినా కధ మాత్రం వాస్తవానికి దూరంగా కామెడీగా అనిపిస్తుంది కదూ :) చీమ అని మొదలుపెట్టి ఈగ గురించి చెప్తున్నానని అనుకొంటున్నారా ...అక్కడికేవస్తున్నా.ఇటువంటి కామెడీనే ఈమధ్య మాఇంట్లో తరుచూ జరుగుతోంది.వింటే కామెడీయే కాని అదో పెద్ద టార్చర్.

గత నెలరోజులుగా మాఇంట్లో చీమలు వింతగా ప్రవర్తిస్తున్నాయి.అసలు సిటీకొచ్చి పన్నెండేళ్ళవుతోంది, రెండు అద్దె ఇల్లులు మారి రెండేళ్ళక్రితం సొంత ఫ్లాట్ లోకి వచ్చాం,ఎప్పుడూ  ఇక్కడా చీమలబెడద లేదు.ఇప్పుడు మొదలైంది.ఆ చీమలన్నాక ఇంట్లోకిరావా...బెల్లంచుట్టూ చేరవా..అని మీరనుకుంటున్నారు కదూ?అక్కడే వుంది  వింత! మాఇంట్లో చీమలు బెల్లం చుట్టూ చేరట్లేదండీ అన్నం చుట్టూ చేరుతున్నాయి.ఒక్క అన్నమే కాదు,ఉప్మా,దోస,
ఇంకా రవ్వ,పల్లీలు,పప్పులు మొదలైన వాటిని పడుతున్నాయి.స్వీట్స్ కాని,బెల్లం కాని, పంచదారకాని గట్టుపై పోసినా అస్సలు ముట్టుకోవటం లేదు.కావాలనే అన్నంగిన్నె పక్కన బెల్లంకోరు...స్వీట్ పాకెట్ పెట్టినా,గచ్చుమీద పంచదార చల్లినా పట్టించుకోవట్లేదు.కరెంట్ కుక్కర్ చల్లారితే చాలు మేం తినేలోపే చీమలమయం. అన్నం,పప్పు వంటివన్నీ పెద్ద పళ్ళెంలో నీళ్ళుపోసి వాటిమధ్య పెట్టుకుంటున్నాం.అన్నీ ప్లేసులు మారుస్తూ దాచుకోవాల్సి వస్తుంది. అన్నం దొరికిందా సరే లేకపోతె కబోర్డ్ మూలల్లో సిమెంట్ తోడేస్తున్నాయి. మందుచల్లినా,గోడవారలు పసుపు ఉప్పు కలిపి చల్లినా ఎన్నిచేసినా ఎక్కడ్నించి వస్తాయో తెలీటంలేదు.బారులు తీరి అలా దండులా వస్తుంటే నిజంగానే అవి నామీద పగపట్టాయేమో అనిపిస్తుంది.ఒకవేళ దాని పార్ట్ నర్ ని చూసుకోకుండా వేడి వేడి అన్నం కాని మీదవేసి చంపేశానేమో అని!అందుకే దాని దండుతో సహా దండెత్తి వస్తుందేమో :) ఇంకా నయం దానికి ఏ సమంతా లాంటివారో  ట్రైనింగ్ ఇచ్చి ఉంటే నా గతి ఏమి ఉండేదో కదా :(  :(

# నేనూ సుదీప్ రేంజ్ లో బాగా ఆలోచించి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోతున్నా పెస్ట్ కంట్రోల్ వాళ్ళని పిలిచి వాటిని ఫినిష్ చేస్తా హ్హ హ్హ హ్హా ....

13 comments:

  1. మరి మా ఇంట్లో అయితే మసాలా చీమలు......:)
    ఎండుమిరపకాయలకి, ఉప్పుకి, ధనియాలకి పడుతున్నాయి.

    ReplyDelete
  2. అలా చేసేముందు రాజమౌళిని అడగండి, మరో సినిమా తీస్తాడేమో :)

    ReplyDelete
  3. పరిమళం గారు... ఏదో చేసారు, ఏదో చేసారు, గుర్తు తెచ్చుకోండి.. అలా అన్నం చుట్టూ చేరి మీకేదో సందేశం ఇస్తున్నాయి చీమలు. ఔరా రాజమౌలి గారు! ఎంత పని చేసారండి ఆ ఈగ సినిమా తీసి.....ఈగలను, చీమలను చూసి దడుచుకుని చస్తున్నాము కదా... :)))

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. @ ప్రేరణ గారు! అయ్యబాబోయ్ మాచీమలే నయమండీ :)

    @ నాగార్జునగారు! ఇంకో సినిమానా....బాబోయ్ :) ఇప్పుడు పెస్ట్ కంట్రోల్ వాళ్ళచేత చంపిస్తే మళ్ళీ అవి ఏ రూపంలో పుట్టి పగపడతాయోన్న భయం మొదలైంది నాకు :)

    @ శ్రీలలిత గారు :) :)

    @ జలతారు వెన్నెలగారు! ఎదోచేసే ఉంటానండి :) నేనుకూడా మైక్రోస్కోప్ కొనుక్కుని అవేమైనా సైగలు చేస్తున్నాయేమో చూసి వాటి సందేశం అర్ధంచేసుకోవటానికి ప్రయత్నిస్తాను.రాజమౌళిగారే అంటే మీరింకా భయపెట్టేస్తున్నారు :)

    ReplyDelete
  6. హహ్హహ్హ... ఈగకైతే సమంత weapons చేసిచ్చింది....చీమకి weapons కూడా అవసరం లేదు...కుట్టేస్తాయ్... జాగర్త పరిమళం గారు :)

    ReplyDelete
  7. హహహహ ఇవేవో స్పెషల్ స్పీషీస్ అయి ఉంటాయండీ :))

    ReplyDelete
  8. @ మాలాగారు,థాంక్స్!

    @ కావ్యాంజలిగారు,ఆసేవా అయ్యిందండి :(

    @ వేణుశ్రీకాంత్ గారు,అలాగే ఉన్నాయండీ :) :)

    ReplyDelete
  9. raja mouli gariki chance lukunda mere (chima chima) ane cinema thiyandi.

    ReplyDelete