Wednesday, September 15, 2010

అసలామె కన్నతల్లేనా ...


అమ్మ....ఈ పేరు తలచుకోగానే ఒళ్ళు పులకరిస్తుంది. తానెంత కష్టపడినా తెలియనీయక బిడ్డను మాత్రం ఒడిలో చేర్చుకొని జీవితాంతం సేదతీరుస్తుంది.పారాడే వయసునుండి కంటికి రెప్పలా కాపాడుతుంది.బడిలో మాస్టారు కొట్టినా ...ఆటల్లో తోటిపిల్లలు కొట్టినా తానేల్లి కొట్లాడుతుంది. తెలీక ఏదైనా తప్పు చేస్తే ఒక దెబ్బ వేసి ...తిరిగి తానే తనవి పాపిష్టి చేతులని తిట్టుకొంటూ అక్కున చేర్చుకొంటుంది.అమ్మగురించి ఎపుడో విన్నాను ...ఇంట్లో రెండు ముద్దల అన్నం మాత్రమే ఉంటే ...చెరొక ముద్దా తిందాం రారా అని తండ్రి అంటాడట ! అదే అమ్మైతే నాకు ఆకలిగా లేదు నాన్నా అంటూ ఆ రెండు ముద్దలూ గోరుముద్దలుగాచేసి బిడ్డకు తినిపిస్తుందట !అదీ అమ్మ మనసు !

ప్రపంచం లోని రిలేషన్స్ లో చెడ్డ తల్లి మాత్రం ఉండదని అంటారు.అందుకే మాతృదేవోభవ అంటూ తొలి గురువుగా అంత గొప్ప స్థానాన్ని అమ్మకిచ్చాం. అటువంటి అమ్మ స్థానంలో ఉండి కన్నా బిడ్డను దారుణంగా కొట్టి హింసించిన తల్లిని నిన్న న్యూస్ చానెల్ లో చూశాను.అసలు మానవ జాతిలో పుట్టిన ఎ మనిషీ చేయలేనంత హేయమైన పని చేసిన ఆమె పేరు నాగ చైతన్య అట ! పాప పేరు నర్తన !ఐదారేళ్ళు ఉంటాయేమో...బందీలుగా దొరికిన శత్రు సైనికుల్నిహింసిస్తారని విన్నాను కాని ఇంతకంటే దారుణంగా మాత్రం చెయ్యరు. బ్లేడుతో కోసి , చువ్వతో కాల్చి , కాలితో తన్ని ...గాయాలతో హాస్పటల్ లో పడి ఉన్న పాపను చూస్తె నాకు కన్నీళ్ళ పర్యంతమైంది .అసలామె పాపని కన్నతల్లేనా అన్న అనుమానం వస్తుంది .

మాతృత్వం ఒక వరం!అది పొందగలిగిన స్త్రీ జీవితం ధన్యంఅంటారు.కాని ఇటువంటి తల్లిని ఎవ్వరూ ఎక్కడా చూసి ఉండరు . శరీరంపై కనిపించే ఘోరమైన గాయాలే కాదు ...గుండెకు బలమైన దెబ్బ తగిలి , లివర్ కు గాయమై ఇంటర్నల్ బ్లీడింగ్ అయి పాప ప్రాణాపాయ స్థితిలో ఉంది.కన్న బిడ్డను ఇంత క్రూరంగా హింసించిన తల్లికి ఏం శిక్ష వేస్తారో తెలీదు కాని నిజానికి న్యాయ స్థానం విధించే శిక్ష అది ఉరి ఐనా తక్కువే ...ఆమెను క్రూర మృగాలకు ఆహారంగా వేయాలి .
న్యూస్ చూసిన కొందరు పాపను ఆదుకుంటామని , మరికొందరు దత్తత తీసుకుంటామని వస్తున్నారట ! ఒకవేళ పాప శారీరకంగా కోలుకున్నా తన మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ..అది ముందు ముందు తన భవిష్యత్తుకి ఎటువంటి చేటు తెస్తుందో ఆలోచిస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది. ఏది ఏమైనా నర్తన త్వరలో కోలుకోవాలని ...ఆమెకి మంచి మనుషుల నీడలో చక్కటి భవిష్యత్తు ఏర్పడాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నాను.

21 comments:

  1. పర్వర్ట్ లు ఎక్కువ అయ్యారు ..వి కాంట్ పీక్ ఎనీ థింగ్

    ReplyDelete
  2. ట్రీట్మెంట్ నర్తన వాళ్ళ అమ్మ కి చేయించాలి
    ఇలాంటి హేయమైన సంఘటనలు జరగకుండా

    >>ఒకవేళ పాప శారీరకంగా కోలుకున్నా తన మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో
    ఊహించుకుంటేనే భయం వేస్తుంది

    ReplyDelete
  3. పైగా ఆవిడగారు ఉపాధ్యాయిని కూడాట...సిగ్గుచేటు

    ReplyDelete
  4. ఇది చిన్న సంఘటనే. కిందటి నెల ఒకామె ఇలాగే తన అక్రమసంబంధం కోసమని కన్నకొడుకుని చంపేసిందని వార్త వచ్చింది. మనకు నచ్చినా నచ్చకపోయినా కొద్దిమంది తల్లులలో మార్పొస్తున్నది.

    ReplyDelete
  5. ఆవిడని అడవి మృగాలకి ఆహారంగా వెయ్యాలి...నిజమే...అదే కరెక్టు..ఇలాంటివాళ్ళని ఏం చేసినా అది ఎంతమాత్రం పాపం కాదు..పుణ్యం..

    ReplyDelete
  6. ఇటువంటి అమ్మలకి తాలిబన్లు విధించేటువంటి శిక్షలు విధించాలి.కోర్టు లు,కేసులూ కాదు. టివి లో ఆపాపని చూస్తే చాలా జాలేసింది .పాపం బందువులు కుడా ఎవ్వరూ రాలేదంట చూడటానికి ,నాన్న ఉన్నా రాలేదంట.

    ReplyDelete
  7. ఇలాంటి పనులు మగవాళ్లు కూడా చేస్తారు. ఓ తండ్రి తన రెండవ భార్య కొడుకుకి ఆస్తి కట్టబెట్టడానికి మొదటి భార్య కొడుకుపై హత్యాప్రయత్నం చేసాడు. ఇప్పుడు ఆడది ఇలాంటి పని చేసింది కాబట్టే మీడియావాళ్లు ఇంత వార్త చేసారు. మన జర్నలిస్ట్ రాము గారికి తెలుసు, ఈ వార్తల వెనుక ఉన్న మతలబు ఏమిటో.

    ReplyDelete
  8. ippudu aa paapa ki ela undi ekkada undi telusaa andi?

    ReplyDelete
  9. మళ్ళీ మార్తాండ అసందర్భ ప్రలాప కార్యక్రమం మొదలు. నేరాల్లో కూడా ఆడా-మగా ఏంటి ? నా బొంద !

    ReplyDelete
  10. తండ్రి ఇలాంటి పని చేస్తే ఆ వార్తని టివిలో చూపించరు. తల్లి ఇలాంటి పని చేస్తే ఆ వార్తని టెలీకాస్ట్ చేస్తారు. ఇందులో gender bias లేదంటారా?

    ReplyDelete
  11. మనిషి మృగం గా పరిణామం చెందుతున్నాడనటానికి ఈ సంఘటనే పరాకాష్ట !
    ఈ పరిణామ దశలో మగవాళ్ళు ముందుంటే ..ఆ తరువాత స్త్రీలు -అంతే తేడా.
    మానవ జాతి సాంకేతికం గా అబివృద్ధి చెందుతూ ..రోజు రోజు కి మానసికం గా దిగజారిపోతుంది .
    నర్తన తొందరగా కోలుకోవాలని ..ఆమె తల్లి కి ఉన్న మానసిక రుగ్మత నుండి తొందరగా బయటకి రావాలని కోరుకుంటున్నాను .

    ReplyDelete
  12. ఇందులో లింగవిచక్షణ ఏముందో నా మట్టిబుఱ్ఱకి అర్థం కావడం లేదు. నువ్వసలు టీవీ ఎప్పుడైనా చూస్తావా మార్తాండా ? నిజంగా చూస్తే ఇలా వ్యాఖ్యానిస్తావా ? మన మీడియా అన్ని రకాల వార్తల్నీ సవివరంగా ప్రసారం చేస్తూనే ఉంది.

    ReplyDelete
  13. ఆ పని ఎవరు చేసినా తప్పే .ఆమె విడాకులు తీసుకుంది ,ఇంకొకరితో వుంటుంది .పాపకు ఇంత జరిగినా ఆ పాప తండ్రి రాలేదంటే ఆ తండ్రికి భాద్యత లేదా ?ఆ పాప తండ్రికి తెలియకుండా ఈ సంగటన జరిగిందంటే నేను నమ్మను .ఈ ఘోరానికి పాప తల్లిని ,తండ్రిని ఇద్దరినీ భాద్యులను చేస్తూ ఇద్దరికీ సమాన శిక్ష వెయ్యాలి.

    ReplyDelete
  14. మనుషుల మధ్య సంబంధాలు ఎలా దిగాజారిపోతున్నాయో అన్న దానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. మన వ్యవస్తలో అనైతికత్వం , అసాంఘీక బందాలపట్ల వ్యామోహం పెరిగిపోతున్నాయి. వాటిని నియంత్రిచినపుడే ఇలాంటి సంఘటనలు జరుగవు. వీటికి ప్రభుత్వం విధించే శిక్షలు ఏమాత్రం పనికిరావు.మనుషులకు బంధాలపట్ల ఉండే నిబద్దత, వివాహం పట్ల గౌరవం కలిగితేనే ఇలాంటివి దూరం చేయగలం.

    ReplyDelete
  15. దారుణం... ఇలా ఎలా ప్రవర్తించగలరో అర్థం కాదు. పిల్లలని కొట్టాలని ఎలా అనిపిస్తుందో.. అందులోనూ కన్న బిడ్డని! మీరు చెప్పినట్లు ఆవిడని ఉరి తీయాలి.

    ReplyDelete
  16. విడాకులు తీసుకున్న భార్య కొత్త ప్రియులతో కలిసి చేసే అన్ని నేరాల్లోను మాజీభర్తకు కూడా సమాన వాటా, సమాన శిక్షలూ ?

    ఐడియా అదిరింది.

    ReplyDelete
  17. మానవత్వం మరుగుగున పడిపోయి మృగత్వం రాజ్యమేలిన వేళ పెల్లుబికిన నా ఆవేదనకు, మేమున్నామంటూ పాలు పంచుకున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు!

    ReplyDelete