Wednesday, September 1, 2010

నా నేస్తం పుట్టినరోజు !!

ఎవరా అనుకుంటున్నారా ...ఇంకెవరు ? మన కన్నయ్యే ...చిన్నప్పటినుండి అంటే సరిగా ఊహ తెలియనప్పుడు అమ్మమ్మ కొంగువెనక నుండి తను పూజచేయటం చూస్తున్నప్పట్నుంచీ కృష్ణయ్య నాకునేస్తం మరి !
కలువలవంటి కన్నులున్నవాడు
తలపై నెమలిఫించమున్నవాడు
వేణుగాన లోలుడు
రాధా మానసచోరుడు
చెలువల వలువలు దోచుకెళ్ళినవాడు
గీతార్ధసారం బోధించినవాడు
తల్లి, తండ్రి, పతియు, గతియు
గురువు, దైవమూ.. అన్నీ తానైన
నా కన్నయ్యకు .....
పుట్టినరోజు జేజేలు !!

మాయింట కృష్ణాష్టమి !


ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు .....బుజ్జిగా ఉన్నాయని సందేహం వద్దు బ్రహ్మ కడిగిన పాదాలివే ....రాధకు నీవేర ప్రాణం ...రాధా హృదయం మాధవ నిలయం !ననుపాలింపగ నడచి వచ్చితివా ....కర్పూర హారతులియ్యరుగా .....కొలువై ఉన్నాడే.... దేవదేవుడు !!


24 comments:

 1. మొదటి ఫోటో సింప్లీ సూపర్బ్...మిగతావి కూడా బాగున్నాయి..ప్రతీ ఫోటో ఆ కన్నయ్య మీద మీకున్న అనురాగం చెబుతున్నాయి...

  ReplyDelete
 2. భలె ఉన్నాడండీ మీ కన్నయ్య!!
  కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

  ReplyDelete
 3. paayaasamto noorooristunnaaru.

  ReplyDelete
 4. మీనేస్తం చాలా బాగున్నాడండి .
  శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు .

  ReplyDelete
 5. మీకు మీ కుటుంబానికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు

  ReplyDelete
 6. Chala chala bugunnayi photos....krishna idol chala bagundi...

  ReplyDelete
 7. చాలా బాగున్నాయండి ఫోటోలు .కన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

  ReplyDelete
 8. అసలీ కన్నయ్యకు భయం లేకుండాపోయింది...కనపడ్డ ప్రతివాళ్లను సమ్మోహితులను చేసి తనవైపుకు తిప్పుకుంటున్నాడు. ఇంత మాయాజాలం ఎక్కడ నేర్చాడొ!!

  కృష్ణాష్టమి శుభాకాంక్షలు పరిమళంగారు

  ReplyDelete
 9. పరిమళం గారు భలే బాగా కన్నయకు పుట్టిన రోజు జరిపారు చాలా బాగున్నాయ్ పొటొస్ :)

  ReplyDelete
 10. మీ పుట్టినరోజు చెలికానికి, మీకు కూడా శుభాకాంక్షలు

  ReplyDelete
 11. ఆ నల్లని కన్నయ్యను కనలేని కనులుండవని...బాగా చూపించారు.

  ReplyDelete
 12. పరిమళ గారు! మీరు కూడా కన్నయ్య అభిమానులేనా...
  భావన గారు, శ్రీ లలిత గారు కూడా కన్నయ్య మీద పోస్టులు పెట్టారు.
  మీ ఇల్లు బాగుంది. మీ పూజ కూడా బాగుంది.

  ReplyDelete
 13. భలె ఉన్నాడండీ మీ కన్నయ్య!!
  మీకు మీ కుటుంబానికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు

  ReplyDelete
 14. photos chaala bhaagunnayi,mee illu chaala bhaagundi.anni krishnudikenaa,pujaku vachhina maaku?

  ReplyDelete
 15. చాలా బాగా చేసేరు కన్నయ్యకు అలంకరణ. ముద్దొచ్చేసేడు.వుయ్యాలలో ఎంత ముద్దు గా కూర్చున్నాడో. బుజ్జి కన్నయ్య బుడి బుడి అడుగులతో గుమ్మందగ్గరకు వస్తే తలుపువేసి వుంచారట కదా, నాతో కంప్లెయింట్ చేసాడు మరి.. చూసుకోండి.:-)

  ReplyDelete
 16. మీ బ్లాగ్ చాలా బావుంది పరిమళం గారూ.....ముఖ్యంగా మీ పరిచయం లోని నిరాడంబరత,భావుకత ఆకట్టుకున్నాయి.

  ReplyDelete
 17. వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం
  దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం .

  మీ స్నేహితుడు గురువులకే గురువు ఆయనని స్నేహితుడిగా భావించిన మీరు తప్పకుండా అందరికి గురువుగా ఉండాలి.
  సరదాకి ఏమి అనుకోకండి.

  ReplyDelete
 18. @ శేఖర్ గారూ ! కన్నయ్యంటే ప్రేమలేనిదేవరికండీ....అందరి మనసులూ దోచేస్తాడు మరి ! ధన్యవాదాలు.

  @ నీహారిక మీక్కూడానండీ :)

  @ రిషి గారు థాంక్స్ !

  @ మాలాగారు , మీక్కూడా జన్మాష్టమి శుభాకాంక్షలు!

  @ విజయమోహన్ గారూ ధన్యవాదాలండీ....

  ReplyDelete
 19. @ కవితగారు, థాంక్సండీ

  @ కొత్తపాళీ సర్ ! ధన్యవాదాలు.

  @ రాధికగారు, ధన్యవాదాలు.

  @ నాగార్జునగారు, జగన్నాటక సూత్రధారి కదండీ ...ధన్యవాదాలు.

  @ నేస్తంగారు థాంక్స్ !

  ReplyDelete
 20. @ శ్రీలలిత గారు, ధన్యవాదాలు అలాగే మీకూ శుభాకాంక్షలు.

  @ జయగారు , ధన్యవాదాలండీ

  @ శిరీష గారు, థాంక్స్ :)

  @ సవ్వడి , అవునండీ మా అమ్మమ్మ కృష్ణ పూజ చేసేవారు చిన్నప్పట్నుంచీ ఇష్టం కాకపొతే మిగతా దేవుళ్ళపట్ల ఉండే భయమూ ,భక్తీ ఉండవెందుకో ...స్నేహితుడిలా అనిపిస్తాడు కన్నయ్య !మా ఇల్లు , కన్నయ్య నచ్చినందుకు థాంక్స్ !

  @ రాజిగారు , మీకూ శుభాకాంక్షలండీ ...

  @ గాజుల, కన్నయ్యకు ఇష్టమైనవి పెట్టాం కదా ఇక మనకేం మిగలనిస్తాడు చెప్పండి :) ధన్యవాదాలు

  ReplyDelete
 21. @ భావనగారు, మీతో అలా చెప్పాడా తలుపు వెనక దాగి ఉండి తనచేత బ్రతిమాలించుకొనే సత్యభామనయ్యానని చెప్పలేదా ...బహుశా సిగ్గుపడ్డాడేమో....ఐనా తనమీద కంప్లైంట్లు ఆరా తీస్తానని నామీద చెప్పినట్టున్నాడు.ఇప్పుడిక యశోదనై చెవి మెలేస్తా ఉండండి :) :)

  @ మల్లిగారు , ఇదే మొదటిసారనుకుంటా నా బ్లాగ్ కి రావటం...వచ్చినందుకు...నచ్చినందుకు కృతజ్ఞతలు.

  @ vajasaneya, మీరన్నట్టు ఆయన జగద్గురువేనండీ...కాని ఈ జన్మకైతే నేనెవరికీ గురువును కాదండీ బాబూ :) :)వచ్చే జన్మలో ఐనా మీ వాక్కు ఫలించాలని నేనూ కోరుకుంటా :) :) ధన్యవాదాలు.

  ReplyDelete
 22. meee inti photo adirindi

  ReplyDelete