Sunday, January 31, 2010

రంగుల కళ !!


మాయా బజార్ నిజంగానే ఒక మాయ ! చూస్తున్నంతసేపూ మనల్ని మెస్మరైజ్ చేసే మహాద్భుతం !భారతంలో లేని శశిరేఖా పాత్రను సృష్టించి ఆమె చుట్టూ అల్లిన కాల్పనిక గాధ !అంతే కాదు ఎక్కడా పాండవులు కనిపించని(కల్పిత)భారత ఘట్టం1957 వ సంవత్సరంలో తీసిన ఈసినిమా ఇప్పటికీ ఒక అద్భుతమే !అటువంటి సినిమాని నలుపుతెలులో నుండి రంగులద్దుతున్నారని తెలిసి ఎప్పుడు రిలీజవుతుందాని ఎదురుచూసి మరీ నిన్న చూసేశాను.

మాయాబజార్ గురించిన కధ , తెరవెనుక కధతో సహా ఇక్కడ రాసేశారు రంగుల మాయ..
కాబట్టి నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే రంగులద్దటంలో గోల్డ్‌స్టోన్ టెక్నాలజీస్ వారు కృతకృత్యులయ్యారనే చెప్పొచ్చు .చిత్రంలోని" లాహిరి లాహిరి "పాటలో వెన్నెల నీడల్ని సైతం అందంగా చూపించారు .ఈ సినిమాలో హైలెట్ సావిత్రిగారనే చెప్పుకోవాలి .బ్లాక్ &వైట్ లోనే ఎంతో అందంగా కనిపించే ఆమె రంగుల్లో మరీ అందంగా కనిపించారు .అసలు ఆవిడ అలవోకగా తలతిప్పి కనురెప్పలల్లార్చి , చిరునవ్వు నవ్వితే చాలు ఎంతవారలైనా ఆ అభినయానికి దాసోహమనవలసిందే !

ఘటోత్కచుని పాత్రలో ఎస్.వి రంగారావుగారికి ఇప్పటికీ ఎంత ఫాలోయింగ్ ఉందో థియేటర్లో పడిన ఈలలు , చప్పట్లే సాక్ష్యం .అలాగే రమణారెడ్డి గారి కామెడీకి ఏమాత్రం ఆదరణ తగ్గలేదు ."సుందరి నీవంటి దివ్యస్వరూపము "రేలంగిగారి పాటకు కూడా హాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది .ఈ సినిమాకి పెద్దా ,చిన్నా తేడా లేకుండా ,ఇంకా వారి చిన్న పిల్లల్ని తీసుకొచ్చి చూపిస్తున్న వారిని చూసి నాకెంత సంతోషంవేసిందో మాటల్లో చెప్పలేను .ఇటువంటి మంచి సినిమాల్ని ప్రజలు ఆదరిస్తే మరిన్ని ఆణిముత్యాల్ని రంగులలో మనముందుకు తెచ్చే సాహసం చేస్తారు.అలాగే ఈ తరం పిల్లలకూ పాండవులు ఐదుగురని , కౌరవులు నూర్గురని ....రామాయణ , మహాభారతాల పట్ల బేసిక్ నాలెడ్జ్ ఏర్పడుతుంది .ఈమధ్య చాలా టీవీ షోల్లో పిల్లల సమాధానాలు చూస్తుంటే బాధ కలుగుతుంది .

ఇక ఈసినిమాలో కృష్ణుని పాత్ర రంగు , ధరించినమాల కొంత డల్ గా అనిపించాయి.ఐతే ఎన్ .టి రామారావుగారి చిరునవ్వు , హావభావాలు యధావిధిగా మన మనసుల్ని దోచుకుంటాయి. ఆద్యంతం కామెడీ పిల్లలనుండి ,పెద్దలవరకూ ఎంజాయ్ చేస్తాం.ఐతే నన్ను నిరాశపరచిన విషయం "చూపులు కలిసిన శుభవేళ "పాటను ఇంకా అక్కడక్కడా కొంత భాగాన్ని కట్ చేసేయడం ! చిత్రం నిడివి తగ్గించే ప్రయత్నంలో అలా జరిగి ఉండొచ్చు కధాపరంగా ఎక్కడా ఆలోటు కనిపించదు .రంగుల మాయాబజార్ పాత సినిమా ప్రియులనే కాదు ఈతరం యూత్ ని కూడా ఆకట్టుకుంటుందని ఆశిద్దాం.మరి సెలవురోజు ప్రోగ్రాం కన్ఫర్మ్ అయిందా :) :)

17 comments:

  1. నాకు నిన్న పోవాలనే అనిపించింది. కానీ నా ఫ్రెండ్స్ బ్లాక్ అండ్ వైట్ లోనే అలాంటి సినిమాలు బాగుంటాయి..పైగా కొత్త దానిలో కొన్ని చోట్ల రంగులు తేలిపోతున్నాయి..మొఘల్ ఏ అజమ్ సినిమాకి రంగులద్దటం లాగా ఇది లేదు అని చెప్పటంతో అందరం ఆగిపోయాము. నాకైతే చూడాలనే అనిపించింది.

    ReplyDelete
  2. పరిమళం గారూ కుశలమా!ఆపాత మధురాలైన ఆ పాత చిత్రరాజాలగురించి ఎంత వర్ణించనా సరిపో(ల)దు.తొలకరి చినుకు తాకిన మట్టివాసన ..ఎలా ప్రకటించగలం? అనుభవించి పలవరించడమే తప్ప....అప్పుడప్పుడైనా ఈ మీ అభిమానులని మరవబోకు సుమా!
    సదామీ స్నేహాభిలాషి
    రాఖీ

    ReplyDelete
  3. MAAYA BAJAAR GURINCHI MEERU BLOG LO VEDAJALLINA RANGULU, AKSHARAALAA PARIMALINCHAAYI..NENARULU.

    ReplyDelete
  4. ఏదో మొక్కుబడిగా కాకుండా స్కోప్ & dts లోకి మార్చి శ్రద్దగానే చేసినట్లున్నారండీ. తక్కువ ప్రాంతల్లో రిలీజ్ అవడంతో మా లాంటి వాళ్ళు ఇంకా ఎదురు చూడాల్సొస్తుంది.

    ReplyDelete
  5. ఐతే రంగుల్లో చూడచ్చంటారా ? ఏమో నాకైతే మనసుకు నచ్చటం లేదు . ధైర్యం చేయాలి అనుకుంటున్నాను మరి ఏమో ?

    ReplyDelete
  6. నేను కూడా చూశాను ,.. రంగులలోకి మార్చడం బాగానే ఉంది కానీ మనకు బాగా నచ్చే సన్నివేశాలను కత్తిరించడం వల్ల అంతగా మురిపించలేదు.

    నాకు ఎంతగానే నచ్చే 'మోహినీ భష్మాశూర' సన్నివేశం లేకపోవటం చాలా నిరాశ పరిచింది.

    ఇక మన యెస్.వి. రంగారావు , రేలంగి తెరపై కనపడ్డప్పుడు ఈలలు,చప్పట్లు మామూలే!!!

    ReplyDelete
  7. చాలా సంవత్సరాలయింది సినిమా చూసి...ఇప్పుడు నాకిష్టమైన సినిమా రంగుల్లో..ఆహా.. తప్పక చూడాల్సిందే మరి!

    ReplyDelete
  8. రంగుల బజార్ మా దగ్గర రిలీజ్ కావట్లేనట్లుదండి. ప్చ్. మిమ్మల్ని చూస్తే జెలసీగా వుంది.

    ReplyDelete
  9. వచ్చెసిందా రంగుల మాయాబజార్ ..అయితె ముందుగా అర్జెంట్ గా నాన్నను అడగాలి చూసారో లేదో ,,ఆయన చిన్నప్పడు అనేవారు మాయామజార్ కలర్లో చూడాలి భలే ఉంటుంది అని.. :)

    ReplyDelete
  10. పరిమళం గారూ చక్కగా వర్ణించారు, నాకూ చూడాలని ఉందండి రంగుల మాయాబజార్ !!

    ReplyDelete
  11. అసలీమధ్య థియేటర్ కి వెళ్ళి తెలుగు సినిమా చూడడం అలవాటు పోయింది. ఈ సినిమా గురించి విన్నప్పట్నించి వెళ్ళాలనే అనుకుంటున్నాము. మీ టపా చూసాక ఎంత తొందరగా వెడదామా అనిపిస్తోంది..

    ReplyDelete
  12. చూసేశారా.. నేను వెనుకబడ్డానన్న మాట.. అందరూ బాగుందనే అంటున్నారండీ..

    ReplyDelete
  13. నేను ఖండిస్తున్నానండి. నేను వ్రాద్దాం అనుకునేలోగా మీరే వ్రాసేసారు.
    అయినా సరే నేను కూడా వ్రాస్తాను.

    ReplyDelete
  14. నిడివి తగ్గించటానికి కాదండీ... ఒరిజినల్ ఫిలిం నెగటివ్ అక్కడక్కడా పాడయిపోవటం వలన అలా కొన్ని సన్నివేశాలు, పాటలు తొలగించవలసి వచ్చిందట!

    ReplyDelete
  15. నాకూ రంగుల మాయాబజార్ థియేటర్లో చూడాలని ఉంది. కానీ..కుదరదుగా ఇక్కడ :( :(

    ReplyDelete
  16. మా ఊరిలో ఈ వారంతం రిలీజ్ అవుతుందండి. అపుడు తప్పక చూస్తాము.

    ReplyDelete
  17. ప్రోగాం ఫిక్స్ అయింది కానీ టికెట్స్ దొరకలేదుగా:(

    ReplyDelete