Sunday, September 27, 2015

అంతటా నేనే !


నేను రాసే లేఖలు మోసుకొచ్చేది కాలమే 
సూర్యుడు చంద్రుడు తపాలా బంట్రోతులు 
నీ చుట్టూ నిండిన  చీకటి వెలుగులు.. అవి.... 
నా ఆనవాళ్ళు....  నా పలకరింతల నకళ్ళు 
రాత్రి కురిసే వెన్నెలంతా  నా కలవరింతే 
అమావాస్య రోజు  నక్షత్రాలు నా అక్షరాలే 
వర్షపు రాత్రి చినుకులన్నీ నా కన్నీటి చుక్కలే 
సాయంసంధ్యలన్నీ నా ఎదురు చూపులే 
నానుంచి దాక్కోవాలంటే నువ్వు......  
చీకటి వెలుగులు లేని చోటు వెతుక్కోవాలి 
దొరుకుతుందా మరి ఆ చోటు నీకు?

4 comments:

  1. నానుంచి దాక్కోవాలంటే నువ్వు......
    చీకటి వెలుగులు లేని చోటు వెతుక్కోవాలి..Nice

    ReplyDelete
  2. చక్కని ఆలోచన .ఇంకా చక్కని భాష .చాలా బాగుందండి .

    ReplyDelete