Sunday, March 18, 2012

అబ్బాయిల్ని పొగడాలంటే ......?


శిశిరంలోంచి వసంతంలోకి వచ్చేశాం ...నేనూ బాధ్యతల సుడిగుండంలోనుంచి ఒడ్డున పడిపోయా .రావటం రావటమే సందేహాన్ని వెంటబెట్టుకు వచ్చానని అనుకుంటున్నారా :) ఇది నాకు చాలా ఏళ్ళ నుండీ బుర్ర తొలుస్తున్న సందేహమే !
అమ్మాయిల్ని బుట్టలో వేయడానికి అతి సులువైన దారి పొగడ్తే అని చాలా మంది అదే ఫాలో అయిపోవడం చూశాను. అదిగో సరిగ్గా అప్పుడే నాకు ఈ సందేహం పుట్టుకొచ్చింది. అమ్మాయిల్ని పొగడాలంటే ...
* చిలిపితనం జాలువారే నీ సోగ కళ్ళని చూస్తూ ఉంటే అసలు టైమే తెలీదు (లోపల... ఆఫీస్ అయ్యాక ఉన్న కాస్త టైమూ నిన్ను పొగడడానికే సరిపోతుంది ఖర్మ) ఎన్ని గంటలైనా నీ కళ్ళల్లోకి చూస్తూ గడిపేయగలను.
* నువ్వు ఫక్కున నవ్వితే గుప్పెడు మల్లెలు జల జలా రాలినట్టు ఉంటుందనుకో (లోపల ....ఈమె టూత్ పేస్ట్ ఏంటో బ్రాండ్ మారిస్తే బావుండు హు ..అనుకున్నాసరే)
* మొన్న నువ్వు మాఇంటి కొచ్చి వెళ్ళినప్పటి నుంచీ మా పెంపుడు పిల్లి కొత్తగా నడుస్తోంది బహుశా నీ నడక చూసే అనుకుంటా (లోపల...దాని కాలికేదో గుచ్చుకున్నట్టుంది)
* అరె వసంతం రాక ముందే కోయిల కూస్తుందేవిటి అనుకుంటున్నా మీరు హలో అన్నారా (లోపల....వాయిస్ విని మోసపోవడం లేదుకదా)
ఇంకా ఇలాగే నీ ముక్కు చూసి సంపెంగలు సిగ్గు పడుతున్నాయ్ , నిన్ను చూసే నెమళ్లు హొయలు నేర్చాయ్ , నీ పలుకులు విని రాచిలకలు మూగపోయాయ్ వగైరా వగైరా .....చాలా ఉన్నాయి కాని అమ్మాయిలు అబ్బాయిల్ని ఎలా పొగుడుతారో ఏం చెప్తే వాళ్ళు ఫ్లాట్ అవుతారో...అవుతున్నారో .... నా మట్టి బుర్రకి తెలియలేదు ఒకవేళ 100% లవ్ సినిమాలో లాగా యు ఆర్ ది గ్రేట్ అంటూ ఉండాలా ? మీకెవరికైనా తెలిస్తే చెప్తారా ప్లీజ్ ....

16 comments:

  1. :) :)
    Good to see you after so long time. Welcome back!

    << 100% లవ్ సినిమాలో లాగా యు ఆర్ ది గ్రేట్ అంటూ ఉండాలా ?

    అంతే అంతే.. :D

    ReplyDelete
  2. హహహ! భలే ఉంది మీ సందేహం! అబ్బాయిలని నీ అంత గొప్పోడు ప్రపంచంలో లేడు, ఉండడు అంటే చాలేమో ఈ ఒక్కదానికే ఫ్లాట్ అనుకుంట! మహా అయితే ఇంకొకటి చేర్చి నీ biceps అద్భుతం అంటే చాలేమో ;)

    ReplyDelete
  3. ఒక్క క్షణం వాళ్ళ కోసమే మీరు ఉన్నారు అనిపించుకోండి.

    ReplyDelete
  4. గతం లో ఓ సారి ఓ అమ్మాయితో ఏదో మాట్లాడుతూ మీది కర్నాటకనా ? అని అసందర్భంగా అడిగాను కాదు .. ఎందుకలా అడిగారు అంది . ఐశ్వర్య రాయ్ కర్నాటకనే కదా అలానే ఉంటే అన్నాను . నవ్వి పొగడ్త అని తెలుస్తోంది కానీ వినడానికి బాగుంది అన్నారు . దురుద్దేశం లేకుండా ఎదుటి వారిని సంతోష పెట్టడానికి పొగిడితే తప్పేమిటండి . దీని పై మునిమాణిక్యం నరసింహ రావు గారు చాలా చక్కని బుక్ రాశారు... స్థుతి ....... ( పూర్తి పేరు గుర్తుకు రావడం లేదు) అని

    ReplyDelete
  5. అబ్బా! ఎన్నాళ్ళకి కనిపించారండి బాబు. మీ సందేహమేమో కాని మీరు మళ్ళీ కనిపించినందుకు మాత్రం యాపీ యాపీ గా ఉంది. పోగడాలండి బాబూ, మొగవాళ్ళని ఆడవాళ్ళ కన్నా బాగా పొగడాల్సిందే. వాళ్ళ తెలివితేటలకి పెద్ద పీట వేయాల్సిందే. ఎంతటి వారు వాళ్ళముందు పరమ దండగ అని తేల్చి చెప్పాల్సిందే:)

    ReplyDelete
  6. ammaa parimalaa garu..kallu kayalu kayadamante matram..ilaa roju eppudu mee blog open chesi post chestaaraa..ani ediri chooddame..idi bhavyamenaa..meeru blog open cheyyakapoyinaa..maa blogs kesi o chu choodocchu kadammaa..idanthaa..velithini bharinchaleka povadam...abhimanaanni anuchukoleka povadame..sumaa..ikanainaa..kaasta..maa raastaa kesi raaraadoo...
    sadaa mee snehaabhilashi raki

    ReplyDelete
  7. హేయ్! యు ఆర్ లుకింగ్ మ్యాన్లీ, నీ స్టైలే సూపర్ (కాకి పీకడానికి కూడా కండలేదు, వెలసి చిరిగిన ప్యాంట్, పొట్టి ఫిట్ షర్ట్, గుడ్డోడిలా ఆ కళ్ళజోడు అని మనసులో అనుకున్నా)....:-) అని ఒక నవ్వు విసిరి పొగిడితే!!!

    ReplyDelete
  8. ఏంటండీ మరీ స్కాన్ చేసి చూసినట్టు చెప్పేసారు..ఎన్నాళ్ళకి మీ పోస్ట్...వసంత వేళ ఓ గుప్పెడు మల్లెల పరిమళం విరజిల్లే కవితతో స్వాగతిస్తారని ఆశిస్తూ...

    ReplyDelete
  9. నాకు తెలిసినంతవరకు "యు మీన్ ఎ లోట్ టు మి" వర్క్స్.

    ReplyDelete
  10. @ మధురవాణి గారు thank you !
    @ రసజ్ఞ గారు :) :)
    @ ఫణీంద్ర గారు అవునేమోనండి..ధన్యవాదాలు.
    @ మురళి గారు " దురుద్దేశం లేకుండా సంతోషపెట్టడానికి పొగిడితే తప్పేవిటండి " అస్సలు లేదండి కాని అబ్బాయిల్ని ఎలా పొగడాలా అని :) :)
    @ జయగారు నాక్కూడా మీరంతా పలకరిస్తుంటే యాపీ యాపీయేనండి :) :)

    ReplyDelete
  11. @ రాఖీ గారు ....క్షంతవ్యులం :) మీ ఆదరాభిమానాలకు సదా కృతఙ్ఞతలు.
    @ పద్మార్పిత గారు ....హ్హ హ్హ హ్హా ....
    @ వర్మగారు, తప్పకుండానండీ...ధన్యవాదాలు.
    @ వెన్నెలగారు థాంక్స్ !

    ReplyDelete
  12. చాలా నెలలకి వచ్చారే :) అంతా కుశలమేనా ?

    ReplyDelete
  13. @ మాలాగారు ...అంతా కుశలమేనండీ :) థాంక్స్ !

    ReplyDelete
  14. ఈ నందన నామ సంవత్సరం మీ సాహిత్య నందనవనాన పరిమళభరిత అక్షరాపూల గుత్తులు వత్తుగా పూయించాలని, సుమధుర ఫలాల్ని ప్రతి బాటసారికీ అందించాలని మనసారా ఆకాంక్షిస్తూ...

    "శిశిరంలోంచి వసంతంలోకి వచ్చేశాం ..." - చాలా సంతోషం. రాత్రి ఎడం కన్ను అదరటానికి కారణం ఇదన్నమాట! "నేనూ బాధ్యతల సుడిగుండంలోనుంచి ఒడ్డున పడిపోయా" నిజంగా సాధ్యమేనా అలా, పరిమళం గారు? బారీతలోకో, మరొక రకం ఈత నేర్చుకుంటూనో సాగుతాము కాదూ? ;)

    *** మీరడిగిన ప్రశ్నకి జవాబు నా వల్ల కాదు, ఎవరినీ పొగడకే ఇలా మిగిలిపోయాను. ***

    (పోతే, రాయటం ఆపితే ఎలా ఉంటుందన్న బాధ అనుభవంలోకి నాకు మాదిరే మీకు వచ్చిందా? కనుకా, ఆ ఎడారి దాహానికి వెరతాపపడకుండా చూసుకోండి. కలకాలం ఉండే మైత్రి సాహిత్యమేగా! మీలాగా పాత మిత్రులు ఒకరొకరుగా తిరిగి వస్తుండటం చాలా సంతోషం.)

    ReplyDelete
  15. అనుభవం తో చెబుతున్నా... చిరునవ్వు మించి,అబ్బయిని పొగడ్డానికి ఏమీ అవసరం లేదు... అది వాడి ముఖాన పారేస్తే సరి...


    anyway, happy to see you back .... :)

    ReplyDelete
  16. బ్లాగులో మీరున్నారని తెలిసి పరిగెత్తుకొచ్చాను.
    కొంచెమే రాశారని తెలిసి నిరాశగా వెనుతిరిగాను .
    మరోసారి మీ రచనామ్రుతధారలకోసం ప్రయత్నిస్తాను
    ఇది పొగడ్త కాదండోయ్!

    ReplyDelete