Tuesday, November 9, 2010

రెండో పుట్టినరోజు !!


శభాష్ పరిమళం ...ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు!
ఇలా నా భుజం నేనే తట్టుకోవచ్చో లేదో కాని ఈ బ్లాగ్ మొదలుపెట్టినప్పుడు అసలు అంతర్జాలమంటే తెలీని నేను ఎప్పుడూ కంప్యూటర్ తాకి చూడని నేను ఇలా ఇన్నిరోజులు బ్లాగ్ వనంలో పరిమళాన్నో...లేక పిచ్చిమొక్కనో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నానంటే నాకే నమ్మశక్యంగా లేదు అందుకే ఆ శభాష్ !!

ఇంటి బాధ్యతలు సక్రమంగా నెరవేర్చేక్రమంలో అప్పుడప్పుడూ బ్లాగుకు చాలారోజులు దూరమైనా, టపాలు తగ్గిపోయినా...నన్నాదరిస్తూ మేమున్నామంటూ నన్ను మరువక ప్రోత్సహిస్తున్న బ్లాగ్ మిత్రులకూ.....నా టపాలనూ ఇష్టపడేవారున్నారన్న కాన్ఫిడెన్స్ ని నాలో పెంచుతున్న బ్లాగ్ ఫాలోవర్స్ కూ....ఇంకా నా టపాల్లో తప్పులు దొర్లినప్పుడు సరిదిద్దే పెద్దలకు, సరదాగా ఆటపట్టించే పిన్నలకూ ...విమర్శకులకూ అందరికీ నా వినమ్రపూరిత ధన్యవాదాలు.
బ్లాగ్ క్రియేట్ చేసి నువ్వు రాయగాలవంటూ నాచేత కీబోర్డు పట్టించి అక్షరాలు అద్దించి ఇప్పటికీ నాకు సహకరిస్తున్న నా మిత్రుడికి కృతజ్ఞతలు తెలుపుకోకపోతే ఈటపా అసంపూర్ణం!కృతజ్ఞతలు మిత్రమా !


ఇల్లాలిగా, తల్లిగా , కూతురుగా ....ఇలా అన్నిబాధ్యతలూ ...బాదరబందీల నడుమ నేనంటూ ప్రత్యేకం...నాదంటూ ఓలోకం అనుకొనే విధంగా నాజీవితంలో ఈ బ్లాగ్ ఓఅందమైన అనుభూతిని అందించింది.కొత్తకొత్త స్నేహితులనూ ఇచ్చింది.అంతే కాదు నా బ్లాగుకు నేనే రాజు,రాణి ,మంత్రి , సేవకుడు ....అన్నీఅనుకుంటే ఎంత సంతోషంగా అనిపిస్తుందో! తానొవ్వక ...అన్యుల మనముల్ నొప్పింపక ...ఈ బ్లాగ్ ఇలా ఇంకొన్నాళ్ళు సాగాలని ఆశపడుతున్నాను.

34 comments:

 1. పరిమళగారూ,
  ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు...

  ReplyDelete
 2. పరిమళానికి ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.... మరిన్ని పరిమళాలు ఇలాగే వెదజల్లాలని కోరుకుంటూ

  ReplyDelete
 3. నానుంచి వంద శభాష్ లు పరిమళ గారు!

  నేనేమో మిమ్మల్ని బ్లాగుల్లో ఓ పారిజాతం అనుకుంటున్నాను.:):)

  ఇలాగే చాలా పుట్టినరోజులు చేసుకోవాలని ఆశిస్తూ....:)

  ReplyDelete
 4. శభాష్ పరిమళం ...ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు!

  ReplyDelete
 5. పరిమళం గారూ !
  హృదయపూర్వక శుభాకాంక్షలు.

  ReplyDelete
 6. ద్వితీయ పుట్టినరోజు శుభాకాంక్షలండి!

  ReplyDelete
 7. మీ బ్లాగ్ కి జన్మదిన శుభాకాంక్షలు అండీ

  ReplyDelete
 8. wish u many happy returns of the day..
  ilaa ee parimalaalu nirantaram telugu blog lokaana virajimmaalani aasistoooo...

  ReplyDelete
 9. ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు......

  ReplyDelete
 10. పరిమళం గారు
  ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని శుభాకాంక్షలు

  ReplyDelete
 11. హపీ బర్త్ డే టు పరిమళం .

  ReplyDelete
 12. ఈ పరిమళం బ్లాగ్లోకమంతా కలకాలం ఘుమాళిస్తూనే ఉండాలి. మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రత్యేక అభినందనలు.

  ReplyDelete
 13. ఇలాగే మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ...

  ReplyDelete
 14. " తానొవ్వక ...అన్యుల మనముల్ నొప్పింపక ...ఈ బ్లాగ్ ఇలా ఇంకొన్నాళ్ళు సాగాలని ఆశపడుతున్నాను."
  చక్కగా చెప్పారు .మూడో సంవత్సరం లోకి అడిగిడుతున్న మీకు అభినందనలు .

  ReplyDelete
 15. పరిమళ గారు, మీ బ్లాగుకి ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు..:)

  ReplyDelete
 16. ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు పరిమళం గారు. ఇంకొన్నాళ్ళు కాదు ఎన్నో ఏళ్ళు ఇలాగే విజయవంతంగా కొనసాగాలని కోరుకుంటున్నాను.

  ReplyDelete
 17. ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

  ReplyDelete
 18. ద్వితీయ పుట్టినరోజు శుభాకాంక్షలండి!

  ReplyDelete
 19. పరిమళం గారూ !
  ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు!

  ReplyDelete
 20. శభాష్ పరిమళం గారూ!...ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు!!

  ReplyDelete
 21. మీ బ్లాగుకి ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు పరిమళ గారు.

  ReplyDelete
 22. పరిమళ గారు !ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు .

  ReplyDelete
 23. శుభాకాంక్షలు పరిమళం గారూ!

  ReplyDelete
 24. పుడతాయి గిడతాయి ఎన్నెన్నో...
  పురిట్లోనె సంధి కొడతాయి మరెన్నో...
  పుడమికే వన్నె తెస్తాయి కొన్ని తమదైన శైలిలో..
  "పరిమళం" సార్థక(నామధేయురాలైంది)మైంది బ్లాగ్లోకంలో..

  ద్విగుణీకృతమైన..సౌరభాలనందించాలని ఆశిస్తూ..ద్వితీయ జన్మదిన శుభాకాంక్షలతో..
  సదా మీ స్నేహాభిలాషి
  రాఖీ..

  ReplyDelete
 25. పరిమళం గారు... ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు!.

  మీ బ్లాగు నెమలికన్ను మురళి గారి ద్వార పరిచయం, కేవలం రెండు రోజుల్లో చదివేసా, కాని రెండు జన్మలకు సరిపడే భావాలతో మనస్సు నిండిపోయింది. చక్కగా చదివించ గలిగే మీ రచనా శైలి తప్పకుండా చదివించడమే కాకుండా మీరు 10 మధ్యలో ఆపేసారు అని అంటే నమ్మలేము. ఇలా మీరు మరిన్ని వార్షికోత్సవాలు జరుపుకోవాలని మరింతమంది మిత్రులను సంపాదించుకోవాలి అని కోరుకుంటున్నాను.

  రఘురామ్

  ReplyDelete
 26. ప్చ్.. నేనెప్పుడూ ఆలస్యమేనండీ :-) :-) (ఎక్కడో విన్నట్టుంది కదండీ.:):)..)
  .. విషయానికొస్తే.. రెండో పుట్టినరోజు శుభాకాంక్షలు.. అప్రతిహతంగా సాగిపొండిక..

  ReplyDelete
 27. సారీ సారీ సారీ నేను మిస్ అయ్యాను :( ఆలస్యంగా శుభాకాంక్షలు ఆలస్యం చేసినందుకు క్షమాపణలు పరిమళం

  ReplyDelete
 28. పరిమళగారూ,
  ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు...

  ReplyDelete
 29. శుభాకాంక్షలు తెలియచేస్తూ ...భుజం తట్టి ముందుకు నడిపిస్తున్న మిత్రులందరికీ ...పేరుపేరునా ధన్యవాదాలు మరియు వినమ్ర పూర్వక వందనాలు!

  ReplyDelete
 30. very sorry for this delayed comment..congratulations and best wishes.

  ReplyDelete
 31. అభినందనలు మరియు చప్పట్లు!
  కొత్త బ్లాగర్స్ కి మీరిచ్చే ప్రోత్సాహం కొండంత అండ
  మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం

  ReplyDelete