అక్కినేని నాగేశ్వరరావుగారికి నేను వీరాభిమానిని కాకపోయినా అప్పుడప్పుడూ ఆయన పాత చిత్రాలను చూస్తూ ఉంటాను. ఆయన చిత్రాలు చూస్తున్నప్పుడల్లా ఆయనలోని మహానటుడ్ని చూసి అబ్బురపడిన సందర్భాలు చాలానే వున్నాయి. ఈమధ్యే అటువంటి ఆణిముత్యంవంటి చిత్రాన్ని చూడటం జరిగింది. అదే "మరపురాని మనిషి". విశ్వాసానికి, మానవీయవిలువలకు అద్దంపడుతూ తీసిన ఈ చిత్రాన్నిచూస్తున్నంతసేపూ నాగేశ్వరరావుగారు ఆపాత్రలో నటిస్తున్నారనే అనిపించదు. చిన్నతనం నుండే అన్యాయాన్ని సహించని,ముక్కుసూటి మనిషిగా కష్టజీవిగా బాబు పాత్రలో జీవించినతీరు చిరస్మరణీయం! ఒకరోజు ఒక కుటుంబం అభిమానంతో పెట్టిన పట్టెడన్నానికి బదులుగా ఆకుటుంబ పెద్ద చనిపోయి తల్లీ బిడ్డలు కష్టంలో వున్నప్పుడు వారిని ఆదుకోవటానికి తన జీవితాన్ని ధారపోసిన రిక్షాఅబ్బిగా.....చివరికి తాను పెంచిన అమ్ములే తనను చీత్కరించినా క్షమించి ఆమె వివాహం జరిపించి కానుకగా విశ్వాసానికి ప్రతీక ఐన కుక్కబొమ్మ కానుకగా ఇవ్వడం చూసినప్పుడు కంటతడి పెట్టనివారు వుండరు. ఎక్కడో లేడులే దేవుడు మమతలున్న మనసులో కొలువుంటాడు... అంటూ ఆనాడు మరపురాని మనిషిగా నటించారు ఈనాడు మరపురాని మనిషిగా నిష్క్రమించారు.తెలుగు సినిమాఉన్నంతవరకూ ఆయన మరపురాని మనిషిగానే వుంటారు. ఆయన ఆత్మకుశాంతికలగాలని ప్రార్ధిస్తున్నాను.
Wednesday, January 22, 2014
Friday, October 25, 2013
Sunday, December 30, 2012
కొవ్వొత్తులతో కాదు నాకు నివాళి!
ముగిసిపోయే కధనుకాను
రగులుతున్న వ్యధను నేను
చనిపోలేదు నేను......
మీ కొవ్వొత్తుల వెలుగులో జీవించే ఉన్నాను
అత్యాచార తిమిరాన్ని తరిమికొట్టే ఆయుధంగా
నా చావు మీ ఉద్యమానికి స్ఫూర్తి ఐతే
నా మరణం కూడా ధన్యం!
నా మరణానికి కారణమైన కామాంధుల
తలలు తక్షణం తీసి కోటగుమ్మానికి వ్రేలాడగట్టమని
ఆజ్ఞాపించే రాజే లేడా ఈ లోకంలో
రాచరికానికి సెలవిచ్చేసి, ప్రజలే ప్రభువులన్న
ప్రజాస్వామ్యంలో నా మరణానికి సమాధానం
కోట్లు ఖర్చుపెట్టి ఓట్లు కొనుక్కున్న
ఏ ప్రభువు నడగాలి ?
మరోసారి ఆడపిల్ల పై చేయి వేయాలంటే ఒణుకు పుట్టేలా
ఏ ప్రభువు శిక్షవేస్తాడు ఆ దుర్మార్గులకు?
ఎంతకాలానికి ?
కన్నీళ్ళతోనో, కొవ్వొత్తులతోనో కాదు నాకు నివాళి
యత్రనార్యస్తు పూజ్యంతే అని పుస్తకాలకే పరిమితం చేయకండి
ప్రాధమిక విద్యనుండే పిల్లలకు బోధించండి
మానవత్వమున్న మనుషులుగా తీర్చిదిద్దండి
స్త్రీలను పూజించక్కర్లేదు
వారి ముఖంపై చిరునవ్వు చెదరనీయకండి
భయం నీడన బ్రతుకు వెళ్ళదీయకుండా
కొంచెం ధైర్యంగా నడిచేలా రక్షణ కల్పించండి
హింసకు గురైన వారిపట్ల కాస్త సానుభూతి చూపించండి
చులకనగా మాట్లాడి మా ఆత్మలకు కూడా
శాంతి లేకుండా చేయకండి
ఇదే నాకు, నాలాంటి ఎందరో అభాగినులకు
నిజమైన నివాళి!!
** నేనుసైతం అంటూ ఓ టపా రాసి చేతులు దులిపేసుకోవటం తప్ప ఏమీ చేయలేని నానిస్సహాయతకు బాధపడుతూ నిర్భయకు అశ్రునివాళి! రాబోయే సంవత్సరమైనా ఇటువంటి చేదు జ్ఞాపకాలు మిగల్చకుండా అంతా మంచే జరగాలి, అందరికీ మంచే జరగాలని కోరుకుంటూ ఈ వత్సరానికి వీడ్కోలు!

Friday, November 9, 2012
నాల్గు వసంతాలు!
ప్రియమైన పరిమళం
బ్లాగుల విరితోటలో నువ్వు చిరు పుష్పంలా విరిసి సరిగ్గా నాల్గు సంవత్సరాలు. కష్టాలూ సుఖాలూ, ఇష్టాలూ నష్టాలూ, అలకలూ అల్లర్లూ, కధలూ కాబుర్లూ... ఇవన్నీ పంచుకోవడానికీ, అప్పుడప్పుడూ మనసులోని భారం దించుకోవడానికీ నువ్వే వేదికయ్యావ్. తెలుగు బ్లాగుల సుమహారంలో నాకూ చోటు కల్పించావ్. ముఖపరిచయమైనా లేని వారితో అనుబంధం ఏర్పరిచావ్.నేను భయపడిన వేళ ధైర్యాన్నిచ్చి, బాధపడిన వేళ ఓదార్పునిచ్చి, నిరుత్సాహపడిన వేళ ప్రోత్సహించి, నా రాతలను భరించి, పొరపాట్లను సరిదిద్ది తమ చెలిమిని పంచిఇచ్చే మిత్రులను నాకు ఇచ్చావ్. చెలిమిని మించిన కలిమి కలదా ఇలలో... అటువంటి అపురూపమైన కానుకను నువ్వు నాకు ఇచ్చావు. పరిమళం ఐ లవ్ యూ.... పుట్టినరోజు జేజేలు కూడా...
* పరిమళాన్ని అనుసరిస్తున్న, మరియు ప్రోత్సహిస్తున్న బ్లాగ్ మిత్రులందరికీ కృతజ్ఞతాభివందనాలు!
Saturday, October 27, 2012
శాన్వీ.....
అమ్మా....
ఏ దేవదేవుడో పొరపాటున జారవిడుచుకున్న
దేవపారిజాత పుష్పానివి నువ్వు!
ఏ పురాణేతిహాసాల్లోనూ లేడమ్మా...
ఇంత కౄర రాక్షసాధముడు!
మానవత్వం మంటకలిసిన తరుణంలో
మాపాపపు లోకంలో క్షణమైననిలువక
దివికేగి...నీదైవత్వాన్ని తిరిగి పొందిన
చిన్నారి దేవతవి నువ్వు!
నిన్ను స్వాగతించినవి నాల్గు చేతులేనేమో
కాని....
వీడ్కోలు పలుకుతున్నవి వేలచేతులు!
ఇక ఎన్ని కొవ్వొత్తులు వెలిగించినా
కానరాదు నీరూపు.....
వ్యధాభరిత హృదయంతో....
చెబుతున్నాం టాటాలూ....బైబైలూ....
* తనసొత్తనేమో తిరిగి తీసుకెళ్ళి ఆతల్లితండ్రులకి కడుపుకోత మిగిల్చిన ఆదేవుడ్నే వారికి ఈబాధను తట్టుకునే మానసిక స్థైర్యాన్ని ఇవ్వమని ప్రార్ధిస్తున్నా.....

Wednesday, October 24, 2012
దసరా(స్పెషల్ )శుభాకాంక్షలు!
మిత్రులందరికీ విజయదశమి శుభాకాంక్షలు.ఇక స్పెషల్ ఏమిటంటారా చూశారుగా పై లడ్డూలు....అవి నేనుచేసినవే.మొన్న ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రం చూశాక నాలోనేను చాలా మధనపడి ఇంగ్లీష్ రాకపోతే పోనీ కనీసం లడ్డూ చేయటం కూడా రాదాయే :( ఇది నాక్కూడా ఇజ్జత్ కా సవాల్ అని డిసైడ్ ఐపోయా.పైగా మావారిక్కూడా లడ్డూ అంటే ప్రాణం.నాగురించి మాత్రమే ఆలోచించుకోవడం స్వార్థం.ఆయన ఇష్టాన్నిపంచుకోవడం ప్రేమ.....నేర్చుకొని నేనే చేసిపెట్టడం త్యాగం...ఈవిధంగా జ్ఞానోదయమైన క్షణం, తక్షణం యూట్యుబ్ లో వెదికి లడ్డూ చేయువిధానం చూసేసి ...ఏదైనా ఒక మంచిపని చేయటానికి సంకల్పించినపుడు విజయదశమి కంటే మంచిరోజు మరేముంటుంది? ఆచరణలో పెట్టేశా...
ఇక నేను లడ్డూ చేసిన విధంబెట్టిదనిన...తలంటిపోసుకున్న జుట్టు ఎగరగా క్లిప్పు పెట్టినాను ...భళాభళి
చీరచెంగును నడుముచుట్టూ తిప్పిదోపినాను.....భళాభళీ...
ఘల్లుఘల్లుమను గాజులన్నిటిని వెనక్కి తోసినాను....భళాభళి!
ఆప్రకారంగా సిద్ధమైన నేను ఒకపొయ్యిమీద పంచదార పాకం పెట్టి,మరోపొయ్యిపై ఆయిల్ పెట్టాను.పొయ్యి కూడా వెలిగించానండోయ్.ఇప్పుడు సెనగపిండి జారుగా కలుపుకొని సిధ్ధం చేసుకున్నా.పాకం నెట్ లో చూపించినట్లు తీగపాకం వచ్చేసింది యాలకపొడి కలిపిఉంచా.కాగిన నూనెలో చట్రం పెట్టి పిండి పోశా కాస్త ఇంచుమించుగా బూందీ లాగే వచ్చింది :)దాన్ని పాకంలో వేసి జీడిపప్పు,కిస్మిస్ కలిపి లాడ్డూలా చుట్టేసుకోవడమే.
హమ్మయ్య సక్సస్ ఫుల్ గా తయారుచేసి అమ్మవారికి ముందుగా నివేదనచేసి ఆనందంగా శ్రీవారికి పెట్టాను.పైగా పొద్దున్నే వీళ్ళు లేవకముందే చేసేసా సర్ప్రైజ్ చేద్దామని :) ఇన్నాళ్ళకు మీమనసు అర్ధంచేసుకున్నా...రాబోయే దీపావళికే కాదు మీకెప్పుడు లడ్డూ తినాలనిపించినా నేనే చేసిపెడతాను అంటూ లడ్డూ ప్లేటు అందించానండి అంతే ఒక్కలద్డూ నోట్లోవేసుకోగానే ఆయననోట మాటే రాలేదండీ...బహుశా ఆశ్చర్యానందాలతో అనుకుంటా.లడ్డూ నువ్వు చేశావా అని పారిపోబోతున్న మావాడికి ప్రసాదంరా వద్దనకూడదు అంటూపెట్టా...అది తిన్నవెంటనే నేనెప్పుడూ నీకు ఇంగ్లీష్ రాదని అననమ్మా అంటూ కంటతడి పెట్టుకున్నాడు.నాకళ్లలోకూడా ఆనందభాష్పాలు.అంతలోకి ఆయన తేరుకున్నారనుకుంటా....ఏమికామెంటుతారో అని ఆత్రంగా చూస్తుంటే కళ్ళనిండా నీళ్ళతో (ఆనందభాష్పాలేనండీ) నన్ను దగ్గరికి తీసుకొని దీపావళికి చిన్ని రమ్మంది కదరా మనం వెళదాం సరేనా అన్నారు.నిన్నటివరకు చూద్దాంలే అన్నవారు ఒప్పేసుకున్నారు...ఆనందంగా అదేంటి ఎప్పుడూ రెండు తింటారుగా ఇంకోటి తీసుకోండిఅన్నా...అబ్బే చాలురా ఈరోజు మనింటికి ఎవరోకరువస్తారుగా అందరికీ నువ్వుచేసిన లడ్డూ టేస్ట్ చూపించు అన్నారు నాకళ్ళల్లో మళ్ళీ ఆనందభాష్పాలు....ఈవిధంగా ఆనందంగా దసరా పండుగ స్పెషల్ గా జరుపుకున్నామండీ....మీకందరికీ కూడా నోరు తీపిచేద్దామని.......అరె అదేంటి....అలావెళ్లిపోకండీ...తిని చూసి ఏదోకటి చెప్పండి pleezzzzzzz :) :)

Wednesday, October 10, 2012
పిట్టకధలు - 4 ( విధి )
మిత్రులారా! మన పాత పిట్టకధలు గుర్తున్నాయా! ఒకవేళ మర్చిపోతే లింకులివిగో...
పిట్ట కధలు -1
పిట్ట కధలు -2 (యయాతి చెప్పిన నీతి
పిట్ట కధలు - 3
కైలాసమున పార్వతీపరమేశ్వరులు ముచ్చటించుకొను ఒకానొక సందర్భములో విధిబలీయమైనది దేవీ అని ఈశ్వరుడు చెప్పుచుండగా...పార్వతి, స్వామీ! అది సామాన్యులకు గాని మనవల్ల కానిదేమున్నది మనము తలచినచో విధికూడా తలవంచునుకదా అన్నదట!అప్పుడు శివుడు లేదుదేవీ విధిని తప్పించుట వ్రాసిన బ్రహ్మకైనా సాధ్యముకాదుసుమా అనగా పార్వతీదేవి ఉక్రోషముతో సకల చరాచర సృష్టికి శక్తినిచ్చు నావల్లకూడా కాదా అని అడుగగా మహాదేవుడు చిరునవ్వుతో కాదన్నాడట!
అప్పుడు ఆమె చేతినిచాచి భూలోకంవైపు చూపుతూ అక్కడ ఆడుతూ పాడుతూ తిరుగుతున్న ఒక పదహారేళ్ళ కుర్రవాడిని చూపించి అతని విధి ఏమిటి అని ప్రశ్నించింది. శివుడాపిల్లవాడిని చూసి పాపం అతడు కొద్దినిముషములలో పాము కాటువల్ల చనిపోవునని చెప్పాడు.పార్వతీదేవి వానిని నేనుకాపాడెదనని చెప్పి ఆపిల్లవాడినే చూస్తూవుండగా వాడు తనగుడిశలోకి వెళ్లి వుట్టిమీదున్న చద్ది అన్నం తెచ్చుకొని కంచంలో వడ్డించుకొని తినసాగాడు.అక్కడే ఓమూల చుట్టచుట్టుకొని వున్ననాగుపామొకటి అలికిడికి బెదరి అతనివెనుకగా పడగ విప్పి కాటువేయుటకు సిద్ధపడెను ఆక్షణమునే పార్వతి మనుష్యరూపంలో వచ్చి ఆపిల్లవాడిని గట్టిగా పిలిచింది.వెంటనే పిల్లవాడు అన్నం ముందునుండి చటుక్కున లేచి బయటకు వచ్చి చూడగా ఎవ్వరూ కనిపించలేదు.విజయగర్వముతో పార్వతీదేవి శివుడ్ని చూసి చూశారాస్వామీ మీరుకాదన్నది నావల్ల ఐనది అన్నది.స్వామి చిరునవ్వుతో అటుచూడుదేవీ ఏమిజరుగునో... పాము సరిగ్గా కాటువేసే సమయానికి వాడు చటుక్కున లేచివెల్లటంతో ఆకాటు అన్నం లోపడి విషపూరితమైనది తిరిగిలోపలికి వచ్చిఅన్నం తిన్న పిల్లవాడు చనిపోయాడు.పార్వతీదేవి నిర్ఘాంతపోయి మహాదేవునితో పంతమాడినందుకు తలదించుకొని మీరన్నది నిజమేస్వామీ అని ఒప్పుకొన్నదట!
* అందుకే మన పెద్దవాళ్ళు అన్నందగ్గరనుండి లేవకూడదని ఒకవేళ లేవాల్సివస్తే వేరేకంచంలో మళ్ళీ వడ్డించుకొని తినాలని అనేవారట!అంటే అప్పట్లో కరంట్ ఉండేదికాదుకదా దీపాలవెలుగులో ఏవైనా కీటకములు ,పురుగుపుట్రా పడినా కనిపించవని అలా చెప్పేవారేమో!

Subscribe to:
Posts (Atom)