ఇన్నాళ్ళూ నువ్వులేని
ఒక్కో రోజు గడుస్తుంటే
నిన్నుకలిసే రోజుకి
ఒక్కోరోజు దగ్గరవుతున్నానని
సంబర పడిపోయాను
ఎండమావిని ఒయాసిస్ అనుకొని
భ్రమలో బతికేసా ఇన్నాళ్ళూ
ఐనా ......
నువ్వొస్తే నీకివ్వడానికి
నాదగ్గర ఏముందని?
నా ధైర్యాన్ని, స్థైర్యాన్నీ...
అభిమానాన్ని,అహంకారాన్ని
ఆప్యాయతనీ, ఆదర్శాన్ని
మనసుని, మమతని
నా ఆఖరి చిర్నవ్వునీ
చివరి కన్నీటి బొట్టునూ
సమస్తం నీకిచ్చేసి....
బీడువారిన మనసుతో
మోడువారిన చెట్టులా
ఇలా... మిగిలాను
No comments:
Post a Comment