Thursday, February 4, 2016

టి.విలో పంచాయితీలు


ఈ మధ్య మధ్యాహ్నం ఖాళీ అవగానే కాస్సేపు రిలాక్స్డ్ గా టివి చూద్దామని ఆన్ చేస్తే కొన్ని మన తెలుగు చానెల్స్ లో భార్యాభర్తల మధ్య తగువులు తీర్చే ప్రోగ్రామ్స్వస్తున్నాయ్ . ఇంతకు ముందు కూడా అటువంటివి వచ్చినా నేను ఎప్పుడూ గమనించలేదు, ఇదేదో కోర్టుకి వెళ్ళక్కర్లేకుండా న్యాయం చేస్తున్నారు కోర్టుల చుట్టూ తిరిగితే ఏళ్ళు గడిచిపోతాయి కొన్నిసార్లు తిరగలేక బాధితులు రాజీ పడిపోతుంటారు సరే ఇదేదో మంచి విషయమే అనుకున్నా.గత కొద్దిరోజులుగా చూస్తుంటే సెక్షన్లు తెలిసాయి కాని న్యాయం ఎవరికి జరుగుతుందో తెలీలేదు :)

విషయంలోకొస్తే ఇంచుమించుగా ప్రతీ ఎపిసోడ్ లోనూ ఇద్దరు పెళ్ళాల శోభన్ బాబులే :) అది సినిమా చెల్లుతుంది ఇక్కడకొచ్చిన బాబూ ఇద్దర్ని చూసుకుంటానంటాడు అదేంటో :) :)

ఒక్కోసారి అక్కడ అడిగే విధానం చూస్తే నా తల తిరిగి పోతుంది. నువ్వు రెండో భార్యవి అతనేమన్నా ఓర్పుగా ఉండాలి అతనెలా తిరిగితే ఎక్కడికెళ్తే నీకెందుకు నిన్ను నీ పిల్లల్ని చూసుకుంటాడు ఈ రకంగా ఉంటుంది ఇక్కడ నేను రెండో ఆమెని సపోర్ట్ చేయమనట్లేదు అతడూ తప్పుచేసాడు ఒక్కోసారి ముందు పెళ్లి సంగతి చెప్పకుండా చేసుకున్న మహానుభావులూ ఉ న్నారు.అప్పుడప్పుడూ ఏకైక భార్యకూ ఇలాంటి జ్ఞానబోదే జరుగుతుంది బైట ఎలా వున్నా ఫరావాలేదంట వాళ్ళని బాగా చూసుకుంటే చాలంట ఇదేం లాజిక్? నేనిలా అనటం సభ్యత కాదు కాని  ఇంట్లో భార్యని ప్రేమగా చూసుకుంటూ వుంటే బయట అంటురోగాలు తెచ్చి అంటించినా ఓకే నా ఇలా మాట్లాడతారా?

.అటూ ఇటూ కూడా న్యాయం మాట్లాడతారు ఇద్దర్నీ దుయ్యబడతారు వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపుతారు అక్కడకి వచ్చినవాళ్ళని ఏం కావాలని అడుగుతారు వాళ్ళేమో న్యాయం కావాలని వచ్చామంటారు అంతా చూసాక నాకు మాత్రం ఎవరికి న్యాయం జరిగిందో అర్ధమే కాదు 


చివరికి మానసిక విశ్లేషణలు చేస్తారు, సెక్షన్ లు చెప్పి భయపెడతారు అంతా అయ్యాక ఎవరో ఒకరితో అంటే మొదటి భార్య హక్కు కాబట్టి నువ్వెందుకు చేసుకున్నావ్ నీకు భార్తమీద హక్కులేదు అంటూ కొంత మైంటినెన్స్ ఇప్పించి పంపేస్తారు. అదే మొదటి ఆమె ఛీ ఇతను నాకొద్దు ఆమెతోనే ఉండనివ్వండి నాకు ఆస్తి లో వాటా ఇప్పించండి అంటే రెండో ఆమె అదృష్టం. ఇంతకూ ఇద్దరి స్త్రీలకూ న్యాయం జరిగినట్టేనా. అతడు అంటే రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న అతనికి పెద్దామో, చిన్నామో ఒకరితో చక్కగా కాపురం చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట!
అంతేకాదు అప్పుడప్పుడూ ఇద్దర్నీ చూసుకొనే అవకాశమూ ఉంటుంది అతనికి ఈ మధ్య తెలివి మీరిపోయి నేనేం పని చెయ్యట్లేదు అనేస్తున్నారు నెల నెలా భత్యం ఇవ్వక్కర్లేదని. ఏదో కొద్దిపాటి ఆస్తి చూపించి సింగిల్ పేమెంట్ సెటిల్ మెంట్ చేసేసి వదిలించుకోవచ్చని.

రెండు పెళ్ళిళ్ళు చేసుకోవడం అనే పెద్దనేరం స్వయంగా చేసినోడు బాగుంటాడు ఇద్దరిలో ఒకరు ఒంటరి జీవితం గడపాలి (వాళ్ళు వేరే పెళ్లి చేసుకుంటారో లేదో వాళ్ళ మానసిక పరిస్థితి కుటుంబ నేపద్యాలు ఇక్కడ అప్రస్తుతం అనుకుంటున్నాను) ఇది స్త్రీలు స్వయంగా న్యాయ నిర్ణేతలుగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో స్త్రీలకు జరుగుతున్న న్యాయం. 

వచ్చిన వాళ్లందరికీ ఇలాగే జరుగుతుందని అనను కొందరికి మంచిజరిగి ఉండొచ్చు.నేను చూసినవి చాలా వరకు ఇలానే వున్నాయి. అసలు తప్పు చేసినవాడు  ఎటువంటి శిక్ష లేకుండా హాప్పీగా వెళ్తుంటే ఇదేం న్యాయం అనిపించి ఇలా వెళ్ళగక్కేశాను.   

*పై విషయాలు కేవలం నా అభిప్రాయం మాత్రమే. ఎవ్వరినీ కించపరిచే ఉద్దేశ్యం కాదు. 

14 comments:

  1. స్త్రీలు ఆధారపడతారు అనేక రకాలుగా! అది మగవాళ్ళకి ప్లస్ పాయింట్. ఇందులో తప్పొప్పుల ప్రసక్తి లేదు.

    ReplyDelete
  2. మంచి విశ్లేషణ...బాగుందండి

    ReplyDelete
  3. @ వాచస్పతి గారు మీరన్నది నిజమే కావచ్చు కాని ఈ తీర్పులు స్ర్తీలను మానసికంగా మరింత బలహీన పరిచేలా, పోషించగలిగితే రెండు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చనే భరోసా మగవారికిస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే!కార్యక్రమంలో ఒక లాయర్ ఉండీ మన చట్టాన్ని పట్టించుకోకుండా తీర్పులు ఉండటం మంచి పరిణామం కాదనిపిస్తోంది నాకు ఇది ఎంతవరకు సబబు అనేది ప్రసారం చేసే చానెల్ వారు ఆలోచించాల్సిన అవసరం లేదా? మీ స్పందనకు ధన్యవాదాలండీ :)

    ReplyDelete
    Replies
    1. naakoodaa ide bhavana kaligindi vatini choosi. alage vachaspati gaari spandanaki meeru ichina spandana kooda bagundi

      Delete
  4. @ పద్మార్పిత నెచ్చెలికి పునః స్వాగతం :)

    ReplyDelete
  5. ఒక మనిషిని పోషించగలిగితే రెండు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అంటే ఇప్పటికే కోట్ల పెళ్ళిళ్ళు అయిపోయి ఉండేవి. ఈ సమాజం పురుషుల నైతిక విలువల మీద ఆధారపడి నడుస్తున్నది కానీ స్త్రీల నిస్సహాయత మీద ఆధారపడి నడవడం లేదు. స్త్రీలు ఎదగడం లేదన్నది మీరు గ్రహించాలి.

    ReplyDelete
  6. ఆ మనిషిని జైలుకి పంపితే ఆ భార్యలు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. ఆ సంగతి ఆ లాయర్లకి తెలుసు. కాబట్టి వాళ్ళు జడ్జీల అవతారం ధరించరు. ఇవి ఔట్-ఆఫ్-కోర్ట్-సెటిల్మెంట్లు కనుక కఱ్ఱా విరక్కుండా పామూ చావకుండా ఏదో ఒక మధ్యేమార్గం వెతకాల్సి వస్తుంది. జీవితాలు చట్టాల ప్రకారం నడవవు గదా! చట్టాలే జీవితాన్ని అనుసరించి నడవాలి. చట్టం అనేది ఎవరో కొద్దిమంది బలవంతుల డ్రీమ్స్ డైరీ మాత్రమే. మళ్ళా ఇంకో బలవంతుడికి డ్రీమ్ మరో రకంగా రాగానే చట్టం మారిపోతుంది.

    ReplyDelete
  7. @ నీహారిక గారు :) ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవారి ఆలోచనే మారాలి.లేకుంటే చట్టబద్ధం కాకపోయినా రెండు పెళ్ళిళ్ళు చేసుకోటానికి భరోసా వస్తుంది జనానికి :)

    ReplyDelete
  8. నేను ఎవరినీ కన్విన్సు చేయలేకపోవచ్చు. కానీ నా అభిప్రాయంలో మన అసలు సమస్య రెండు పెళ్ళిళ్ళు కాదు. ఆ తరువాత జరిగే గృహరాజకీయాలు. అవి లేకపోతే- ఆ చేసుకున్నవాడి మాట అందరూ భక్తిశ్రద్ధలతో వినేట్లయితే సమస్య ఉండదు. చేసుకున్నప్పటినుంచీ అతని మీద పెత్తనం చెలాయించాలని ప్రయత్నం చేసేవాళ్ళ మూలంగా ప్రాబ్లమ్సు మొదలవుతాయి.

    ఒక్క పెళ్లిలో అడ్వాంటేజీలూ ఉన్నాయి. ఇబ్బందులూ ఉన్నాయి. అలాగే రెండు పెళ్ళిళ్ళ కాన్సెప్టులోనూ అవి ఉన్నాయి.

    ReplyDelete
  9. @ నేను ఎక్కడ గారు మీ స్పందనకు ధన్యవాదాలు :)
    వాచస్పతి గారి వెర్షన్ కూడా చూడండి పై కామెంట్స్ లో

    ReplyDelete
  10. @ వాచస్పతిగారు :)

    ReplyDelete
  11. పరిమళంగారూ, చాలా కాలానికి కనిపించారండీ. మళ్ళి మీ పరిమళాలు ఆస్వాదించే అదృష్టం మాకు పట్టిందన్నమాట.. బాగుందండీ..

    ReplyDelete
  12. మంచి టాపిక్ తో పున:ప్రవేశం చేసారన్నమాట.ఆల్ ద బెస్ట్ పరిమళం గారు. మీరిలాగే ఇంకా మంచి పోస్ట్లూ , కవితలూ వ్రాయాలి అని కోరుకుంటున్నాను.

    ReplyDelete
  13. @ శ్రీలలిత గారూ ఎంతమాట.... హనుమంతుడి ముందా కుప్పిగంతులు :)
    ధన్యవాదాలు :)
    @ మాలాగారు థాంక్యు థాంక్యు :)

    ReplyDelete