ఒకప్పుడు
నువ్వు నాతో ఉన్నప్పుడు .... ఎప్పుడూనాపై ప్రేముందా నీకు అని..ఎంతుందో అని
కొలమానాలతో ఉక్కిరిబిక్కిరౌతూ సంధిగ్ధత!
ఇప్పుడు
నువ్వు నాతో లేనప్పుడు.... ఎప్పుడూ
గుర్తున్నానా నీకు అని..తలుస్తావా నన్నుఅని
మనసును బలహీన పరుస్తూ సందేహం
ఎల్లప్పుడూ.....
నా కనురెప్పల క్రింద నీ రూపం కరిగి
జారిపోతూంటే ఎదలో పొదువుకుంటున్నా
అపురూపంగా ఈ అశ్రువు సాక్షిగా....