Friday, March 11, 2011
ప్రతిజ్ఞ!
తెలుగు వెలుగును ఖండాంతరాలకు వ్యాపింపచేసిన మహనీయులు వారు.వారి విగ్రహాలు తెలుగువారి వారసత్వ సంపద!వారసులం మనమే వాటిని కూల్చేసుకున్నామా?పంచభూతాల సాక్షిగా మహనీయుల విగ్రహాలు నేలకూలిన వేళ ....మనసు కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే ....టాంక్ బండపై ప్రతిజ్ఞ చేశారని టివిలో చూసినపుడు వీరంతా భారత పౌరులుగా మొదట చేసిన ప్రతిజ్ఞను మరిచారా ..లేక చిన్ననాడు వీరిచేత ఉపాధ్యాయులు కాని, తల్లితండ్రులు కాని ఈ ప్రతిజ్ఞను వల్లె వేయించలేదో తెలియలేదు.దుఃఖం వస్తోంది.అతి ప్రాచీనమని మురిసిపోయే మన నాగరికత ఇదేనాఅని!
స్కూళ్ళలో చెప్పిస్తున్నారోలేదో....ఒకవేళ చెప్పినా దాని అర్ధం వివరిస్తున్నారో లేక మొక్కుబడిగా చెబుతున్నారో తెలీదు.కనీసం తల్లితండ్రులైనా తప్పనిసరిగా తమ పిల్లలకు ఈ ప్రతిజ్ఞ నేర్పించి , అర్ధం వివరించి వారి మనసులో దేశభక్తి పెంపొందేలా చూడాలి.బాధ్యతాయుతమైన భారతీయ పౌరులుగా తీర్చి దిద్దాలి.
ప్రతిజ్ఞ
భారతదేశము నా మాతృభూమి.
భారతీయులందరూ నా సహోదరులు.
నేను నా దేశమును ప్రేమించుచున్నాను.
సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము.
దానికి అర్హుడనగుటకై కృషి చేయుదునని,
నేను నా తల్లితండ్రులనూ, ఉపాధ్యాయులనూ, పెద్దలందరినీ గౌరవింతునని,
నా దేశము పట్ల, దాని ప్రజల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉందునని ప్రతిఙ చేయుచున్నాను.
వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందమునకు మూలము.
Subscribe to:
Post Comments (Atom)
ఇది మనది అన్న కనీస స్పృహ కూడా లేకుండా ప్రవర్తించారు.
ReplyDeleteఎక్కడో ఎప్పుడో చూసినట్టుంది. ఏ సినిమా పాటండీ ఈ ప్రతిజ్ఞ ? లైన్స్ బావున్నాయి. ఆ ఇప్పుడిప్పుడే గుర్తొస్తోంది. చిన్నప్పుడెప్పుడో విన్నట్టు, అన్నట్టు గుర్తు. బహుశా స్కూల్లో అనుకుంటా. భారతదేశం లో భారతీయుడిగానే బ్రతకలేకపోతుంటే ఈ ప్రతిజ్ఞలు అవీ ఏం గుర్తుంటాయండీ. మీ చాదస్తం కాకపోతే.
ReplyDeleteMee blog eppude chusanu. nidanamga chadivi coment chestanu.
ReplyDeletehttp:/kallurisailabala.blogspot.com