Friday, February 25, 2011
బంద్.....ప్రశాంతం ??
టీవిలో న్యూస్ వస్తోంది చిరునవ్వులు చిందిస్తున్న న్యూస్ రీడర్ న్యూస్ చదువుతోంది ప్రశాంతంగా ముగిసిన బంద్! బంద్ సంపూర్ణం!ఫలానా చోట రెండు భోగీలు తగలబెట్టారు,ఫలానా స్టేషన్ కి నిప్పు పెట్టారు ,రెండు కాలేజీ బస్సులు దగ్ధం చేశారు , మరోచోట బస్సులపై రాళ్ళు రువ్వారు , షాపులు ధ్వంసం చేశారు,బస్సులు నిలిపివేశారు .మొత్తానికి బంద్ ప్రశాంతంగా ముగిసింది . ఇంతలో ఒక వ్యక్తి స్క్రీన్ మీదకి వచ్చిప్రజలంతా స్వచ్ఛందంగా సహకరించారు బంద్ సక్సస్ అయింది అంటూ మాట్లాడాడు.నాకు కొద్దిరోజుల క్రిందట ఒక పెద్దాయన మాట్లాడుతూ మేం గాంధీ మార్గాన్ని అనుసరిస్తాం అన్నమాటలు గుర్తుకొచ్చి ఇదేనా ఇప్పటి గాంధీగిరి అనుకున్నా!
బంద్ రెండురోజులూ గుడ్డూ , బ్రెడ్డూ కూడా దొరకలేదు.మా బంధువులమ్మాయి చెల్లెలి పెళ్ళికని ఇద్దరు చిన్న చిన్న పిల్లలతో బస్ కి ఊరికేల్తుంటే బస్ ఆపేసారట!పాపం ఆమె భర్త ఎక్కువరోజులు సెలవు పెట్టడం కుదరక ఆమెని పిల్లల్ని రెండు రోజుల ముందు పంపిస్తే జరిగింది ఇది !ఆమె దిగి ఆటోల్లేక సిటీ బస్ లు తిరగక నానా అవస్తలు పడి వెనక్కోచ్చేసిందట! మా కజిన్ ఒకడు పెట్రోల్ బంక్ లు లేక బయట లూజు పెట్రోల్ కొంటె లీటరు 150/-తీసుకున్నారట.తిరిగిన కొద్ది ఆటోలూ రెట్టింపు కంటే ఎక్కువ వసూలు చేశారు.సొమ్ము చేసుకోనేవారంతా మనుషుల అవసరాన్ని సొమ్ము చేసుకొన్నారు.నాకు తెలిసి ఇవే కాని బయట ఇలాంటివి ఎన్నో జరిగి ఉంటాయి.
మన సంగతే ఇలా ఉంటే ఇక ఏరోజు కారోజు సరుకులు తెచ్చుకోనేవారు, ఈ రోజు ఆటో నడిపితేనే రేపు గడిచేది అన్నవాళ్ళూ,చిన్న చిన్నటీస్టాల్స్ , తోపుడు బండ్ల వాళ్ళు ,పువ్వులమ్ముకొనేవాళ్ళూ, బంద్ తో మాకు సంబంధం లేదు మీరు రాకపోతే జీతం కోతే అనేచోట పనిచేసే చిన్న ఉద్యోగులూ ...ఇలా చెప్పుకుంటూ పొతే నష్ట పోయేవాళ్ళూ , కష్టపడేవాళ్ళూ ఎంతోమంది ఉన్నారు.ఆకలికి , అవసరానికీ , కష్టానికి కుల మత జాతి ప్రాంతీయ బేధాలు లేవుకదా ? అవి అందరికీ ఒక్కటే !
ఇంతకూ నాకు అర్ధం కానిది నిజంగానేనండీ ...ఒక సామాన్య గృహిణిగా నాకు అర్ధం కానిది ఈ బస్సులు రైళ్ళూ అవీ తగలేసి ప్రభుత్వాన్ని నష్టపరిస్తే ఆ నష్టమంతా ప్రజా ప్రతినిధులూ ,మంత్రులూ ఏమన్నా భారిస్తారా ఆభారమంతా ఏదోక రూపంలో ప్రజలమీదే కదా వేసేది. బంద్ లు చేసుకోవచ్చేమో మనది ప్రజాస్వామ్యం కనుక !కాని ప్రభుత్వ , ప్రెవేటు ఆస్తులు ధ్వంసం చేయటం వల్ల నష్టం ఎవరికి ? లాభపడేది ఎవరు ?
Subscribe to:
Post Comments (Atom)
సరిగ్గా నా మనసులో మాట చెప్పారు పరిమళంగారూ. మీరన్నది నూటికి నూరు పాళ్ళు నిజం. ఈ బందులు, రాస్తా రోకోల వల్ల నష్టం సామన్య మానవుడికే. పైగా మీరన్నట్టు బస్సులూ, రైళ్ళూ తగలబెట్టడం వలన జరిగే ఆస్తి నష్టం మళ్ళీ తిరిగి మనలాంటి చిరుద్యోగులమీదే పడేది (tax payers). ఎవరికోసమైతే ఈ ఉద్యమాలు నిర్వహిస్తున్నారో వాళ్ళకే ఇంత ఇబ్బంది కలిగించేవి యే రకమైన ఉద్యమాలు, ఇదేం గాంధీగిరి, నాకాస్సలు అంతు పట్టడం లేదు...
ReplyDeleteనిజమేనండీ,కానీ ఏం చెయ్యగలం తిట్టుకోడం తప్ప
ReplyDeleteఇంకెవరండీ, రాజకీయనాయకులు, వాళ్ళ అనుచరులూ!
ReplyDeleteమన కష్టాలు, బాధలూ వినేవాళ్ళు వాళ్ళల్లో ఉండరుగా!
manaku maname vesukunna siksha kadaaa idi....
ReplyDeleteituvanti swardha rajakeyanayakulani manam yennukuni thappu chesamu... epudu barinchali thappadu.....
మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ .. శివ రాత్రి పర్వదిన శుభాకాంక్షలు.. శివ చెరువు
ReplyDeletenirasanalu telapadaaniki..
ReplyDeletesevaloo..utpaadakathaloo..rettimpu..
cheste..deshaanikee..dehaanikee.
.entho impu..sompu
స్పందించిన మిత్రులకు ధన్యవాదాలు!
ReplyDelete