Tuesday, January 25, 2011

మంచి చెడులు రెండూ ... మనకు అవసరమే !


'మృతియె లేకున్న రుచిఏది బ్రతుకులోన '
అన్నారో కవి
చీకటి లేనిదే వెలుగు విలువ తెలీదు
కష్టమనేదే లేకుంటే సంతోషానికి
అర్ధం తెలీదు
ఐనా మన జీవితంలో రోజులన్నీ
ఒకేలా ఆనందంగా సాఫీగా సాగిపోవాలని
కోరుకుంటాం అందరం
కాని అలా జరిగితే జీవితం విలువ
మనకి తెలీకుండానే ముగిసిపోతుందేమో
మంచిరోజు అంటే మనకు ఆనందాన్నిచ్చింది
అనుకుంటాం
కష్టం కలిగిన రోజును ద్వేషిస్తాం
కాని మనం చెడ్డ అనుకున్న రోజు కూడా
మనకు ఓ గుణపాఠం నేర్పుతుంది
అది మనకు తప్పకుండా జీవితంలో
ఉపయోగపడుతుంది
మనల్ని కాపాడుతుంది
కనుక మన జీవితంలో ఏరోజూ
ద్వేషించాల్సినది కాదు
మంచి చెడులు రెండూ ...
మనకు అవసరమే !

9 comments:

  1. నిజంగా మీది ఒక ఇన్స్పైరబుల్ పొస్ట్!
    జ - గత్
    పుట్టి గతించేది జగత్
    ఇదే దీని రహస్యం
    సమదృష్టే సమాధానం.
    పెద్దలు చెబుతారు ముఖ్యంగా.. జయాపజయాలు, లాభాలాభాలు,మానావమానాలు,శీతొష్ణాలు ఇంకా సుఖధుఃఖాలు,
    వీటి పట్ల సమదృష్టి ఉండాలని చెబుతారు.
    అంటే వాటిపట్ల స్పందన వుండద్దని కాదు.
    సహజంగా వాటిని ఆస్వాదించడమే సమదృష్టి.
    నవ్వొస్తే హాయిగా నవ్వ్డడం..ఏడుపొస్తే బిగ్గర గా ఏడ్వడం.
    రెంటికీ జీవితంలో సమానంగా స్థానమివ్వ్దడం.
    దేనినీ బలవంతంగా కోరకపోవడం.
    దేనినీ బలవంతంగా వద్దనకపోవడం.

    but rarely we see such people!

    ReplyDelete
  2. thanks for giving to share ur message u r telling true

    ReplyDelete
  3. @ అను గారు! థాంక్స్ !

    @ సత్యగారూ "but rarely we see such people!" నిజమండీ...ధన్యవాదాలు.

    @ మందాకినిగారు
    @ చిన్నిగారు
    @ మురళిగారు
    @ సుమలతగారు
    ధన్యవాదాలండీ .......

    ReplyDelete
  4. //కష్టం కలిగిన రోజును ద్వేషిస్తాం
    కాని మనం చెడ్డ అనుకున్న రోజు కూడా
    మనకు ఓ గుణపాఠం నేర్పుతుంది//
    110% నిజమండీ...
    //పరిమళాన్ని కొందరికైనా పంచాలని కాదు, కాదు, కొందరితోనైనా పంచుకోవాలని ఆశ//మీ టపాలన్నీ చాలా బాగున్నాయి..పంచుకుంటున్నందుకు ధన్యవాదాలండీ

    ReplyDelete