Sunday, January 9, 2011
గురుర్దేవో.....??
గురువు అంటే అంధకారం తొలగించువాడని చెబుతారు.శిష్యుల అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించేవాడు కాబట్టే గురువుకు త్రిమూర్తులతో సమానమైన స్థానమిచ్చి పూజిస్తాం.అక్షరాభ్యాసం ఐన వెంటనే పిల్లలకు ...
గురుర్భ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః
అంటూ చెప్పించి గురువు బ్రహ్మ , గురువు విష్ణువు ,గురువు మహేశ్వరుడు గురువు సాక్షాత్ పరబ్రహ్మము అట్టి గురువుకు నమస్కారం చేయమంటూ బుద్ధులు గరుపుతాం ....
ఏక ఏవ పరో బంధుః విషమే సముస్థితే
గురు స్సకల ధర్మాత్మా తస్మై శ్రీ గురవేనమః
ఆపదలు కలిగినపుడు సకల ధర్మ స్వరూపుడగు ఎవడు ఆప్తుడై మన ఆపదలను నివృత్తి చేయునో అట్టి గురువుకు నమస్కారం ....
అట్టిగురువులకు శతకోటి వందనం మరి ఆ గురువుల వల్లే ఆపద వస్తే ....
ఆడపిల్లలకు రక్షణ లేకపోతే...పసి పిల్లలకు శిక్షణ పేరిట శిక్షలు వేస్తుంటే ....ఇక గురువులకు వందనాలకు బదులు దండనలే మిగులుతాయి.ఏ చానెల్ పెట్టినా ప్రతి రెండుమూడు రోజులకోసారి కీచక టీచర్ అని...ఆడపిల్లలమీద వేధింపులనీ వింటూంటే మనసుకెంత బాధనిపిస్తుందో చెప్పలేను.వారికి మాత్రం పిల్లలుండరా...వారూ ఎక్కడైనా చదువుతుంటే అటువంటి వేధింపులకు గురైతే అన్న ఆలోచనే రాదా అనిపిస్తుంది . కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన శిష్యుల్ని మలిన మనస్కులై ఎలా చూస్తారు ?
దండం దశగుణంభవేత్ అన్నారు కానీ దానికి ముందు సామ దాన బేధాల్ని పాటించకుండానే ...తమ తమ ఫ్రస్టేషన్లకు పసిపిల్లల్ని బలిపశువుల్ని చేసి చితక బాదుతున్న గురువులూ ఉన్నారు. వారి భవిష్యత్తు కోసమో...లేక తప్పు చేస్తేనో దండిస్తే ఫరవాలేదు చిన్న విషయాలకే ఓర్పును కోల్పోతున్నారు కన్ను, చెవి అని చూడకుండా కొడుతుంటే ఆతర్వాత పిల్లల తల్లితండ్రులు బాధపడాల్సి వస్తోంది.
కొన్నేళ్ళ క్రిందటివరకూ టీచర్లు పిల్లల్ని కొట్టడం , కంట్రోల్లో పెట్టడం సర్వసాధారణం!తల్లితండ్రులు కూడా పిల్లోడు బాగుపడతాడు అని పట్టించుకొనేవారు కాదు కానీ ఇప్పుడు అది పెద్ద నేరమైపోయింది. సహేతుకమైన కారణం ఉన్నా కూడా పిల్లల్ని దండించ కూడదు.తల్లితండ్రులు కూడా పిల్లల్ని కొట్టడం పట్ల ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు. ఈ మధ్య పిల్లల్నిదండిస్తే కంప్లైంట్ చేయటానికి ఏదో టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టినట్టున్నారు.బహుశా కొన్నాళ్ళకు తల్లితండ్రులు ఓ దెబ్బవేసినా అమెరికాలోలా టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసే రోజులోస్తాయేమో.
గురువులందరూ ఒకేలా ఉండరు....కీచక గురువులు మాత్రమే కాదు మహాత్ములూ ఉంటారు .ఓ వారం క్రితం అనుకుంటా పేపర్ లో చదివాను వైజాగ్ దగ్గర శ్రీకాకుళంలో అనుకుంటా ...స్టూడెంట్స్ తప్పు చేశారని టీచర్ శిక్షించుకున్నారట!పిల్లలు పశ్చాత్తాప పడ్డారని రాశారు.నిజంగా ఆయన ఆదర్శానికి వందనం!
ఏది ఏమైనా ఎక్కడో కొద్ది శాతం మంది చేసే తప్పులు వెలుగులోకి వచ్చి గురువులకు మాయని మచ్చను మిగులుస్తున్నాయి కాని మనిషికి చదువు చెప్పి సంస్కరించడానికి గురువే లేకపోతే ఆ సమాజాన్ని ఊహించలేం కదా?అందుకే గురువు ఎప్పుడూ పూజనీయుడే....ఏమంటారు?
Subscribe to:
Post Comments (Atom)
ఇదే కాదు ఇప్పుడు జరుగుతున్న పైత్య -వైపరిత్యాలకన్నింటికీ ఒకటే కారణం!
ReplyDeleteమన వ్యవస్థ మనకు లేక పోవడం...
మన ’విద్యా వ్యవస్థ’ ధరిద్రులైన ఆ మ్లేఛ్య బ్రిటీష్ వాల్లు వాడి వాడి మనకు వదిలేసినది....
దీనిలో ...
సౌకర్యాలు ఎక్కువ సంస్కారాలు తక్కువ...
లొసుగులెక్కువ లౌక్యం తక్కువ ..
రెండవ విషయం తప్పుకి శిక్ష వెంటనే పడక పోవడం...పడ్డా ఎవడికీ కనపడక పోవడమ్...
"పున్య ఖ్యాతి-పాప భీతి" రెండూ కనపడాలి...అందరికీ తెలియాలి
(అదే ఒక నాయిక తన బాయ్-ఫ్రెండ్ ని మారిస్తే మాత్రం అందరికీ తెల్సి పోతుంది..leave it!)
సంచలనాలకిచ్చినంత(sensational news) ప్రాధాన్యం,
మనం సంస్కరణలకివ్వం...ఏంచేస్తాం!
finally....
ఎలాగైతే వదినని తల్లి తో సమానమంటామో...(అమ్మా, అని పిలవం కదా!)
ఎలాగైతే మామయ్యని తండ్రి తో సమానమంటామో...(నాన్నా, అని పిలవం కదా!)
అలాగే లౌకిక విద్య నెర్పే వాడిని గురుతో సమానమంటాము.,,(గురువనం)
గురువు
కదిలే కవిత్వం.
తిరుగాడే తత్వం
వ్యక్తి కాదు వ్యక్తిత్వం...
పరుషపు మాటల్తో, కఠనమైన శిక్షలతో కాదు..
తన ప్రవర్తనతో శిష్యులలో సన్మార్పు తెచ్చేవాడు గురువు...
--సత్య
ఓ ఇంజనీరింగ్ కాలేజి ప్రొఫెసర్ తను కొట్టుకుంటే అయినా పిల్లలు బాగుపడతారని ఆయన చెప్పుతో కొట్టుకున్నారట .నేనూ చదివానండి.బాగుంది మీ టపా
ReplyDeleteగురుదేవా గురుదేవా- మహానుభావా
ReplyDeleteఇలలోన వెలసినా- నాదైవమా
ఏమిచ్చి తీర్చుకోను-మీ ఋణము
గురుదక్షిణ ఇచ్చేయన- నా ప్రాణము ||గురుదేవా||
రాతిని నాతిని చేసే-ఆనాటి రాముడు
ఈరాతిని జ్ఞానిగ మార్చిన-మీరే నేటి రాముడు
గీతను బోధించెను-ఆనాటి కృష్ణుడు
నా తల రాతను సరిదిద్దిన మీరీనాటి కృష్ణుడు ||ఏమిచ్చి||
చేసాను శిక్షణలో-ఎన్నెన్నో తప్పులు
చెప్పజాలనయ్యా-మీ క్షమాగుణం గొప్పలు
కన్నతండ్రివయ్యీ-మము నడిపించావు
కన్నతల్లిలాగా-ముద్దలు తినిపించావు ||ఏమిచ్చి||
స్తన్యాన్ని అందించిన-అమ్మకు తొలివందనం
దేహాన్ని నిర్మించిన- నాన్నకు మలివందనం
జ్ఞాన మార్గాన నడిపించిన గురువుకు-సాష్టాంగ వందనం
నాతోటి మిత్రులారా-స్నేహాభివందనం
ఏమిచ్చి తీర్చుకోను-మీ ఋణము
చేసేశానెప్పుడో-నాప్రాణం మీ వశము
నాలో జ్ఞానం సృష్టించిన-మీరే బ్రహ్మ
ఆచరింపజేయించిన-మీరే విష్ణు
లోపాలు రూపుమాపిన-మీరే శివుడు
నాకోసమె వెలిసిన-మీరే నాదేవుడు
ఏమిచ్చి తీర్చుకోను-మీ ఋణము
గురుదేవా అందుకో నా పాదాభి వందనం
@ సత్య గారు అక్షర సత్యాలండీ ...ధన్యవాదాలు.
ReplyDelete@ రాధికగారు...ధన్యవాదాలు.
@ శి . రా .రావుగారు...ధన్యవాదాలండీ.
@ రాఖీగారు...అధ్బుతమండీ మీ గురుభక్తి! ధన్యవాదాలు.