Monday, July 26, 2010
అలిగినవేళ .......
నగుమోము కనలేని నాజాలి తెలిసి
కనులు మూయకనే స్వప్నమరుదెంచె
స్వప్నమందు చెలియ తానేతెంచెగాని
కన్నుకలపదాయే....పలుకరించదాయె
రేయిపగలు వేచిచూసిన ఘడియలు ...
మూతిముడుపులతోనే గడిచిపోయె
చిలకమడుపు సేవకై నేనెదురుచూస్తుంటె
తానేమొ దయలేక అలక పానుపునెక్కె
మాయలెన్నిచేసినా మొలకనవ్వే కరువాయె
మెట్టె సవరించినా కనికరించని చెలి
అదేమి మహత్యమో మరి !!
సిరిమల్లె పూలకే కరిగి కరుణించె...
సుప్రభాతవేళ కనులు తెరచి చూడ ..
కలకాని నిజం నాకళ్ళెదురుగానె !!
Subscribe to:
Post Comments (Atom)
superb....
ReplyDeleteఅదేమి మహత్యమో మరి !!
సిరిమల్లె పూలకే కరిగి కరుణించె...
సుప్రభాతవేళ కనులు తెరచి చూడ ..
కలకాని నిజం నాకళ్ళెదురుగానె !!
excellent...
aidu nimashaalu nannu nenu maricipoyetatlu cesaaru....
కలయా..ఇది నిజమా.. అని
ReplyDeleteకలియదిరిగిజూడ
కంటి ముందు నీవు
కనుల వెన్నెల గాదె...
ఇన్నాళ్ళకు రాస్తూ అలకలమీదా! కాస్త చిరునవ్వులు చిందించరాదూ!
ReplyDeletenice :-)
ReplyDeletesimply nice :-)
ReplyDeleteఅలకలన్నీ మల్లెల తో మాయమయ్యే వూసు బాగుందండి.. బహు కాల దర్శనం.
ReplyDeletechaalaa baagundi :)
ReplyDeleteచాల బాగుంది నాకు నచ్చింది.
ReplyDeleteసింపుల్ గా బాగుందండి .
ReplyDeletevirahamlo nijamaina kalanu chaala chakkagaa chepparu
ReplyDeleteబాగుందండీ...
ReplyDeleteviraham praNaya uddeepanam.. good feel
ReplyDeleteస్పందించిన మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు!
ReplyDelete