Wednesday, June 16, 2010
బ్రాడ్ బాండ్ పేరుతో మోసం!
కొత్త ఇంటికి మారాం ....సర్దుకొని సెటిల్అవడానికి ఓ రెండు వారాలు ...ఆ తర్వాత ఒక వారం పెళ్ళిళ్ళు , ఊరు ప్రయాణం ...ఐనా ఇంకా మధ్యలో మూడువారాలు ఖాళీయే కదా ..నెట్ పెట్టించుకోవడానికి ఏమిటాలస్యం అనుకుంటున్నారా ..అక్కడికే వస్తున్నా ...పాత ఇంటిదగ్గర రిలయన్స్ బ్రాడ్ బాండ్ షిఫ్ట్ చేయమని అడిగితే మా కొత్తింటి ఏరియాకి లైన్ లేదన్నారని డిస్ కనెక్ట్ చేయించేశాం. అక్కడ ఏది వీలయితే అది పెట్టిన్చుకోవచ్చని. ఊరెళ్ళి రాగానే ముందు కేబుల్ , నెట్ పెట్టించుకుందామని ఆరా తీసి కేబుల్ కనెక్షన్ పెట్టించుకున్నాం.
ఇంతలో మా ఫ్లాట్ కి దగ్గరలో ఒక వీధిలో పై ఫోటో లోని పాంప్లెట్లు చాలా చోట్ల కనిపించాయి .అంతకు ముందు కూడా హాత్ వే , తర్వాత రిలయెన్స్ ఇలా చూసే పెట్టించుకున్నాం. ఇదేంటి ఈ ఏరియాకి లైన్ లేదన్నాడుకదా అని పాంప్లెట్ లోని నెంబర్ కి ఫోన్ చేశాం...శ్రీనివాస్ అనే అతను ( అదికూడా నకిలీ పేరై ఉంటుంది )మాట్లాడి ఉంది మేడం ! అడ్రస్ చెప్పండి అని అడ్రస్ తీసుకొని అలీ అనే అతన్ని పంపించాడు. నేనతన్ని మేం ముందు అడిగితే లేదన్నారు కదా అని అడిగితే ...పదిమంది వరకూ కస్టమర్లు ఉన్నారు మేడం అందుకే అంటూ కనెక్షన్ తీసుకున్నవారి చెక్కులు ( పాపం నాలాంటి బకరాలు ) చూపించాడు . ఐనా ఎందుకైనా మంచిదని కస్టమర్ కేర్ కి అతనుండగానే ఫోన్ చేసి అడిగితే పదినిముషాలలో డిటైల్స్ కనుక్కుని మీకు చేస్తానని చెప్పింది . సరేని అప్లికేషన్ ఫిలప్ చేసి 1000/- కాష్ ఇచ్చి ఐడి ప్రూఫ్ లు ఇచ్చి రసీదు తీసుకొని తిరిగి అతను వెళ్ళిపోయే టప్పటికి కూడా కస్టమర్ కేర్ నుండి ఫోన్ రాకపోతే ....మా కజిన్ మళ్ళీ ట్రై చేస్తే ఎవ్వరూ ఎత్తలేదు . సరే అతను వెళ్తూ ఎల్లుండి మీకు కనెక్షన్ ఇస్తాం అని చెప్పి వెళ్ళిపోయాడు .
ఎల్లుండి ...అవతలెల్లుండి కూడా అయ్యింది కనెక్షన్ మాత్రంరాలేదు.ఫోన్ చేశాం ఫోన్ ఎత్తలేదు సరే ఆదివారం సెలవు కాబట్టి ఎత్తలేదేమో అనుకున్నాం...ఆదివారం లేదు సోమవారం లేదు ...ఆతర్వాత ఫోన్ స్విచిడ్ ఆఫ్! కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తే మళ్ళీ కనుక్కొని చెప్తాననే మాటే ! పట్టువదలని విక్రమార్కురాల్లా ఫోను మీద ఫోను చేసి విసిగిస్తే చివరికి మాకిచ్చిన రసీదులోని నెంబర్ తీసుకొని వెరిఫై చేసి అసలు మేముండే ఏరియాకి లైన్ లేదని ఆ ఫోన్ నెంబర్ వాళ్ళ ఏజెంట్స్ లో ఎవ్వరిదీ కాదని తేల్చి చెప్పింది . ఆతర్వాత మెయిన్ బ్రాంచ్ కి ఫోన్ చేసి కంప్లైంట్ చేసి మీకు సంబంధం లేకుండా మీ అప్లికేషన్ ఫాం లూ, రసీదులూ ఎలావస్తాయి ? పైగా అతనిచ్చిన కస్టమర్ కేర్ నెంబర్ కూడా సరైనదే ...అని గట్టిగా అడిగితే మళ్ళీ అన్ని బ్రాంచిల్లో ఎంక్వైరీ చేస్తాం మేడం ఒకవేళ మాదగ్గర చేసి మానేసిన వాళ్లెవరైనా అలా చేస్తున్నారేమో అంటూ చల్లబరిచి ఫోన్ పెట్టేశాడు . అంతే ఆ తర్వాత ఓ పదిసార్లైనా చేసి ఉంటాను ....ప్రతిసారీ ఇదేమాట ! ఇంకా వేరే ఏరియా నుండి కూడా కంప్లైంట్ లు వచ్చాయి అంటాడు కాని ఏం యాక్షన్ తీసుకోలేదు.కనీసం మా ఏరియా లోకల్ చానెల్ లో ఐనా స్క్రోల్ వేయించమన్నాను . అసలు వాళ్ళకేమీ బాధ్యత లేనట్టే వదిలేశారు . వాడికి కస్టమర్ కేర్ లో వాళ్ళపట్ల ఎంత నమ్మకం లేకపోతె అంత ధైర్యంగా నెంబర్ ఇస్తాడు ? పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే మావారేమో లైట్ తీసుకున్నారు , నాకేమో సరిగ్గా ఇంట్లో మా అత్తగారూ వాళ్ళున్నారు పోలీస్ స్టేషన్ వైపు వెళ్ళక్కర్లేదు వెళ్తానని అంటే చాలు హడలిపోతారు . వెయ్యి రూపాయలు పోయినందుకు బాధ లేదు మోసపోయినందుకు బాధగా ఉంది ...ఇంకా నాలాగ ఎంతమంది మోసపోయారో తలుచుకుంటే ఇంకా బాధగా ఉంది .
ఆ తర్వాత airtel బ్రాడ్ బాండ్ పెట్టించుకోవడం ..(వచ్చినతన్ని స్కానింగ్ చేసి మరీ :) ) జరిగిందనుకోండి . " Tolet" " broadband" ఇలాంటి పాంప్లెట్లు ద్వారాచాలా సులువుగా ప్రజలనుమోసం చేయగలుగుతున్నారు. కాబట్టి మిత్రులారా తస్మాత్ జాగ్రత్త !
Subscribe to:
Post Comments (Atom)
శ్రీకాకుళం లో కూడా ఒక అతను ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్టు సమాచారం అందింది.
ReplyDeleteపరిమళ౦ గారు మీరు చెప్పి౦ది నిజమేన౦డి
ReplyDeleteమీలాగా చాలా మ౦ది మోసపోతున్నారు.
మోసపోయిన మీరు మరోకరు మోసపోకొడదని
అ౦దరి చెప్పడ౦ చాలా చాలా స౦తోష౦గా వు౦ది.
అన్నట్టు ఈ ఫోటో ఏరియాలోది చెప్ప౦డి.
ఏక్కడో చూసిన్నట్టు వు౦ది
hahha.baagne vunnayi........
ReplyDeleteconnect ichhina taruvata kada ichhedi......
మీరన్నట్లు డబ్బులు పోయినదానికన్నా మోసపోయినందుకే ఎక్కువ బాధ. ఉపయోగకరమైన సమాచారం ఇచ్చారు. మీరింకానయం పక్కాగా రసీదులు అని తీసుకున్నారు. నేనోసారి ఆర్టీవో పనిచేసి పెడతానంటే నోటిమాటమీద అడ్వాన్స్ ఇచ్చి పంపించా. అంత బుర్రలేకుండా ఎలా మోసపోయానో సిల్లీగా.
ReplyDelete"రిలయన్స్" ఈ పేరు లోనే అంత మోసం వున్నది.
ReplyDeleteవీళ్ళ 'Agency', 'Customer Care', 'Authorized Service Center', 'Call Center' అన్నీ మోస పూరితమైనవే..
2007 లో మా ఇంట్లో ల్యాండ్ లైన్ కోసం 'Agency' దగ్గరకు వెళ్లి అన్ని పేపర్స్ ఇచ్చి అప్లై చేసి వచ్చాను .
రెండు రోజుల్లో వచ్చి ఫోన్ సెట్ చేసి వెళ్లారు..2 డేస్ పని చేసి తరవాత డెడ్ అయ్యింది.
అప్పటినుండి 25 రోజుల వరకు అది బాగు కాలేదు. కాని బిల్లు మాత్రం వచ్చింది.
ప్రతి రోజు 'Agency', 'Customer Care', 'Authorized Service Center', 'Call Center' అందరికి కాల్ చేసి చేసి విసిగిపోయము.
చివరికి, బొంబాయి ఆఫీసుకి కాల్ చేస్తే....వాళ్ళు హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్ కి చెప్పి మా line కేన్సిల్ చేయించారు.
మా deposite అమౌంట్ 10 డేస్ తరవాత ఇచ్చారు .
అప్పటినుండి, "రిలయన్స్" అంటే...మోసం అని మార్చి చదువుకుంటున్నాం
Very Useful information...Thank u for sharing
ReplyDeleteBroad band lo ఇలాంటి మోసాలు నేను ప్రత్యక్షం గా ఫేస్ చేయలేదు కాని. మీరు చెపుతుంటే అయ్యో అనిపించింది..నావన్నీ.. సర్వీసు తీసుకున్న తరువాత .. తేలిన వాతలే.. అన్నట్టు.. నాక్కూడా ఇలాంటిదే పరిస్థితి ఎదురయింది.. కాకుంటే.. మొబైల్ prepaid విషయంలో .. ;)
ReplyDeleteప్ల్చ్... పాపం!
ReplyDeletechala bada ga vumdi kadanDi, nijamgaa ila mosam cheastaaraa.
ReplyDeleteNice wake-up call to many people... Kudos to you :)
ReplyDeleteఓమ్మో..ఇలాంటి మోసాలు కూడా మొదలా? అయినా హైదరాబాదు లో కనక్షన్ ఇచ్చి మనముందే ఇంటర్నెట్ టెస్టు చేసి కదండీ డబ్బులు తీసుకెళ్తారు?
ReplyDeletekevvvvvv...ఇలా కూడా చేస్తారా .. :O
ReplyDeleteఅందరికి తెలిసేలా మంచి పోస్ట్ చేశారు.
ReplyDeletenenu ilane mosapoya kakapotey adi palavadi daggara repatnunchi palu vestamu 1 month advance mundugane ivvandi ani memu illu shift ayina next day vachadu ....nenu vachi 1 yr ayyindi palu levu dabbulu..levu..meelane mosapoyani ani kullutho vadu ph temporarily out of service vachey varaku chestuney unna...
ReplyDeleteచాలా అన్యాయం అండి. ఏవిటో రోజు రోజుకీ రోజులు పాడైపోతున్నాయి.
ReplyDeletechala useful di cheparu
ReplyDeleteToo Much కదా.
ReplyDeleteనిజమేనండీ. మోసాలు పలురకాలు. మమ్మల్ని జాగారూకుల్ని చేసినందుకు ధన్యవాదాలు.
ReplyDeleteఅవునా ?? ఇలా కూడా చేస్తారా ? ఇకముందు కాస్త జాగ్రత్తగా వుంటే సరి .
ReplyDeletevery true :(
ReplyDeleteఎం చేస్తాం పరిమళ గారు ! అలావుంది పరిస్థితి మరి
ReplyDeleteఅందరికి తెలియచేసినందుకు దన్యవాదములు
ReplyDeletethank u 4 giving such a usefull news.
ReplyDeleteఇలాంటివి ఉన్నాయనే నేను ప్రభుత్వం వారి బి.ఎస్.ఎన్.ఎల్ బ్రాడ్‌బ్యాండ్ వాడుతున్నా..ఎటువంటి మోసాలు లేని..నెట్‌వర్క్ ఇది
ReplyDeleteస్పందించిన మిత్రులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు !!
ReplyDeleteడబ్బు పోవడం కన్నా మోసపోయాం అన్న భావన ఎక్కువ బాదిస్తున్దండీ.. ఒక పాఠం అంతే..
ReplyDelete