Thursday, August 19, 2010
జీవన సహచరుడు!
ఎగసిపడే కడలి తరంగాలు....
అవి కొన్ని సాగినా తీరం వైపు
తిరిగి తనలోనే దాచుకుంటుంది సాగరం!
ఆ అలల కలలు ఎంత ఉప్పొంగినా
అందుకోలేవు నింగినెన్నడూ
విడిపోలేవు సంద్రాన్నెప్పుడూ
మన అనుబంధమూ అంతే!
జీవితపు ప్రతి మలుపులోనూ ....
నా తోడువై ....నీడవై ......
చేయిపట్టి నడిపించావు
అడుగడుగునా నువ్వు చూపిన
ఓర్పు....నీ ఓదార్పు ...
నీ సహనం ...సహచర్యం ...
నన్ను నానుండి వేరుచేసేసి
నీలో కలిపేస్తున్నాయి...
ఎంతెలా అంటే ప్రియతమా!
మనవాళ్ళంతా పాలూ నీళ్ళలా
అనికాదు నువ్వు నేనులా ...
అనేంత !!
Subscribe to:
Post Comments (Atom)
Excellent!!!!! Parimalam gaaru.
ReplyDeleteI'am a regular reader of your blog but never posted any comments.
slowly I'am realising that it is important to post a appreciation comment when you really like it.
I liked many of your posts. Keep up the good work
చాలా బాగుంది. ఎంతలా అంటే కవితలంటే మీరే రాయాలి అన్నంతగా!
ReplyDelete"మనవాళ్ళంతా పాలూ నీళ్ళలా
ReplyDeleteఅనికాదు నువ్వు నేనులా ...
అనేంత !! "
ఆహా!
చాలా బాగుంది..ఎంతలా అంటే ఆ జీవన సహచరుడిపై కుళ్ళుకునేంతంగా...ఎంతలా అంటే అలాంటి జీవన సహచరుడిని పొందాలని మగువలందరూ ఆశ పడేంతంగా...
ReplyDelete"మనవాళ్ళంతా పాలూ నీళ్ళలా
ReplyDeleteఅనికాదు నువ్వు నేనులా ...
అనేంత !!"
చాలా చాలా బాగుంది :)
మీ కవిత చదువుతుంటే ఎక్కడో చదివిన ఇది గుర్తొచ్చింది.
"నువ్వు నేను అనే బహువచనాన్ని చెరిపేస్తూ
'నేనే' అనుకునేలా నాలో కలిసిపోవా ప్రియా!"
నిజం గా పరిమళాలు వెదజల్లుతాయండీ మీ కవితలన్నీ
ReplyDeleteardanaarieswarla laaga,aa goppathanam iddaridi
ReplyDeleteచాలా బాగుందండీ..
ReplyDeletehai parimalagaaru kushalamaa..chaalaa rojulanundi seeta kannesaaru maapai..
ReplyDeletenee kavitalanem pogadanu..
evarni podagaalanna .
.meeru parimalam kavitalaa.untaarane antaam..!
ఇలాంటి జీవన సాహచర్యం శాశ్వతం కావాలని ఆశిస్తూ..
ReplyDeleteబహు చక్కగా ఉందండీ.. వెడ్డింగ్ డే శుభాకాంక్షలు చెప్పాలనిపిస్తోంది.. :-)
ReplyDelete@ సురభి మీ అభిమానానికి చాలా చాలా థాంక్సండీ !
ReplyDelete@ సవ్వడి, మీరు మిగిలిన కవితల బ్లాగ్లు చూసినట్టులేదు...నా కవితలు ఆకాశం ముందు పిపీలికమంత కూడా కాదు సుమండీ!ధన్యవాదాలు.
@ దిలీప్ గారు, బహుకాల దర్శనం ! థాంక్స్ !
@ శేఖర్ గారు , ధన్యవాదాలండీ ....
@ ప్రణవ్ గారు , మీరు రాసిన వాక్యాల్లో భావుకత్వం తొణికిసలాడుతోందండీ ..నా చిరు కవిత మీకు నచ్చినందుకు థాంక్స్ !
@ స్నేహితుడు, ధన్యవాదాలండీ.
ReplyDelete@ గాజుల, థాంక్సండీ !
@ వేణూశ్రీ గారూ మీక్కూడా :)
@ రాఖీ గారూ, కొంచెం పర్సనల్ పనుల ఒత్తిడి వల్ల కొద్దిరోజులుగా నెట్ ఓపెన్ చేయటం కుదలేదండీ ...మీ అభిమానానికి థాంక్స్ ! కాని మీ పొగడ్తకి మాత్రం ఇంకా అర్హత సంపాదించుకోవాలి సర్ !
@ వర్మ గారు , థాంక్సండీ ! నాదీ అదే ఆశ !
@ మురళి గారు , సందర్భం అది కాకపోయినా మీ విషెస్ వెనక్కి తీసుకోకండెం :) ధన్యవాదాలు !
chala baga chepparamDi.... nice one.....
ReplyDelete@ Hanu garu, thanks!
ReplyDelete