Tuesday, September 7, 2010

నాకు కోపమా ....గుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్....


బుజ్జీ నువ్వీమధ్య ప్రతిదానికీ చిరాకు పడిపోతున్నావురా ....చెప్పనా వద్దా అన్నట్టు లోగొంతుకతో శ్రీవారు! నేనేం చిరాకు పడుతున్నా...అసలు మ్మిమ్మల్నేమైనా అన్నానా ...అన్నా మొహం చిట్లిస్తూ ...
ఆతర్వాత రెండురోజులకి ఈమధ్య నీకు కోపం ఎక్కువైపోతుంది బుజ్జమ్మా....బెరుకు బెరుకుగా చూస్తూనే నాఫ్రెండ్ !ఏం అలా చూస్తున్నావ్...నేనేమైనా మింగేస్తానా ..ఒక్క అరుపు అరిచేసరికి తను మాయం !!

కొద్దిసేపయ్యాక నేనే ఆలోచించుకున్నా ఏంటీ...నిజంగానే నాకు కోపం ఎక్కువైందా...అందరిమీదా చిరాకు పడుతున్నానా? అనుకుంటూ అద్దం దగ్గరకెళ్ళి గతుక్కుమన్నా...అసలు అద్దంలో ఉన్నది నేనేనా ? కాల్గేట్ పేస్ట్ మోడల్ లాగా కళకళలాడుతూ ఉండే మొహం ....ఇలా నొసలు చిట్లించుకొని చిరాగ్గా తయారైందేవిటీ..ఐతే వాళ్ళు చెప్పేది నిజమేనన్న మాట అనుకొంటూ కారణాల కోసం వెదికితే ఒకటి బీపీ ఐనా వచ్చుండాలి (అప్పుడే వచ్చేస్తుందా ...ఏమో చెప్పలేం) లేదా ఈ మధ్య మా సునీత (పనిమనిషి) రాక ఆ పనులుకూడా చేసుకోవాల్సొచ్చి వీళ్ళమీద చిరాకు పడుతూఉండాలి అనుకొని స్థిమిత పడ్డాను.

ఊరెళ్ళిన పనిమనిషి వచ్చేసింది. ఆ తర్వాత కూడా అంతాఇంకా భయం భయంగా ....బెరుకుగా చూస్తున్నట్టే అనిపించింది. ఇలాక్కాదని ఒక శుభముహూర్తం చూసుకొని మా ఇంటికి దగ్గరలోని హాస్పటల్ కి వెళ్లి బీపీ చెక్ చేయించుకున్నా!ఏమీలేదని తేలింది. డాక్టర్ ఇంచుమించుగా మా ఫ్యామిలీ డాక్టర్ వంటి వారు....విశాలంగా నవ్వుతూ ఇప్పుడీ అనుమానం ఎందుకొచ్చింది నీకు అని అడిగింది.ఈమధ్య కాస్త కోపం ఎక్కువైనట్టు అనిపిస్తుంది డాక్టర్ p.m.s కూడా కాదు అన్నా! ఇంట్లో ఏమైనా సమస్యలా ...లేదు డాక్టర్ ఇలాగే ఉంటే ఇంట్లో వాళ్లకి నేనే సమస్యవుతా ! ఏం కాదులే....రోజూ ఓ పదినిముషాలు ధ్యానం చేయి అన్నీ సర్దుకుంటాయి అన్నారావిడ నవ్వుతూనే ...

150/- ఫీజు తీసుకొని ఈవిడ చెప్పే సలహా ఇదా అని మనసులో విసుక్కుంటూ...పైకి మాత్రం ఓ వెర్రినవ్వు పడేసి ఇంటికోచ్చేశా. ఐతే ఆలోచిస్తే ఆవిడ చెప్పింది మంచిదేననిపించింది.ధ్యానం వల్ల కోపం , ఒత్తిడి , మానసిక ఆందోళన తగ్గుతాయని...ఇంకా ఆరోగ్యపరంగా చాలా ఉపయోగాలున్నాయని పేపర్లో చదివినవీ ...టీవీలో చూసినవీ అన్నీ గుర్తుకొచ్చేశాయి. సరే! ఏ పుట్టలో ఏపాముందో...ఇంతమంది మేధావులు ఊరికే చెప్పారు కదా వింటే తప్పేంటి ...రోజూ పదినిముషాలేగా చేసేద్దాం....అని నిర్ణయించుకున్నా....

నా ధ్యానం విశేషాలు తర్వాతి టపాలో.....

15 comments:

  1. మొత్తానికి కోపధారి అయ్యారన్నమాట, అదుగో నా వైపు కుడా కోపం గా చూస్తున్నారు. ధ్యానం ధ్యానం...

    ReplyDelete
  2. వాళ్ళంతా చెప్పింది నిజమే. మీకు కోపం ఉంది. :)). మీకు కోపం లేకపోతే పైన టైటిల్లో "గుర్ర్‌ర్ర్‌ర్ర్‌ర్ర్" అని కాకుండా, ఒక స్మైలీ పెట్టేవాళ్ళు. అలాగే టపాలో చిరాకు ఫేస్‌తో, నొసలు చిట్లిస్తున్న ఫోటో కాకుండా, అందంగా నవ్వుతున్న కోల్గెట్ మోడల్ ఫోటో పెట్టేవాళ్ళు. :))

    బాబోయ్, తొందర్లో నిజాలు చెప్పేశాను. నా మీద కూడా కోప్పడతారేమో...ఎందుకైనా మంచిది నేను ఇక్కడి నుంచి జంప్. :-)))

    ReplyDelete
  3. అదేదో మీకు పని చేస్తే నాకు చెప్పండి... ఈ మధ్య ఎవరేమన్నా ఏంటోలే అంతా భ్రమ అని దులిపేసుకుంటున్నా ... ఎదో దిగులు అన్నమాట :)

    ReplyDelete
  4. Thanks for your wishes. I have cleared the exam with good percentage.

    ReplyDelete
  5. తొందర తొందరగా చెప్పేయండి, ప్లీజ్. ఫలితమేంటో. ఏవిటో, నేనూ ప్రయత్నించాను చాలాసార్లే కాని... నిశ్శబ్ధంగా కళ్ళుమూసుకొనే సరికి ఇంకా తీరిగ్గా ఎన్నో ఆలోచనలొచ్చి....ఊహు, లాభం లేదులెండి.

    ReplyDelete
  6. all the best andi mee dhyanaaniki .

    ReplyDelete
  7. నేను చిరాకుపడినప్పుడల్లా మా నాన్న అనేవారు "మొహం అలా చిట్లించకు.కనుబొమ్మలు రెండూ సెలో టేప్ వేసి అతికించేస్తా..." అని.

    అన్నట్టు, ఈ రోజుల్లో 150/- ఫీజ్ తీసుకునే డాక్టర్లు ఇంకా ఉన్నారాండి? నాకు తెలిసి మొన్నటిదాకా 200 ఫీజున్న వాళ్ళందరూ 300/- చేసేసారే..??

    మొన్నామధ్యన ఒక మాగజైన్ లో "ధ్యానం" అని ఒక కధ చదివానండీ. సూపర్..! కధ మొదటి నుంచీ గంట సేపు "ధ్యానం" చేసుకున్న ఒక అత్తగారు, గది బయట జరుగుతున్న విషయాల గురించి ఎంత శ్రధ్ధగా ఆలోచిస్తుందో ఫన్నీగా రాసారు. మీరు అత్తగారు కాకపోయినా, టపా చదవగానే మీరూ అలానే ధ్యానం చేస్తారేమో.... అనిపించింది...:)
    ఇప్పుడు మీకు నామీద గుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్...??

    ReplyDelete
  8. inthaku mee kopaaniki kaaranamu dyaanamu chesaaka ayinaa chebutaaraa?

    ReplyDelete
  9. చెయ్యండి చాలా మంచిది....

    ReplyDelete
  10. meeru tondaraga adedo chesthe !
    papam aa pichci mahanubhavudu batuku jeevuda anukuntademo...!
    mottam meda 150 ki manchi salane andindi meeku...!

    :)))

    ReplyDelete
  11. పరిమళం గారూ...,మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చతుర్థి పర్వదిన శుభాభినందనలు

    హారం

    ReplyDelete
  12. భ్రుచాతుర్యాత్ కుంచితాక్షి కటాక్షి ,
    స్నిగ్ధావాచో లజ్జితాన్తాస్చ హాసౌ,
    స్తితంచ ప్రస్తితంచ
    స్త్రీణామ్ ఏతత్ భూషణం చ ఆయుధం చ,
    మీకోపం, పై శ్లోకాన్ని బట్టి చూస్తే అంత ప్రమాదం కాదేమోనండి, నా సలహా ఐతే మీరు ధ్యానం లాంటివేమీ చేయనక్కరలేదు. ఇలాగే ఉందని. (సరదాకి రాసిన కామెంట్ .)

    ReplyDelete
  13. ప్రసాంతమైన వాతావరణంలో ఓ మంచి మ్యూజిక్ వినండి...ఒక్కోసారి పెద్దవాళ్ళకు వాళ్ళకి తెలీకుండానే కొంచెం చాదస్తం వచ్చేస్తుంది..దానివల్ల కూడా ఉత్తుత్తినే కోపం తెచ్చేసుకుంటారు వారనుకున్నట్టు జరగటంలేదని...అదిగోండి నా వైపు గుర్రుగా చూస్తున్నారు మీరు...నేను కూడా జంప్ ఇక్కడ నుండి...:-)

    ReplyDelete
  14. @ నాటపాకు స్పందించిన మిత్రులకు..... :) :)

    @ నా కోపానికి గురైనవారికి...... :| :|

    ReplyDelete