Thursday, August 20, 2009
అనుకోకుండా ఒక రోజు ...
అవి నేను స్కూల్లో చదువుతున్న రోజులు . అనుకోకుండా ఓ రోజు మాకు కాస్త దగ్గరి చుట్టరికం ఉన్నా బాబాయి గారింట్లో చిన్న ఫంక్షన్ ఉందంటే నేనూ స్కూల్ ఎగ్గొట్టి అమ్మా , నాన్నగారితో బయల్దేరా .అప్పటివరకూ నాన్నగారి ఉద్యగారిత్యా మేం దూరంగా ఉండటం వల్ల నేనెప్పుడూ వాళ్ళింటికి వెళ్ళింది లేదు .వాళ్లు మాత్రం తిరుపతి వెళ్ళినప్పుడల్లా ...మేముండేది దారిలోనే కాబట్టి మధ్యలో ఆగి మాఇంట్లో రెండు మూడు రోజులుండి వెళ్ళేవాళ్ళు .
నేనుమాత్రం ఆ ఊరెళ్ళటం అదే మొదటిసారి !రాజమండ్రి దిగి సిటీ బస్ లో వెళ్ళాలి . అబ్బ ..బస్ ఎంత రష్ గా ఉందో ...దాదాపుగా ఒంటికాలుమీద నిలబడాల్సివచ్చింది . అసలే అతికష్టం మీద ప్రయాణం చేస్తుంటే ...నేను నిల్చున్న పక్క సీటు లో కూర్చున్న పెద్దావిడ కొత్తగా వస్తున్నట్టున్నారు , ఎవరింటికీ అంటూ ఆరా ..అంతకాడికి ఆ బస్ ఎక్కేవాల్లందరూ తనకు తెలుసన్నట్టు ! ( తర్వాత తెలిసింది లెండి ఊళ్ళల్లో కొత్తగా ఎవరొచ్చినా ఊరంతా తెలిసి పోతుందని :) ) సమాధానం చెప్పాక అక్కడితో ఆగితేనా ..వారికి నువ్వేమవుతావు ...ఏం చదువుతున్నావు అంటూ ఒకదానివెంట మరొకటి ...అంతలో ఆ బస్ కు చివరి స్టేజ్ ...మేం దిగాల్సిన గమ్యం వచ్చేసింది .
అప్పటివరకూ జనం మధ్య కూరుకుపోయి ఉన్నామేమో ...బస్ దిగగానే చల్లటిగాలి చుట్టుముట్టింది .చుట్టూ చూశా ...ఎదురుగా గుడి ...ప్రశాంతమైన వాతావరణం ...పక్కనే చెరువు ...పెద్ద రావిచెట్టు చుట్టూ గట్టు ....గోధూళి వేళేమో...ఆ సమయంలో పల్లెటూరు ఎంత సందడిగా ఉంటుందో మీకు చెప్పాలా ? అబ్బ ఎంత బావుందీ ఊరు అనుకున్నా ....అప్పుడు తెలీదు నాకు జరగబోయేదేంటో ......
* పెద్ద సస్పెన్స్ ఏమో అని అనుకోకండి ...అంత సీన్ లేదు ....టపా చాలా పెద్దగా ఐపోతుందేమో అనిపించి ఆపేస్తున్నా ...మిగతాది తర్వాతి టపాలో ....
Subscribe to:
Post Comments (Atom)
సప్సెన్స్(సస్పెన్స్ కాదు) అన్నమాట!
ReplyDeleteaa prasnaladigina peddavida mee baabaigaari chuttamaemoe !
ReplyDeleteసర్లెండి , అయితే కామెంట్ కూడా తర్వాతే పెడతా.
ReplyDeleteత్వరత్వరగా చదివేస్తూ టక్కున ఆగిపోయా..సీరియల్ రాస్తున్నారా?
ReplyDeleteనేను దీనిని ఖండిస్తున్నా.. ఇంత చిన్న పోస్ట్ రాసి మళ్ళీ పెద్దదవుతుందేమో అని అంటారా.. ఇంకోకటి రాసెయ్యండీ ఇప్పుడే...
ReplyDeleteఅబ్బా అంత సస్పెన్స్ లో పెట్టేస్తే ఎలాగండీ?రేపటిదాకా కడుపునెప్పి ఆగదే..??ఎలా ఎలా...?!
ReplyDeleteఆ ఊరిలో అబ్బయితొనే మీ పెళ్ళి జరిగిందా?
ఆ ఊరే ఇప్పుడు మీ సొంతూరు[అదే మెట్టినూరు] అయ్యిందేమిటి?
ReplyDeleteపేడలో కాలు వేసి ఉంటారూ!! గొడ్డుగోదాని చూస్తూ మురిసిపోతూ కింద చూస్కుని ఉండరు
ReplyDeleteఅన్యాయం మీరు కూడా నా పద్దతిలో కధ ఆపితే జనాలు మీరు నన్ను ఫాలో అవుతున్నారని అనుకుంటారు నేను యండమూరి స్టైల్ ని ఫాలో అయినట్టు గా..అయిన మీరు తర్వాత ఏం జరిగి వుంటుందో వూహించి రాయండి అంటే నాలాంటి రచయతలకి చేతి నిండా పని దొరికేది.
ReplyDeletehai nicepost
ReplyDeleteసస్పెన్స్ లో పెట్టి సస్పెన్స్ ఏమీ లేదంటారా.....? :)
ReplyDeleteఇంతకీ ఏమి జరిగిందీ? ఆ ప్రశ్నలడిగిన ఆవిడకు మీరు తెగ నచ్చి ( కొంత కాలం తరువాత ) వాళ్ల అబ్బాయినిచ్చి వివాహం చేశారా?
సస్పెంస్ ను త్వరగా విప్పేయండి.
ReplyDeleteవినాయక చవితి శుభాకాంక్షలు
ReplyDeleteపరిమళం గారు జనాలతో ఆడుకోవడం ఏమీ బాగాలేదు.. నేను చేసేది కూడా అదే అనుకోండి :) నెక్స్ట్ పోస్ట్ కోసం waiting
ReplyDeleteవినాయక చవితి శుభాకాంక్షలు
@ విజయమోహన్ గారూ !అలాంటిదేనండీ :)
ReplyDelete@ మాలాకుమార్ గారూ ! తర్వాత పోస్టులో చెప్తానండీ :)
@ లలిత గారూ ! మీ తర్వాతి కామెంట్ కోసం ఎదురు చూస్తా :)
@ మురళి గారు సీరియల్ కాదండీ ఒక టపాగా రాస్తే మరీ పెద్దగా అవుతుందేమోని విడదీసి రాస్తున్నానంతేనండీ :)
@ భావనగారు , త్వరగానే రాస్తానండీ లేకపోతె ఈభాగాన్ని మీరంతా మర్చిపోరూ :)
@ తృష్ణ గారూ !అంత సస్పెన్స్ ఏం లేదండీ తర్వాతి టపాలో చూడండి :)
@ రాధికగారూ ! మీరుకూడా :)
@ భాస్కర్ రామరాజుగారుఅదేం కాదు కానీ మీరు పప్పులో కాలు వేశారు :)
@ రవిగారు , ఏదో అంటున్నారుగానీ మిమ్మల్ని ఫాలో అయినంత మాత్రాన మీలా రాయగాలనాండీ ...పోనీ మీరే గెస్ చేసి కామెంట్ రాయండి .నిజంగా జరిగినదానికంటే మీరింకా ఆసక్తికరంగా రాయగలరు :)
@ అనఘ గారు థాంక్స్ !
@ విశ్వ ప్రేమికుడుగారు మీరుకూడానా :)
@ వర్మగారూ ! నిజంగానే పెద్ద సస్పెన్స్ కాదండీ ఓ చిన్న సంఘటన అంతే :)
@ శివగారు మీకూ వినాయక చవితి శుభాకాంక్షలండీ !
@ హరేకృష్ణ గారు , తర్వాతి పోస్ట్ త్వరగానే రాస్తానండీ ..మీకూ వినాయక చవితి శుభాకాంక్షలు !