Monday, August 31, 2009

అనుకోకుండా ఒకరోజు -3


ఇంకా వడ్డిస్తూ ఉండగానే నాకు లోపలినుండి పిలుపొచ్చింది . వెళ్ళగానే మొహం కడుక్కో ...జడ వేసుకో అంటూ పిన్ని అమ్మ ఆర్డరు ! ఎన్నిసార్లు వేసుకోవాలి ?నేనేమో ఇప్పుడెందుకు అని పేచీ ...అసలే మనం పెంకి ! బాబాయి అమ్మతో అంటున్నారు అబ్బాయి కాస్త కలర్ తక్కువ కానీ బుద్ధి మాత్రం బంగారం వదినా ...మనమ్మాయి పెద్ద రంగేంటీ ....అని అమ్మ అంటూంటే నేను నలుపా అని ఆశ్చర్యంగా నావైపు చూసుకున్నా ! విషయం కొద్దికొద్దిగా అర్ధమవుతోంది .ఇలా నేను మొహం కడగను అని మొండికేస్తుండగానే పుణ్యకాలం కాస్తా ఐపోయింది . అబ్బాయి వచ్చేశాడు అంటూ నన్ను వంట చావిట్లోకి నెట్టేశారు . ఓ ఐదు నిముషాలకి నన్ను తీసుకొచ్చి వాకిట్లో నించోబెట్టారు . వాళ్లు వరండా మీద ఉన్నట్టున్నారు చూద్దామంటే చెప్పేవరకూ తలెత్తకూడదని పిన్ని ఆర్డరు !

ఏమండీ మా అమ్మాయి నచ్చిందా ...నాన్నగారు అడుగుతుంటే సమాధానం వినపడ్లేదుకానీ అందరూ పెద్దగా నవ్వటం తెలుస్తోంది . లోపలనుండి తన్నుకొస్తున్న ఉత్సుకతని ఆపుకోవడం చాలా కష్టంగా ఉంది ఇక ఎవరేమనుకున్నా సరే తలవంచుకొని నిలబడటం నావల్లకాదు ( అసలే చిన్నప్పటినుంచీ ఎవరికీ తలవంచకు అనే పాటవిని ఇన్స్పైర్ ఐనదాన్ని ) అనుకుంటూ ఉండగా నాన్నగారు నాపక్కకొచ్చి అబ్బాయిని చూడరా ...అన్నారు ఆమాటకోసమే ఎదురుచూస్తున్నానేమో గభాల్న తలెత్తి చూసిన నేను అయోమయంలో పడిపోయాను . అక్కడ ఇద్దరబ్బాయిలు నిలబడి ఉన్నారు . ఇంచుమించుగా ఒకేలా ఉన్నారు . ఎవరినడగాలో అర్ధం కాలేదు . అయినా అందరిముందూ ఎలా అడగను ? అనుకుంటూ మరోసారి ఇద్దర్నీ కాస్త పరీక్షగా చూశా ! ఒకబ్బాయి కాస్త మందంగా పౌడర్ రాసుకొని ప్రత్యేకంగా తయారైనట్టు అనిపించింది . అంతలో వాళ్లు వెళ్ళిపోవడం వెళ్తూ ..ఆ అబ్బాయి మరోసారి తిరిగి నావైపు చూడటం ...అందరూ అది చూసి నవ్వుకుంటూ నాచుట్టూ చేరి అబ్బాయి నచ్చాడా అంటూ అడగటం జరిగింది . లైట్ కలర్ షర్ట్ వేసుకున్నబ్బాయేనా అంటూ మాతమ్ముడి నడిగా ! అవునన్నాడు ఓహో ..శభాష్ రా బుజ్జిగాడూ నీ గెస్సింగ్ కరెక్ట్ అంటూ నాభుజం నేనే తట్టుకొని ...వాడినే సీక్రెట్ గా సిగరెట్ కాలుస్తారా అని అడిగా మందు తాగినా ఫర్వాలేదన్నట్టు ! అసలే మనకి సిగరెట్ అంటే పడదు లెండి ( దానికో చిన్న ఫ్లాష్ బాక్ ఉంది మరెప్పుడైనా చెబుతా ) ఛ ఛా లేదక్కా అన్నాడు వాడు .అంతే నచ్చినట్టూ తల ఊపాను .

అప్పట్లో అమాయకత్వం తప్ప చదువెమైపొతున్ది ? ఇంత చిన్నప్పుడే నాకు పెళ్ళేంటి అన్న ఆలోచనే లేదు . పైగా అప్పట్లో నేను చూసిన కొద్దిపాటి సినిమా నాలెడ్జ్ వల్ల ఒక్కసారి పెళ్లి చూపులకి పెళ్లి కుదరదని నా నమ్మకం :) పైగా జిడ్డు మొహమేసుకొని వెళ్లి నిలబడ్డానాయే ...
ప్చ్ ..కానీ....విధి బలీయం కదా :( వెంటనే మాటలు జరిగిపోయినై ...ఎల్లుండే నిశ్చితార్దానికి మంచిదన్నారు .....అలా అనుకోకుండా ఒకరోజు నా పెళ్లి ఫిక్స్ ఐపోయింది .

** ఇది నావైపు కధ ! అసలు తెరవెనుక కధ తర్వాతి టపాలో ....

14 comments:

  1. అమ్మయ్య నేను అనుకుంటూనే వున్నా.. అంత పని అవుతుంది అని... అలా ఆ లైట్ కలర్ చొక్క అబ్బాయి గారు వరుడయ్యాడు. పేరైనా అడిగేరా?

    ReplyDelete
  2. ఓహో..సీ రియల్ అన్నమాట.. కానివ్వండి. మరీ ఇంత బుల్లి టపా రాసి సస్పెన్స్ లో పెట్టడం భావ్యమా???

    ReplyDelete
  3. Quite interesting, waiting for the next post.

    ReplyDelete
  4. అయితే తెరవెనుక కధలో సస్పెన్స్ ఉందన్నమాట!!

    ReplyDelete
  5. నేను ముందరే చెప్పానా... ? ఇలాంటిదేదో ఉంటుందనీ.....?
    బాగుంది... బాగుందీ.... తరువాతా... :-)

    ReplyDelete
  6. నేచెప్పాగా హా హా హా......రాధీ గ్రేట్ రా నువ్వు. పెళ్ళికొడుకుని భలే కనిపెట్టేసారే.మీరూ గ్రేటే.

    ReplyDelete
  7. తాళికట్టే టైం కి వేరే అమ్మాయో , లేకపోతె ఏ పోలీసు వాళ్ళో వచ్చి ఆపండి అన్నారాకొంపతీసి?.మీరు కధ ఆపిన పద్దతి ప్రకారం అలానే రాసుకోవాలి.ఇంతకీ అయ్యిందా లేదా?నా జరిగిన కధ లో సస్పెన్స్ కన్నా మీ జరిగిన కధ లో సస్పెన్స్ ఎక్కువై పోయింది నాకు .

    ReplyDelete
  8. స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు !
    ముందుగానే ఊహించినవారికి శభాష్ లు !
    ఇక ముఖ్యమైన విషయం మరోసారి మీ అందరూ క్షమించాలి ఇప్పుడుకూడా సస్పెన్స్ ఏం లేదు. కేవలం నావెనుక అంటే పెళ్లి కుదరటం ఎలా జరిగింది అనే విషయం రాద్దామనుకుంటున్నా అంతే !
    @ రవిగారూ ! అలా ఏం లేదండీ బాబూ ! మీ కధలో సస్పెన్స్ తో మమ్మల్ని పెట్టేస్తూ ఈ కధ సస్పెన్స్ అంటారేంటండీ :)

    ReplyDelete
  9. మొదటి భాగం చదివినప్పుడు ఏమీ అనిపించలేదు కానీ.. రెండో భాగంలో మాత్రం కొంచం అనుమానం వచ్చిందండీ.. అన్నట్టు మీకో సరదా సంగతి.. నా టీనేజ్ లో నా డ్యూటీ ఏమిటంటే అత్తయ్యల అమ్మాయిలని చూడ్డానికి వచ్చే అబ్బాయిలకి తెలియకుండా వాళ్ళ పక్కన నిలబడాలి.. అప్పుడు మా వాళ్ళు హైట్ కొల్చుకునేవాళ్ళన్న మాట.. అలా ఎన్ని సార్లు కొలబద్ద ఉద్యోగం చేశానో.. తర్వాతి భాగం త్వరగా రాసెయ్యండి మరి...

    ReplyDelete
  10. అమ్మయ్య ! మొత్తానికి పెళ్ళి కుదిరిందన్నమాట.

    ReplyDelete
  11. బాగుందండీ! అలా పెళ్ళి కుదిరిందన్నమాట. తెర వెనుక కథ తొందరగా రాసేయండి.

    ReplyDelete
  12. @ మురళీ గారు , మీ కొలబద్ద ఉద్యోగం భలే ఉందండీ ..ఇప్పుడైతే బయోడేటా లోనే రాసేస్తున్నారు :)
    @ మలాగారు ,శ్రీగారు ....తర్వాతిభాగం చూడండి :)

    ReplyDelete
  13. నేను మొదటి టపా చూసినప్పుడే రాసాను గుర్తుందాండి...నా అంచనా కరక్టే నన్నమాట!!

    ReplyDelete