కరిగి పోయిన కలేమో మన
పరిచయం అనుకుందామంటే ...
నీ జ్ఞాపకాల ఊటను కన్నుల్లో
నింపుతున్న గతం నన్ను
నీడలా వెంటాడుతోంది....
కట్టెను వదిలి ప్రాణం పయనమై పోతుంటే
కళ్ళప్పగించి చూస్తూండి పోయిన క్షణం!
బాధ్యతల ఉక్కు సంకెళ్ళ మధ్య
బందీనై నిలుచుండి పోయాను
నేస్తం!
ఇన్నేళ్ళ మన సావాసంలో
ఎన్నో విలువైన కానుకలిచ్చావు
అవన్నీ నాతోనే వున్నాయి
నువ్వు మాత్రం నన్ను విడిచి
దూరపుకొండల వైపు సాగిపోయావు
నువ్విచ్చిన చివరి కానుకేమో ఈ శూన్యం!
బహుశా అదే తోడుగా వుంటుంది
నా ఈ ఏకాంత వాసంలో....
శూన్యమే మాన్యమైన వేళ ...
ReplyDeleteఅంతటా ఆర్ద్రత ...
బాగుంది మేడం గారు ...
శూన్యమే మాన్యమైన వేళ ... :)
ReplyDeleteమీ స్పందనకు ధన్యవాదాలు రావుగారు!