ప్రియమైన పరిమళం
బ్లాగుల విరితోటలో నువ్వు చిరు పుష్పంలా విరిసి సరిగ్గా నాల్గు సంవత్సరాలు. కష్టాలూ సుఖాలూ, ఇష్టాలూ నష్టాలూ, అలకలూ అల్లర్లూ, కధలూ కాబుర్లూ... ఇవన్నీ పంచుకోవడానికీ, అప్పుడప్పుడూ మనసులోని భారం దించుకోవడానికీ నువ్వే వేదికయ్యావ్. తెలుగు బ్లాగుల సుమహారంలో నాకూ చోటు కల్పించావ్. ముఖపరిచయమైనా లేని వారితో అనుబంధం ఏర్పరిచావ్.నేను భయపడిన వేళ ధైర్యాన్నిచ్చి, బాధపడిన వేళ ఓదార్పునిచ్చి, నిరుత్సాహపడిన వేళ ప్రోత్సహించి, నా రాతలను భరించి, పొరపాట్లను సరిదిద్ది తమ చెలిమిని పంచిఇచ్చే మిత్రులను నాకు ఇచ్చావ్. చెలిమిని మించిన కలిమి కలదా ఇలలో... అటువంటి అపురూపమైన కానుకను నువ్వు నాకు ఇచ్చావు. పరిమళం ఐ లవ్ యూ.... పుట్టినరోజు జేజేలు కూడా...
* పరిమళాన్ని అనుసరిస్తున్న, మరియు ప్రోత్సహిస్తున్న బ్లాగ్ మిత్రులందరికీ కృతజ్ఞతాభివందనాలు!
మీ బ్లాగుకు పుట్టినరోజు శుభాకాంక్షలు..:)
ReplyDeleteనాలుగు వసంతాలు నిండిన పరిమళం బ్లాగుకు జన్మదిన శుభాకాంక్షలు..
ReplyDeleteబ్లాగ్ పుట్టిన రోజు శుభకామనలు
ReplyDeleteమీ బ్లాగుకు పుట్టినరోజు శుభాకాంక్షలు, మీకు అభినందనలు :)
ReplyDeleteఅభినందనలు పరిమళం గారూ!...
ReplyDeleteమీ బ్లాగ్ లోని పరిమళాలు
బ్లాగుల లోకం ఉన్నంత కాలం ఇలాగే పరిమళించాలని
ఆకాంక్షిస్తూ...@శ్రీ
పరిమళం బ్లాగుకు జన్మదిన శుభాకాంక్షలు..
ReplyDeleteబ్లాగుకు పుట్టినరోజు శుభాకాంక్షలు :)
ReplyDeleteమీరు చెప్పినది నిజం. శరీరంలో,మనసులో,ఆలోచనల్లో భాగమైన బ్లాగ్ ని ఎవరు విడదీయగలరు చెప్పండి. !?
ReplyDeleteపరిమళాలు వెదజల్లుతూ.. మరిన్ని పుట్టిన రోజులు జరపుకోవాలని ఆకాంక్షిస్తూ..
హ్యాపీ బర్త్ డే ..పరిమళం
బాగుందండీ. అభినందనలు.
ReplyDeleteHappy Birthday parimalam .
ReplyDeleteహృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలండీ మీ బ్లాగుకు :)
ReplyDeleteఇంత చక్కటి పరిమళం వెదజల్లు తున్న మీకు శుభాకాంక్షలు....అభినందనలు. కలకాలం ఈ 'పరిమళం' ఇలాగే గుభాళించాలి.
ReplyDeleteఅభినందనలు పరిమళం గారు
ReplyDeleteతీరుబడి లేని పనుల యొత్తిడుల నుండి
ReplyDeleteకాస్త యుపశమన మిడు ' ప్రశస్త మైన
పని ' పరిమళ గారు ! మనకు 'బ్లాగు రచన '
ఐదవ వసంతపు తొలి శుభ మందు కొనుడు .
----- సుజన-సృజన
పరిమళానికి జన్మదిన శుభాకాంక్షలు! ఇలానే ఎన్నో సుగంధ పరిమళాలను నిత్యం వెదజల్లుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ReplyDeleteపరిమళానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. కాస్త ఆలస్యంగా... :)
ReplyDeleteఇలాంటి మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
janma dina..mariyu nootana samvatsara shubhaakaankshalu..!
ReplyDelete